దక్షిణ భారతదేశం: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను గురించి → గురించి, ను → ను (7), గా → గా , తో → తో (3), భంధ using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రూ. → రు., లో → లో (15), ద్వార → ద్వారా , సాంప్రదాయా → సంప్రద using AWB
పంక్తి 5:
దక్షిణ భారతీయులు ముఖ్యంగా [[ద్రవిడ భాషలు]] మాట్లాడెదరు అనగా [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడ]], [[మలయాళం]].కానీ కొన్నిచోట్ల [[కొంకణి]], [[తుళు]] వంటి భాషలు కూడా మట్లాడెదరు. దక్షిణ భారతాన్ని ఎందరో రాజులు పరిపాలించారు. అందులో ముఖ్యులు [[శాతవాహనులు]], [[ఆంధ్ర ఇక్ష్వాకులు]], [[చోళులు]], [[పాండ్యులు]], [[చేరులు]], [[చాళుక్యులు]], [[రాష్ట్రకూటులు]], [[హొయసల సామ్రాజ్యం|హొయసల]] మరియు [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర రాజులు]]. దక్షిణ భారత రాజవంశాలు [[శ్రీలంక]] మరియు [[శ్రీవిజయ]]లను జయించడం వలన ఇప్పటికీ దక్షిణ భారత సాంస్కృతిక ప్రభావం వారి జీవన విధానాలలో కనిపిస్తుంది.
 
ఇచట వ్యవసాయం ప్రధాన వృత్తి. మొత్తం స్థూల ఉత్పత్తిలో [[వ్యవసాయం|వ్యవసాయాని]]దే మొదటి స్థానం. [[సాఫ్టువేరు]] రంగం ఇచట చాలా వేగంగా విస్తరిస్తోంది. దేశంలోని సాఫ్టువేరు ఉత్పత్తిలో అధికశాతం దక్షిణ భారతదేశంలోని నగరాలలోనే తయారవుతోంది. చలన చిత్ర రంగం లోరంగంలో కూడా దక్షిణాది తనదైన ప్రత్యేకతతో ప్రపంచం లోని వివిధ దేశాల ప్రజలను అలరిస్తోంది. దక్షిణ భారతదేశంలోని ప్రజలు దేశంలోని మిగిలిన ప్రజలకన్నా [[విద్యారంగం]]లో ముందుండి అత్యధిక [[తలసరి ఆదాయం]] కలిగియున్నారు. ఇచటి విద్యారంగం మరియు వ్యవసాయం రెండు వేల సంవత్సరాలుగా తన వైశిష్ట్యాన్ని, ప్రత్యేకతను చూపుతున్నాయి. ఇచటి రాజకీయాలలో ప్రాంతీయ పార్టీల ప్రభావం అధికం.
 
దక్షిణ భారతానికి [[ఆంగ్లం]]లో ఉన్న ''సౌత్ ఇండియా'' (South India) అనే కాక సంస్కృత పదం ''దక్షిణం'' వలన ''డెక్కన్'' (Deccan) అని కూడా పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం ''డెక్కన్'' అన్న పదం [[దక్కను పీఠభూమి]]కి మాత్రమే పరిమితమైంది. కర్ణాటక (Carnatic) అను పదం "కరునాడు" అనగా నల్లని దేశం అన్న పదం నుండి పుట్టింది. [[ద్రవిడనాడు]] అనునది దక్షిణ భారతానికి ఉన్న మరొక పేరు. అలాగే వివిధ రాష్టాలలోని ప్రజలను వారి వారి భాషను బట్టి కూడా పిలుస్తారు. ఉదాహరణకు తెలుగు మాట్లాడు వారిని ఆంధ్రులు అని, మలయాళం మాట్లాడువారిని మలయాళీలు అని పిలుస్తారు.
పంక్తి 72:
== జనాభా వివరాలు ==
 
ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మరియు తమిళనాడు లతో కూడిన దక్షిణ భారతదేశం మొత్తం మీద 233 మిలియన్ జనాభా ఉన్నారు.<ref name=demographics>{{cite web |url=http://www.censusindiamaps.net/page/Religion_WhizMap1/housemap.htm |title=Census India Maps |accessdate=2006-04-11}}</ref>. ఇది వివిధ రకాలైన జాతుల, మతాల, భాషలకు పుట్టినిల్లు. వీరిలో [[ఆంధ్రులు]], [[తమిళులు]], [[కన్నడిగులు]], [[మలయాళీలు]], మరియు [[కొంకణీయులే|కొంకణీయులు]] అత్యధిక శాతం. మొత్తం జనాభాలో 83% మంది హిందువులు, 11% మంది ముస్లింలు, 5% మంది క్రైస్తవులు. భారతదేశంలో క్రైస్తవులు అత్యధికంగా ఉన్న ప్రాంతాలలో దక్షిణ భారతదేశం కూడా ఒకటి. [[రోమన్ కాథలిక్]], [[ఇండియన్ ఆర్థోడాక్సు]], [[సిరియన్ జాకోబైట్]], [[ప్రొటెస్టంట్లు]], [[సైరో-మలబార్]], మరియు [[మర్తోమా]] మొదలైనవి కొన్ని క్రైస్తవ సాంప్రదాయాలుసంప్రదాయాలు. [[జైనులు]], [[బౌద్ధులు]], [[యూదులు]], మరియు ఇతర మతాల వారు 1% కంటే తక్కువగా ఉంటారు.
 
[[దస్త్రం:Mattancherry palace bhagvathy kshetram.JPG|170px|thumb|left|సాంప్రదాయక 'నూనె-దీపం' కేరళ)]]
పంక్తి 96:
|}
 
దక్షిణ భారతదేశంలో దాదాపు 50% ప్రజలు [[వ్యవసాయం]] ప్రధాన వృత్తిగా కలిగి ఉన్నారు.<ref name="demographics"/> [[భారతదేశం]] లోని ఇతర ప్రాంతాల వ్యవసాయదారుల మాదిరిగా ఇక్కడి రైతులు కూడా ప్రధానంగా నీటి కొరకు వర్షపాతం ముఖ్యంగా [[ఋతుపవనాలు|ఋతుపవనాల]] మీదనే ఆధార పడతారు. [[వరి]], [[వేరుశనగ]], [[చెరకు]], [[పత్తి]], [[రాగి]], [[మిరియాలు]], [[పప్పు దినుసులు|పప్పుదినుసు]]లైన [[మినుములు]], [[కందులు]], [[శనగలు]] మొదలగునవి ఇక్కడ పండే కొన్ని ముఖ్యమైన పంటలు. ఇంకా [[కాఫీ]], [[తేయాకు]], [[వెనీలా]], [[రబ్బారు]] మొదలైన పంటలను కొండ ప్రాంతాలలో పెంచుతారు. కోస్తా ప్రాంతాలలో [[కొబ్బరి]] తోటలు విస్తారంగా పెరుగుతాయి. వరి పంట పండించడం లోపండించడంలో [[ఆంధ్ర ప్రదేశ్]] భారతదేశం లోనే మొదటి స్థానంలో వుంది.,<ref name="aponline">{{cite web |url=http://www.aponline.gov.in/quick%20links/apfactfile/apfactmain.html |title=Andhra Pradesh Online |accessdate=2006-04-10}}</ref>. భారత దేశంలోని కాఫీ పంట సాగులో కర్ణాటక 70% శాతాన్ని ఆక్రమించింది. ఎడతెరిపిలేని కరువుల వలన ఉత్తర [[కర్ణాటక]], [[రాయలసీమ]], మరియు [[తెలంగాణా]] ప్రాంత రైతులు అప్పుల పాలై ఉన్న ఆస్తులు అమ్ముకుని, చివరికి కొద్ది మంది ఆత్మ హత్యలు కూడా చేసుకున్నారు.<ref name=farmersuicide>{{cite web |url=http://news.bbc.co.uk/2/hi/south_asia/3769981.stm |title=BBC |accessdate=2006-04-10}}</ref> ఇక్కడ వేసవి కాలంలో నీటి ఎద్దడి కూడా ఎక్కువే.
 
ఇక పరిశ్రమల విషయానికొస్తే [[చెన్నై]] లో వాహనాలు మరియు ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి పరిశ్రమలు చాలా ఉన్నాయి. [[బెంగుళూరు]]లో భారీ ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాలు చాలా ఉన్నాయి. ఇటీవలి కాలంలో సమాచార సాంకేతిక రంగం (ఐటి) బాగా అభివృద్ధి చెందడంతో ఆదాయం బాగా పెరిగింది. ముఖ్యంగా బెంగుళూరును భారత దేశపు సిలికాన్ వ్యాలీగా పిలుస్తారు. ఐటికి ఇదే ప్రధాన కేంద్రం. ఇక్కడ 200 వరకు చెప్పుకోదగిన కంపెనీలు ఉన్నాయి. [[1992]] మరియు [[2002]] మధ్యలో కర్ణాటక రూ 21,566 మిలియన్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది. ఇది దేశంలో నాలుగో అత్యధిక మొత్తం. [[2005]]-[[2006|06]] ఆర్థిక సంవత్సరంలో దక్షిణ భారతదేశం నుంచి సుమారు 64000 కోట్ల సాఫ్ట్‌వేర్ ఎగుమతులు జరిగాయి.<ref name="stpi">{{cite web |url=http://www.thehindubusinessline.com/2006/05/07/stories/2006050702500300.htm |title=BusinessLine article on Tamil Nadu Software Exports |accessdate=2006-10-05}}</ref>
 
తమిళనాడు యొక్క [[నికర జాతీయోత్పత్తి|నికర రాష్ట్ర ఉత్పత్తి]] చాలా రాష్ట్రాల నికర రాష్ట్ర ఉత్పత్తి కన్నా ఉన్నత స్థానంలో ఉంది.<ref name="indiabudget">{{cite web |url=http://indiabudget.nic.in/es2002-03/chapt2003/tab17.pdf |title=India Budget |accessdate=2006-04-10}}</ref>. పారిశ్రామికీకరణ విషయానికొస్తే [[కేరళ]] కొద్దిగా వెనుకబడి ఉన్నా అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మాత్రం మెరుగ్గానే ఉన్నాయి. అక్కడి తలసరి ఆదాయంలో 20% విదేశీ మారకం ద్వారా వస్తున్నదే. దీనినే కేరళ అభివృద్ధి నమూనాగా తరచూ వ్యవహరించడం జరుగుతుంది.
పంక్తి 105:
 
== రాజకీయాలు ==
[[దస్త్రం:Cpmernakulam (40).jpg|thumb|200px|[[కేరళ]] లో [[లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్]] పార్టీ ర్యాలీ.]]
{{main|దక్షిణ భారతదేశంలో రాజకీయాలు}}
దక్షిణ భారతదేశంలో, కొన్ని ప్రాంతీయ పార్టీలు మరియు జాతీయ పార్టీలైన [[భారత జాతీయ కాంగ్రెస్]], [[భారతీయ జనతా పార్టీ]], మరియు [[కమ్యూనిస్టు పార్టీ]]లు సంకీర్ణ ప్రభుత్వాలు రాజకీయాలను శాసిస్తున్నాయి. [[కర్ణాటక]]ను మినహాయిస్తే మిగతా అన్ని రాష్ట్రాలలోనూ కనీసం రెండు రాజకీయ పార్టీలు ప్రభలంగా ఉన్నాయి.
 
దేశానికి స్వాతంత్ర్యం రాక మునుపు [[మద్రాసు ప్రెసిడెన్సీ]] లో [[జస్టిస్ పార్టీ]] మరియు [[భారత జాతీయ కాంగ్రెస్]] లే కీలక పాత్ర పోషించేవి.
[[పెరియార్ ఉద్యమం]] ప్రారంభించిన [[పెరియార్ రామసామి]] 1938 లో జస్టిస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1944లో దీని పేరు [[ద్రవిడర్ కజగం]]గా మార్పు చెందింది. దీని ప్రారంభ లక్ష్యం స్వతంత్ర భారతదేశం నుంచి ప్రత్యేక ''ద్రవిడ నాడు'' ఏర్పరచడం.<ref name="periyar">{{cite web |url=http://www.periyar.org/html/dk_movement_eng.asp |accessdate=19 April |accessyear=2006 |title="Periyar Movement- Periyar.org"}}</ref>. స్వాతంత్ర్యానంతరం పెరియార్ తమ పార్టీ ఎన్నికల్లో పాల్గొనబోదని తేల్చి చెప్పడంతో, అతని అంతరంగిక అనుచరులు కూడా ఆయనతో విభేదించక తప్పలేదు. 1948 లో పెరియార్ అనుచరుడు, మరియు ద్రవిడర్ కజగం పార్టీ ప్రధాన కార్యదర్శియైన [[అన్నాదురై]] ఆ పార్టీ నుంచి వేరుపడి [[ద్రవిడ మున్నేట్ర కజగం]] అనే పార్టీని నెలకొల్పాడు.<ref name="periyar"/>.
 
డిఎంకె పార్టీ మొట్ట మొదటి సారిగా 1968లోనూ మరలా 1978 లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే తరువాతి సంవత్సరమే [[ఎం జి రామచంద్రన్]] డిఎంకె నుంచి విడిపోయి [[ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం]] (AIADMK) ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఈ రెండు పార్టీలే తమిళనాడులో 60% శాతం వోటుబ్యాంకును కలిగి ఉన్నాయి.
 
[[ఆంధ్ర ప్రదేశ్]] లో మెజారిటీ కుసస్థులు [[కమ్మ]] (కమ్మ నాయుడు), [[రెడ్డి]] మరియు [[కాపు]], [[కర్నాటక]] లో [[వొక్కలిగ]] మరియు [[లింగాయతులు]], [[కేరళ]] లో [[నాయర్]] లేదా [[ఎలవ]], [[మహారాష్ట్ర]] లో [[కుంబి]]. సాధారణంగా ఈ కులస్థుల వారే [[ముఖ్యమంత్రి]] పదవిని అధిష్టిస్తారు. [[తమిళనాడు]] లో మెజారిటీ కులస్థులు [[వెన్నియార్]]లు, [[కొంగువెల్లలార్]]లు మరియు [[తేవార్]]లు. [[పి.యం.కే.]] అధ్యక్షుడు డా.రామదాస్, తమిళనాడునూ, బీహార్-జార్ఖండ్, మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్-ఉత్తరాఖండ్ లా విభజించాలని, సోనియా గాంధీని సూచించాడు.<ref name=tamilpolitics>Harris, Wyatt. [http://www.dcrcdu.org/dcrc/John%20Harriss.doc. "The Changing Politics of Tamil Nadu in the 1990s"]. <u>Political Mobilisation and Political Competition</u>. Dec 2004.</ref>
 
[[దస్త్రం:Soudha.jpg|thumb|left|200px|[[బెంగళూరు|బెంగలూరు]] లోని [[కర్నాటక]] అసెంబ్లీభవనం [[విధాన సౌధ]].]]
1980 వ దశకంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ కథానాయకుడైన [[నందమూరి తారక రామారావు]] [[తెలుగుదేశం పార్టీ]]ని నెలకొల్పటంతో రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ ఏకచక్రాధిపత్యానికి అడ్డుకట్ట పడింది. కాంగ్రెస్ ఆధిక్యాన్ని సవాలు చేస్తూ మొత్తం నాలుగు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. 1995లో భారీ మెజారిటీతో గెలిచిన ఒక సంవత్సరం తర్వాత ఆయనకు, భార్య [[లక్ష్మీ పార్వతి]] మరియు కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన వివాధాల వలన తెలుగుదేశం పార్టీలో చీలిక వచ్చింది. చాలామంది పార్టీ సభ్యులు రామారావు అల్లుడైన [[నారా చంద్రబాబు నాయుడు]]ను సమర్థించడంతో తర్వాత ఆయన ముఖ్య మంత్రి అయ్యారు. నాయుడు సమాచార సాంకేతిక రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టడంలో విశేష కృషి చేశారు. మిగతా ప్రభుత్వాలకు మార్గదర్శకుడిగా నిలిచాడు. ఇటీవలి కాలంలో తెలంగాణా ప్రాంతంలో [[తెలంగాణా రాష్ట్ర సమితి]] ప్రత్యేక తెలంగాణా నినాదంతో ప్రభావాన్ని పుంజుకుంటోంది. ఈ పార్టీ ముఖ్య లక్ష్యం ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణా ప్రాంతాన్ని వేరు చేయడమే. అది జరిగితే అప్పుదుఅప్పుడు దక్షిణాది లోదక్షిణాదిలో ఇంకో రాష్ట్రం ఏర్పాటవుతుంది. 1990వ దశకంలో ఫ్యాక్షనిజంతో సతమతమైన కాంగ్రెస్ పార్టీ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో [[వై. యస్. రాజశేఖర రెడ్డి]] నాయకత్వంలో, తెలంగాణా రాష్ట్ర సమితితో వ్యూహాత్మక సంధి కుదుర్చుకుని భారీ మెజారిటీతో గెలుపొంది, తెలుగుదేశం పార్టీని గద్దె దించడంలో సఫలీకృతమైంది.
 
[[జనతాదళ్]] ఇప్పటిదాకా దేశ రాజకీయాలలోకన్నా, కర్ణాటకలోనే ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, మరియు బిజెపిలు ఇతర దక్షిణ భారతదేశ రాష్ట్రాల కంటే కర్ణాటకలోనే ఎక్కువగా విజయాలను చవిచూస్తున్నాయి. కర్ణాటక రాజకీయాలను [[ఒక్కలిగ]] మరియు [[లింగాయతులు]] అనే రెండు కులాలు శాసిస్తున్నాయి.<ref name="karnatakapolitics">Price, Pamela. [http://www.isec.ac.in/Karnataka_Price16.5.05_aligned.pdf" Ideological Elements in Political Instability in Karnataka..."]. <u>University of Oslo</u></ref>. 1980లలో జనతాదళ్ దేశ రాజకీయాల్లోకి ప్రవేశంలో, [[రామక్రిష్ణ హెగ్డే]] ప్రముఖ పాత్ర పోషించాడు. అయితే అతని రాజకీయ ప్రత్యర్థి ఐన [[హెచ్ డి దేవెగౌడ]] (అప్పటి కర్ణాటక ముఖ్య మంత్రి) ప్రధాని అయ్యాడు.
పంక్తి 124:
 
== సంస్కృతి వారసత్వ సంపద ==
[[దస్త్రం:Tyagaraja.jpg|thumb|200px|[[కర్ణాటక సంగీతము]] లో త్రిమూర్తులలో ఒకరైన [[త్యాగరాజు]].]]
{{main|దక్షిణ భారత సంస్కృతి}}
 
దక్షిణ భారతీయులు భాషాపరంగా, సాంస్కృతిక పరంగా మిగతా భారతదేశము కంటే భిన్నముగా ఉంటారు. కాని భారతీయుల మధ్య ఉన్న సంబంధాలు, భారత దేశము మొత్తము పై బడ్డ విదేశీయుల ప్రభావము వలన సంస్కృతి పై కూడా ప్రభావము కనపడుతుంది. కొంతమంది నిపుణుల అభిప్రాయము ప్రకారము దక్షిణ భారతీయుల "ప్రపంచ దృష్టి" (వెల్టన్‌షవాంగ్ ([http://en.wikipedia.org/wiki/Weltanschauung weltanschauung]) శరీర సౌందర్యమును [[మాతృత్వము]]ను ఆస్వాదించడము ద్వారా అనంతమైన [[విశ్వము]]ను అస్వాదించడము. ఇది వారి నృత్యము, వస్త్రధారణ, శిల్పకళల ద్వారద్వారా వ్యక్తమవుతున్నది.<ref name="beck">Beck, Brenda. 1976; Bharata, 1967; Dehejia, Vidya, Richard H. Davis, R. Nagaswamy, Karen Pechilis Prentiss, 2002; Wadley, Susan, ed. 1980</ref>
 
దక్షిణ భారతీయ వనితలు [[చీర]]ను, పురుషులు లుంగీ లాగ కాని, పంచ లాగ కాని, జరీ ([http://en.wikipedia.org/wiki/Batik బేటిక్]) ఉన్న ఒక పెద్ద వస్త్రమును ([http://en.wikipedia.org/wiki/Sarong సరాంగ్]) ను ధరిస్తారు. చీర ఎక్కడా కుట్లు లేకుండా నడుము భాగము కనపడుతూ ఉంటుంది.
పంక్తి 135:
దక్షిణ భారతదేశ సంగీతాన్ని [[కర్ణాటక సంగీతం]] అని వ్యవహరిస్తారు. ఇది [[పురందర దాసు]], [[కనక దాసు]], [[త్యాగరాజు]], [[అన్నమయ్య]], [[ముత్తుస్వామి దీక్షితులు]], [[శ్యామ శాస్త్రి]], [[సుబ్బరాయ శాస్త్రి]], [[మైసూరు వాసుదేవాచార్యులు]], మరియు [[స్వాతి తిరునాళ్]] వంటి వాగ్గేయ కారులు ఏర్పరచిన తాళ, లయగతులతో కూడిన సంగీతం. సమకాలిక గాయకుల్లో మంగళంపల్లి బాలమురళీకృష్ణ, [[కె.జె. యేసుదాసు]] (జేసుదాసు), శ్రీమతి పట్టమ్మాళ్, కర్ణాటక సంగీతంలో ప్రముఖులు. భారత రత్న[[కీ.శే.ఎం.ఎస్. సుబ్బులక్ష్మి]], కీ.శే.మహరాజపురం విశ్వనాథన్, కీ.శే.మహరాజపురం సంతానం, కీ.శే.చెంబై వైద్యనాధభాగవతార్, కీ.శే.శంభంగుడి శ్రీనివాస అయ్యర్ ప్రభృతులు కర్ణాటక సంగీతాన్ని తారాపథానికి తీసికెళ్ళిన నిన్నటి తరపు విద్వాంసులలో కొందరు.
 
[[దస్త్రం:gandharva.jpg|right|thumb|220px|[[యేసుదాస్]], [[కర్నాటక సంగీతం]] లో దిట్ట.]]
తరతరాలుగా వస్తున్న దక్షిణ భారతదేశ ఆచారాలనూ, సాంప్రదాయాలనూసంప్రదాయాలనూ, మార్పులనూ, నాగరికతనూ, ప్రజల ఆశయాలనూ ప్రతిబింబిస్తూ ఇక్కడ చలనచిత్ర పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. 1986లో [[పద్మరాజన్]] తీసిన [[నమ్ముక్కుపార్కాన్]], 1984లో [[జి వి అయ్యర్]] తీసిన [[ఆది శంకర]], 1990లో పెరుంతాచన్ తీసిన [[అజయన్]], 1984 లో [[విశ్వనాథ్]] తీసిన [[శంకరాభరణం]] ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి. ఈ సినిమాలు ముఖ్యంగా దక్షిణ భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేశాయి.
[[File:A Kuchipudi Dancer from Visakhapatnam.JPG|thumb|200px|[[కూచిపూడి]] కళాకారిణి.]]
[[దస్త్రం:Bharatanatyam 17.jpg|left|thumb|200px|[[భరతనాట్యం]] కళాకారిణి.]]
పంక్తి 144:
ఇక్కడి ప్రజల ప్రధానమైన ఆహారం [[అన్నము]]. చేపలు, కోస్తా ప్రాంతాలలో నివసించేవారి ఆహారంలో ఒక అంతర్భాగం. కేరళ వంటకాలలో కొబ్బరి, ఆంధ్ర వంటకాలలో పచ్చళ్ళు, కారంతో కూడిన కూరలు సర్వ సాధారణం. [[దోశ]], [[ఇడ్లీ]], [[ఊతప్పం]] మొదలైనవి కొన్ని ప్రసిద్ధి చెందిన వంటకాలు. దక్షిణ కర్ణాటక, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో విస్తారమైన కాఫీ తోటలు ఉన్నాయి.
 
దక్షిణ భారతదేశంలో రెండు ప్రధానమైన వాస్తు శిల్పకళా రీతులు ఉన్నాయి. ఒకటి తమిళనాడుకు చెందిన సంపూర్ణ ద్రవిడ విధానం కాగా మరొకటి కర్ణాటకకు చెందిన [[వేసర]] శిల్పకళ. [[హంపి]], [[బాదామి]], [[భట్టిప్రోలు]], [[పట్టాడక]], [[అహోబిలం]],[[బేలూరు]], [[హళిబేడు]], [[లక్కుండి]], [[శ్రావణబెళగొళ]], [[మహాబలిపురం]], [[తంజావూరు]], [[మధురై]] మొదలైన దేవాలయాలలోగ శిల్పకళ ఇక్కడి శిల్పుల నైపుణ్యానికి, కళాభిరుచికీ చక్కటి నిదర్శనాలు. [[రాజా రవివర్మ]] గీసిన చిత్రాలు దక్షిణ భారతదేశ సాంప్రదాయాన్నిసంప్రదాయాన్ని,పురాణాల్నీ చక్కగా ప్రతిబింబిస్తాయి. ఎట్టమునూర్ లో గల శైవ క్షేత్రం, మరియు మాతంచేరి దేవాలయంలో గల చిత్రాలు [[:en:Dravidian mural painting|ద్రవిడ దేశపు కుడ్యచిత్రాలకు]] కొన్ని ఉదాహరణలు. దక్షిణ భారతదేశంలో 5 నుంచి 26 దాకా చరిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన స్థలాలు ఉన్నాయి.<ref>[http://whc.unesco.org/en/statesparties/in World Heritage Listed Sites in India]. URL accessed on [[April 12]], [[2006]].</ref>
 
[[దస్త్రం:Gomateswara.jpg|thumb|200px|left|కర్నాటక లోని [[గోమఠేశ్వర]] వద్ద, జైనుల తీర్థాంకరుడు 'బాహుబలి' ఏకశిలా శిల్పం. (978-993 నాటిది).]]
పంక్తి 151:
నృత్యం తరువాత [[శిల్పకళ]] ఇక్కడ కళలలో ప్రసిద్ధి గాంచింది. ఈ మాధ్యమంలో నిజస్వరూపాలను మూర్తులుగా మలచడం తక్కువ సమయంలోనే సాధ్యమౌతుంది. సాంప్రదాయిక శిల్పి ఒక శిల్పాన్ని చెక్కడం బొడ్డు నుంచి ప్రారంభిస్తాడు. శిల్పాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఆత్మ మరియు పరమాత్మ యొక్క సంగమాన్ని ప్రతిబింబిస్తూ బొడ్డు శిల్పానికి సరిగ్గా కేంద్ర స్థానంలో ఉన్న విషయం తెలుస్తుంది. దేవాలయాలకు నలు వైపులా ఉన్న భవనాలు వివిధ రకాల శిల్పాలు, వివిధ రకాల భంగిమలలో అలంకరించబడి ఉన్నాయి. ఈ రకమైన నాట్య భంగిమల చిత్రణ వివిధ రకాలైన నాట్య రీతులను తరువాతి తరాల వాళ్ళకు అందజేస్తాయి.<ref name="Dehejia">Dehejia, Vidya, Richard H. Davis, R. Nagaswamy, Karen Pechilis Prentiss; 2002</ref>
 
దక్షిణ భారతదేశానికి 2000 సంవత్సరాల స్వతంత్రమైన సాహిత్య చరిత్ర ఉంది. వీటిలో మొట్టమొదట పేర్కొనదగ్గవి 2000-1500 ఏళ్ళ క్రితం తమిళంలో రాయబడ్డ [[సంగం]] కవితలు. 850 CE కి చెందిన ఒకటవ అమోఘవర్షుడు రచించిన ''[[కవిరాజమార్గ]]'' అనే రచనలో ఐదవ శతాబ్దానికి చెందిన [[దుర్వినీతుడు]] అనే రాజు యొక్క రచనల గురించి ప్రస్తావించాడు. పదవ శతాబ్దానికి చెందిన తమిళ బౌద్ధుడు ''నెమ్రినాథం'' నాలుగవ శతాబ్దానికి చెందిన కన్నడ రచనలను ప్రస్తావించాడు. తరువాత శతాబ్దాలలో మలయాళం, తెలుగు సాహిత్య సాంప్రదాయాలుసంప్రదాయాలు అభివృద్ధి చేయబడ్డాయి. ఇలంగో ఆదిగళ్ రచించిన [[శిలప్పాధికారం]] (దీనినే [[సిలప్పాటికారం]] అనికూడా అంటారు) లాంటి రచనలు గమనిస్తే దక్షిణ భారతదేశ వాసులు ప్రకృతిని ఎంతగా ఆరాధిస్తారో అవగతమౌతుంది. తొల్కప్పియార్ రచించిన [[తొల్కప్పియం]], మరియు [[తిరువళ్ళువర్]] రచించిన [[తిరుకురల్]] కూడా చెప్పుకోదగిన రచనలు. ఇక్కడి సాహిత్యంలో మరియు తత్వ శాస్త్రంలో స్త్రీని శక్తి స్వరూపిణిగా భావిస్తారు. వివాహితయైన మహిళ శుభసూచకంగా, ఆదిశక్తి స్వరూపంగా, భర్తనూ, పిల్లలనూ కంటికి రెప్పలా కాపాడుకొనే తల్లిలా భావించి గౌరవిస్తారు.
 
== భిన్నత్వం ==
[[దస్త్రం:Charminar Hyderabad.jpg|thumb|180px|[[హైదరాబాదు]] లోని [[చార్మినారు]].]]
కొన్ని శతాబ్దాల క్రిందట [[జైనమతం]] ప్రభావం ఉన్నప్పటికీ, ప్రస్తుతం మాత్రం దక్షిణ భారతదేశంలో హిందూ మత శాఖలైనటువంటి [[శైవ భక్తులు]], [[వైష్ణవులు]] ప్రధానమైన ఆధ్యాత్మిక సాంప్రదాయాలుసంప్రదాయాలు. కర్ణాటకలో గల [[శ్రావణబెళగొళ]] జైనులకు ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రం. అదే విదంగా కర్ణాటకలోనే కల [[కొడగు]] అతి పెద్ద బౌద్ధారామాల్లో ఒకటి. చైనాలో కమ్యూనిస్టులు చెలరేగినపుడు వారి ఆగడాలను భరించలేక [[టిబెట్]] నుంచి పారిపోయి వచ్చిన చాలామంది బౌద్ధులు ఈ మఠంలోనే తలదాచుకున్నారు. ముస్లిం జనాభా కూడా ఇక్కడ కొంచెం ఎక్కువే. ప్రాచీన కాలంలో, కేరళ తీర ప్రాంతమైనటువంటి [[మలబారు తీరం]] ప్రజల్లో, ఒమన్ మరియు ఇతర అరబ్బు దేశాలు వ్యాపార సంబంధాలు కలిగి ఉండటం వలన ఇక్కడ ముస్లిం జనాభా చెప్పుకోదగిన సంఖ్యలో ఉంటుంది. ఇంకా తమిళనాడులో [[నాగపట్టణం]] (నాగూరు అని కూడా అంటారు) కూడా మహమ్మదీయుల సంఖ్య బాగానే ఉంది. ఈ పట్టణంలో పురాతన కాలానికి చెందిన [[నాగూర్ దర్గా]] కూడా ఉంది. ఇక ఆంధ్ర రాష్ట్ర రాజధానియైన [[హైదరాబాదు]] దక్షిణ భారతదేశ మహమ్మదీయ సంస్కృతికి చారిత్రక కేంద్రం. [[చార్మినార్]], [[పాతబస్తీ]] లాంటి ప్రాంతాల్లో చాలావరకు ముస్లింలే నివసిస్తుంటారు.
సెయింట్ థామస్ కేరళకు వచ్చి సిరియన్ క్రైస్తవ సాంప్రదాయాన్నిసంప్రదాయాన్ని ఏర్పాటు చేయడం వలన దక్షిణ భారతదేశంలోని తీరప్రాంతాలలో క్రైస్తవ మతస్తులు అధికంగానే ఉంటారు. వీరినే సిరియన్ క్రైస్తవులు లేదా సిరియన్ మలబార్ నజ్రానీలు అని కూడా అంటారు.<ref name="LeslieBrown">Menachery G; 1973, 1998; Mundalan, A. M; 1984; Podipara, Placid J. 1970; Leslie Brown, 1956</ref>. సిరియన్ రైట్ క్రైస్తవులు, సైరో-మలబార్ చర్చి, సైరో-మలంకరా క్యాథలిక్ చర్చి,మలంకరా జాకోబైట్ సిరియన్ ఆర్థోడాక్స్ చర్చి, మార్థోమా చర్చి మొదలైనవి ఈ సాంప్రదాయం కిందకే వస్తాయి.<ref name="LeslieBrown">Menachery G; 1973, 1998; Mundalan, A. M; 1984; Podipara, Placid J. 1970; Leslie Brown, 1956</ref>. The two [[Eastern Catholic Churches]] have their Holy See in Kerala. క్యానయా అనే క్రైస్తవ-యూదు జాతి సైరో-మలబార్ చర్చి, మరియు మలంకరా జాకోబైట్ సిరియన్ ఆర్థోడాక్స్ చర్చి సాంప్రదాయాలసంప్రదాయాల నుంచి ఉద్బవించింది.<ref name="LBrown">Menachery G; 1973, 1998; Leslie Brown, 1956; Vellian Jacob 2001; Weil, S. 1982; Poomangalam C.A 1998</ref>
 
[[దస్త్రం:Kottayam Valia Palli02.jpg|170px|thumb|left|[[క్నానయ]], సిరియన్ మలబార్ నస్రానీ (క్రిస్టియన్) దేవాలయం, [[కొట్టాయం]], ఇందులో పురాతన మార్ థోమా క్రాస్ మరియు సస్సానిదుల పహ్లవీ లిపులు.]]
అంతేకాకుండా కేరళలో లాటిన్ సాంప్రదాయానికిసంప్రదాయానికి చెందిన రోమన్ క్యాథలిక్కులు చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. వివిధ ప్రొటెస్టంట్ విభాగాలన్నింటినీ కలిపి [[1947]] లో దక్షిణ భారతదేశంలో ఒక స్వతంత్ర [[ప్రొటెస్టంట్]] చర్చి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతే కాకుండా ఇక్కడ యూదు జాతికి చెందిన ప్రజలు కూడా కొద్ది మంది నివసిస్తున్నారు. వీరు సాల్మన్ చక్రవర్తి కాలంలో మలబార్ తీరానికి వచ్చి ఉండవచ్చునని భావిస్తున్నారు.<ref name="Koder">David de Beth Hillel, 1832; Lord, James Henry, 1977; Thomas Puthiakunnel 1973; Koder S. 1973</ref>
కేరళ లోని [[కొచ్చిన్]] లో గల యూదుల చర్చి [[సినగాగ్]], భారత్ లో అతి ప్రాచీనమైనది.
 
== నోట్స్ ==
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_భారతదేశం" నుండి వెలికితీశారు