దేవరకొండ బాలగంగాధర తిలక్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధాలయ → గ్రంథాలయ using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, లొ → లో, లో → లో , కి → కి , నేపధ్య → నేపథ్య, స using AWB
పంక్తి 43:
:నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు
</poem>
అంటూ తన కవితా పరమార్థం చెప్పుకున్న, భావ కవులలొకవులలో అభ్యుదయ కవీ, అభ్యుదయ కవులలో భావకవీ అయిన తిలక్ పూర్తి పేరు దేవరకొండ బాలగంగాధర తిలక్ . ఇతను కవి, కథకుడు, నాటక కర్త.
<poem>
:సంకుచితమైన జాతి మతాల హద్దుల్ని చెరిపేస్తున్నాను నేడు
పంక్తి 54:
[[పశ్చిమ గోదావరి]] జిల్లా [[తణుకు]] తాలుకా [[మండపాక]] గ్రామంలో [[1921]] [[ఆగష్టు 1]] న తిలక్ జన్మించాడు.
 
తిలక్ ఎంత సుకుమారుడో అతని కవిత అంత నిశితమైనది . భాష ఎంత మెత్తనిదో, భావాలు అంత పదునైనవి. సంఘ వంచితుల పట్ల ఎంత కారుణ్యమో , సంఘ దురన్యాయాలపట్ల అంత క్రోధం. తిలక్‌కు తెలుగు, ఇంగ్లీషులలో చక్కని పాండిత్యం ఉంది. ప్రాచీనాధునిక పాశ్చాత్య సాహిత్యంలో చాలా భాగం అతనికి కరతలామలకం. అయినా, తెలుగు వచనం గాని, పద్యంగాని ఎంతోబాగా వ్రాసేవాడు. సుతిమెత్తని వృత్త కవితతో ప్రారంభించినా, ఆధునిక జీవితాన్ని అభివర్ణించడానికి వృత్త పరిధి చాలక వచన గేయాన్ని ఎన్నుకున్నాడు. అది అతని చేతిలో ఒకానొక ప్రత్యేకతను, నైశిత్యాన్ని సంతరించుకుంది, సౌందర్యాన్ని సేకరించుకుంది.
 
మన కళ్ళ ఎదుట ప్రతి నిత్యం జరిగిపోతున్న జీవిత నాటకాన్ని ప్రతిబింబించడానికి ఆయన కవితను , కథలను, నాటికా ప్రక్రియను సమానంగా ఉపయోగించుకున్నాడు. మనకు రోడ్ల మీద తారసిల్లే వ్యక్తులు- బిచ్చగాళ్ళు, అనాథలు, అశాంతులు, దగాపడ్డ తమ్ముళ్ళు, పడుపుగత్తెలు, చీకటిబజారు చక్రవర్తులు ఇంకా ఎందరెందరినో ఆయన పాత్రలుగా తీసుకుని అసలు వేషాలలో మన ముందు నిలబెట్టాడు.
 
మొదట [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] ప్రభావంతోనూ , తరువాత [[శ్రీశ్రీ]] ప్రభావంతోనూ , కవిత్వం వ్రాసినా, వచన కవితా ప్రక్రియను తన అసమాన ప్రతిభాసంపదతో ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్లిన ప్రముఖుడు. వచన కవితలకు అప్పజెప్పే లక్షణాన్ని తెచ్చినవాడు తిలక్. భావకవిత్వంలోని భావ సౌకుమార్యం, భాషా మార్దవం, అభ్యుదయ కవిత్వలక్షణాలతో కలసి వెలసిన తిలక్ కవిత్వం, అభ్యుదయ, భావ కవిత్వాల కలనేత.
 
తిలక్, సృజనశక్తి సర్వతోముఖంగా విజృంభిస్తున్న సమయంలో అప్పుడే వికసించిన మల్లెపువ్వులా ఉండే తిలక్ వాడకుండానే, వాసన వీడకుండానే నలబై అయిదేళ్ల నడిప్రాయాన [[1966]] [[జూలై 1]] న అనారోగ్యంతో రాలిపోయాడు.
 
==ప్రశంసలు==
పంక్తి 88:
:స్వచ్చ స్ఫటికా ఫలకం
</poem>
అంటూ తన [[ఎలిజీ]] లో (జవాబు రాని ప్రశ్న) [[శ్రీశ్రీ]] అభివర్ణించాడు.
 
'''గిరిజా మనోహర్ బాబు''' : కవితాసతి నుదుట నిత్య రసగంగాధర తిలకంగా, ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానాన్ని పొందిన తిలక్ "అమృతం కురిసినరాత్రి" కవితా సంకలనం ద్వారా సామాజికమైన తన ఆలోచనల్ని కవిత్వీకరించి కవిత్వానికే సార్ధకతసార్థకత కలిగించాడు.. తాలోత్తాలంగా ఎగిసిన భావ, అభ్యుదయ కవితోద్యమాల నేపధ్యంలోనేపథ్యంలో తిలక్ కవిత్వ రచన ప్రారంభమైంది .. వ్యావహారిక భాష, రసదృష్టి, వాస్తవికతా దృక్పధం, అనితర సాధ్యమైన శైలి తిలక్‌లో మనకు గోచరించే కొన్ని కోణాలు.<ref name="sata"/>
 
'''వేలూరి వేంకటేశ్వరరావు''' : .. తిలక్‌ మనకి ఆరోజులనాటి (60 ల్లో) వీర అభ్యుదయవాది (ultra progressive) గా ముందుకొస్తాడు. .. తిలక్‌, కృష్ణశాస్త్రి గారి romanticism కి, అభ్యుదయవాదం అందంగా పెనవేసి, ఆనాటి కవిత్వాన్ని, ఒక రెండుమెట్లు పైకి తీసికెళ్ళిన గొప్ప కవి. కాకుంటే “రహస్యసృష్టి సానువులనుండి జారిపడే కాంతి జలపాతాన్ని చూపించు, మమ్మల్ని కనికరించు,” అని రాయలేడు. “మంచిగంధంలాగ పరిమళించే మానవత్వం మాకున్న ఒకే ఒక అలంకారం,” అని ఇంకే కవి రాయగలడు? . ..తను ప్రార్థిస్తున్న దేవుడు, ఆ దేవుడు ఎవరైతేనేం, తన కోరికలు తీర్చలేడని తిలక్‌ కితిలక్‌కి తెలుసు. నాకు చందమామలో జింక కావాలంటే, ఏ దేవుడు ఇవ్వగలడు? తిలక్‌ ప్రగతి శీలుడైన మానవతావాది. అంటే, ఎప్పటికైనా తన కోరికలు ఏదోరకంగా నెరవేరుతాయని నమ్మిన కవి. మనిషిలో మంచిని నమ్మిన కవి.<ref>[http://www.eemaata.com/em/issues/200509/65.html వేలూరి వేంకటేశ్వరరావు - "ఈమాట" అంతర్జాల పత్రికలో]</ref>
 
'''కొట్టెకోల విజయ్‌కుమార్‌''' : కవిత్వం మనస్సుకీ ఉద్రేకాలకీ సంబంధించింది. ఈ మనస్సునీ ఉద్రేకాల్ని కొలిచే సరైన మానం ఇదివరకు లేదు. ఇకముందు రాదు అని చెప్పవచ్చును. అంతవరకు కవిత్వానికి సరైన నిర్వచనం రాదు. మన లోపల్లోపల జరిగే ఒకానొక అనుభూతి విశిష్టత కవిత్వానికి ఆధారం అని తిలక్‌ ప్రకటించినాడుప్రకటించాడు, కవితాజ్ఞాని అయినాడు. తిలక్‌ కవిత్వానికి అసలు రూపం అమృతం కురిసిన రాత్రి దీనిలోని ప్రతి కవిత కొత్త శిల్పంతో కొత్త భావంతో రక్తి కడుతుంది. హృదయాన్ని కదిలిస్తుంది. మెదడుకి పదును పెడుతుంది. భావ తీవ్రతతో పాఠకులలో ఒకవిధమైన మానసికావస్థను కలిగించినాడుకలిగించాడు. వచన కవితా నిర్మాణ శిల్పరహస్యవేది అయిన తిలక్‌ చిన్నవయస్సులోని జులైజూలై 2న 45 సంవత్సరములకే మరణించాడు. 'తిలక్‌ మంచి అందగాడు, మానసికంగా మెత్తనివాడు, స్నేహశీలి కవి, రసజ్ఞుడు' అని కుందుర్తి అమృతం కురిసిన రాత్రి పీఠికలో అన్నాడు.<ref>[http://www.andhraprabha.com/sunday/sundayItems.asp?id=ASL20080127021303&eTitle=AP+Sunday+-+Literature&rLink=0 కొట్టెకోల విజయ్‌కుమార్‌ - ఆంధ్రప్రభలో వ్యాసం]</ref>
 
'''శ్రీశ్రీ''' :
పంక్తి 117:
* ఊరి చివరి యిల్లు
; నాటకాలు
* సుశీల పెళ్లిపెళ్ళి
* సుప్త శిల
* సాలె పురుగు