దేవికారాణి: కూర్పుల మధ్య తేడాలు

→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , అనాధ → అనాథ using AWB
పంక్తి 17:
'''దేవికా రాణి''' (Devika Rani) ([[మార్చి 30]], [[1908]] - [[మార్చి 9]], [[1994]]) సుప్రసిద్ధ భారతీయ నటి మరియు [[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] గ్రహీత.
 
ఈమె [[విశాఖపట్టణం]]లో జన్మించారు. ఈమె తండ్రి భారతదేశపు తొలి సర్జన్ జనరల్ కల్నల్ [[ఎం.ఎన్.చౌదరి]]. [[శాంతి నికేతన్]] లో విద్యాభ్యాసం తర్వాత ఉపకార వేతనం మీద [[లండన్]] వెళ్ళి అక్కడ రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమటిక్ ఆర్ట్స్ మరియు మ్యూజిక్ లో [[సంగీతం]] మరియు [[నటన]]లో శిక్షణ పొందారు.
 
జర్మనీలో ప్రసిద్ధ సినీ నిర్మాతగా పేరుపొందిన [[హిమాంశు రాయ్]]తో పరిచయం ఏర్పడి తర్వాత అది ప్రేమగా మారి 1929లో పెళ్ళి చేసుకున్నారు. బెర్లిన్ లోని యు.ఎఫ్.ఎ. స్టూడియోలో దేవికని చేర్పించి మేకప్, కాస్ట్యూమ్ డిజైనింగ్ మొదలైన విభాగాల్లో శిక్షణ ఇప్పించారు.
పంక్తి 23:
స్వదేశానికి తిరిగివచ్చి స్వంతంగా "కర్మ" (1933) అనే చిత్రాన్ని నిర్మించారు. దేవికారాణి నాయికగా మరియు హిమాంశురాయ్ నాయకునిగా దీనిని హిందీలోకి అనువదించి విడుదల చేయగా ఘనవిజయం సాధించింది.
 
1934లో "బాంబే టాకీస్" అనే సంస్థను స్థాపించి ఎందరో ఔత్సాహిక కళాకారుల్ని చేర్చుకొని వివిధ రంగాల్లో శిక్షణనిచ్చారు. బాంబే టాకీస్ తీసిన చిత్రాలలో దేవికారాణి మరియు [[అశోక్ కుమార్]] ల జంట హిట్ పెయిర్ గా పేరుపొందారు. ఈమె నటించిన 16 చిత్రాలలోని చాలా పాత్రలు సంఘర్షణాత్మకమైనవి. సమాచ వివక్షతకు గురయ్యే హరిజన యువతిగా ''అచూత్ కన్య'' (1936) లో, తల్లికాలేని గృహిణిగా ''నిర్మల'' (1939) లో, అనాధగాఅనాథగా ''దుర్గ'' (1939), తిరగబడిన మహిళగా ''సావిత్రి'' (1937) లో విధివంచితురాలైన బ్రాహ్మణ యువతిగా ''జీవన్ ప్రభాత్'' (1937) లో ఆమె నటన అనితర సాధ్యమైనది.
 
మే 19, 1940లో హిమాంశు రాయ్ హఠాన్మరణం పొందడంతో బాంబే టాకీస్ నిర్వహణ బాధ్యత ఆమె చేతిలో పడింది. తర్వాత తీసిన ''బసంత్'', ''కిస్మత్'', ''అంజానా'' మొదలైన చిత్రాలు ఆర్థికంగా లాభాలు తెచ్చిపెట్టాయి.
"https://te.wikipedia.org/wiki/దేవికారాణి" నుండి వెలికితీశారు