66,691
దిద్దుబాట్లు
(కొంత అనువాదం) |
(అనువాదం సంపూర్ణం) |
||
{{విధానం|WP:PERSONAL|WP:NPA|WP:PA}}
{{Conduct policy list}}
అభిప్రాయ భేదాలను వివరించేటప్పుడు వాడుకరులు సామరస్యంగాను, వికీ ప్రవర్తనా నియమావళికి అనుగుణంగానూ నడచుకోవాలి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎదుర్కొన్నప్పుడు, విషయానికి సంబంధించినంత వరకు వ్యాఖానించి ఊరుకోవటం ఉత్తమమైన ప్రతిస్పందన. ప్రతిస్పందనగా ఎదుటి వ్యక్తిని వ్యక్తిగత దాడిచేస్తున్నావని, ఈ విధానాన్ని ఉల్లంఘిస్తున్నావని నిందించడం సరైన పద్ధతి కాదు. సరైన ఆధారాలు, హేతువులు చూపకుండా వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని ఆరోపించడం కూడా ఒక విధమైన వ్యక్తిగత ధూషణగా పరిగణించబడుతుంది.
ఇది వ్యక్తిగత దాడి అని చెప్పగలిగే స్పష్టమైన సూత్రం ఏదీ లేదు. కానీ కొన్ని రకాల వ్యాఖ్యలు ''ఎంతమాత్రమూ'' ఆమోదయోగ్యం కాదు:
▲=={{anchor|WHATIS}}ఎలాంటివి వ్యక్తిగత దూషణలుగా పరిగణించబడతాయి?==
* ఒక వాడుకరి లేదా వాడుకరులకు అన్వయించి జాత్యహంకార, లైంగిక, లింగాధార, వయో, మత, రాజకీయ, కుల, జాతీయత, ప్రాంతీయత సంబంధ వ్యాఖ్యలు లేదా మరే ఇతర వైకల్యాన్ని (ఉదాహరణకి అంగవైకల్యం ఉన్న సభ్యులు) హేళన చేస్తూ లేదా కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు. కొన్ని మత, జాతి, లైంగికత వంటి వర్గాల వర్గీకరణ విషయంలో ఉన్న బేధాభిప్రాయాలు ఈ విషయంలో అవహేళన చేయటానికి సాకుగా ఉపయోగించకూడదు.
* వాడుకరికి సంబంధమున్న అంశాలను బట్టి వారి అభిప్రాయాలను తృణీకరించడం. ఉదాహరణకు "''మీరు సాఫ్టువేరు ఇంజనీరు గదా, మీకు రైలు గురించి ఏం తెలుసు?''". ఏదైనా ఒక విషయం మీదో ఒక వ్యాసం మీదో తమ ఆసక్తుల విభేదాల గురించి ఆ వాడుకరి పేజీలో అడగడం వ్యక్తిగత దాడిగా భావించబడదు. అయితే, ఇతర వాడుకరుల నిజజీవితంపై ఊహాగానాలు చెయ్యడం ఔటింగు కిందకు వస్తుంది. అది చాలా తీవ్రమైన దాడి.
* ఇతర వాడుకరులపై దాడిచేసే ఉద్దేశంతో బయటి జరిగిన దాడులు, లేదా ఇతర విషయాలకు లింకులు ఇవ్వటం.
* వాడుకరులను నాజీలు, నియంతలు మరియు మరే ఇతర దుర్మార్గులతో పోల్చడం. ([[:en:Godwin's law|గాడ్విన్ నియమం]] కూడా చూడండి.)
వాడుకరి చర్చా పేజీలోగానీ, వికీపీడియా నోటీసు బోర్డులోగానీ వాడుకరి ప్రవర్తనను చర్చించడం వ్యక్తిగత దాడి కాదు.
స్పందించడం అవసరం, ఆవశ్యకమూ ఐనపుడు మర్యాద పూర్వ్కంగా ఒక సందేశాన్ని వాడుకరి చర్చాపేజీలో పెట్టండి. వ్యాసపు
మరీ రెచ్చగొట్టేవి, వికీపీడియాను అడ్డగించేవీ అయిన దాడులను (భౌతిక దాడి బెదిరింపులు, చట్తప్రకార బెదిరింపులు, జాతి, కుల, మత వివక్షకు చెందిన బెదిరింపులు, లైంగిక వివక్షకు చెందిన బెదిరింపులు మొదలైనవి) వదలిపెట్టరాదు.
===పదే పదే చేసే దాడులు===
ఆపమని హేతుబద్ధంగా అభ్యర్ధించాక కూడా పదే పదే దాడులు జరుగుతూ ఉంటే మధ్యవర్తిత్వం ద్వారాను, మూడో వ్యకతి ప్రమేయం ద్వారానూ పరిష్కరించుకోవచ్చు. చాలా సందర్భాల్లో వాడుకరులు పరస్పరం సంప్రదించుకుని, పాఠ్యంపైనే దృష్టి పెట్టి వ్యక్తిగత దాడులను పరిష్కరించుకోవచ్చు, నిర్వాహకుని జోక్యం అవసరం లేకుండా చెయ్యవచ్చు.
===పాఠ్యం తొలగింపు===
వ్యక్తిగత దాడిని ఎప్పుడు తీసెయ్యాలి, అసలు తీసెయ్యాల వద్దా అనేది బహు చర్చితాంశం. మీ వాడుకరి చర్చాపేజీలో ఉన్న నిర్వివాదమైన వ్యక్తిగత దాడులను తీసేసేందుకు అభ్యంతరమేమీ ఉండదు. ఇతర చర్చాపేజీల్లో, ముఖ్యంగా దాడి మీపై జరిగినపుడు, అది కచ్చితంగా వ్యక్తిగత దాడే అని స్పష్టమైన కేసుల్లో మాత్రమే తొలగింపు జరగాలి.
అయితే, కొన్ని అసాధారణ సందర్భాలుండవచ్చు. వికీపీడియన్ల వ్యక్తిగత, గోప్య సమాచారాన్ని బహిరంగపరచడం వంటివి తిట్ల కంటే పైస్థాయికి చెందినవి. వాటి లక్ష్యం మీరైనా కాకున్నా, సముదాయం క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వాట్ని ఎదుర్కోవాలి. సున్నితమైన సమాచారం ఇమిడి ఉన్న సందర్భాల్లో ఓవర్సైట్ అభ్యర్ధన చెయ్యవచ్చు.
===
వికీపీడియా, వికీమీడియా ఫౌండేషను యొక్క నియంత్రణలో లేని మాధ్యమాలలో ప్రవర్తనను నియంత్రించలేదు. కానీ ఇతర ప్రదేశాలలో చేసిన వ్యక్తిగత దూషణలు ఆ వాడుకరి వికీలో చేసే పనుల యొక్క సదుద్దేశాన్ని శంకించేలా చేస్తాయి.
===బయటి లింకులు===
వికీపీడియా వాడుకర్లపై బయటి సైట్లలో జరిగిన దాడులకు లింకులిస్తూ మరో వికీపీడియా వాడుకరిపై దాడి చేసేందుకు వాటిని వాడుకోవడం ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు. ఇలా బయటి లింకులిస్తూ వికీపీడియా వాడుకరిపై దాడి చెయ్యడం, వేధించడం, వ్యక్తిగత గోప్యతను అతిక్రమించడం మొదలైన వాటికి అనుమతి లేదు. బయటి లింకులివ్వడం సర్వే సర్వత్రా తప్పు అని అనుకోరాదు. వ్యాసాల్లో వ్యాస విషయాన్ని బలపరచేందుకు గాను బయటి లింకులివ్వడం వ్యాస నాణ్యతకు ఉపయోగపడే అంశం. అది పూర్తిగా సమంజసం, వాంఛనీయం.
==వ్యక్తిగతదాడుల పర్యవసానాలు==
చెదురుమదురుగా జరిగే వ్యక్తిగత దాడులను పట్టించుకోవద్దని లేదా మర్యాదపూర్వకంగా బదులివ్వమని వాడుకరులను ప్రోత్సహించినా, అలాంటి దాడులు అంగీకరించదగినవని అనుకోకూడదు. పదే పదే వైరత్వంతో వ్యవహరిస్తే, సముదాయం సుద్దేశ్యంతో వ్యవహరిస్తున్నారని అనుకొనే సంభావ్యత తగ్గిపోతుంది. అలాంటి సందర్భాలలో అది ఆటంకపూరితమైన దిద్దుబాటుగా భావించబడుతుంది. గొడవపెట్టుకునే విధంగా వ్యవహరిస్తూ, వ్యక్తిగత దాడులకు దిగే వాడుకరులు వివాద పరిష్కార ప్రక్రియలో పాల్గొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తద్వారా తీవ్రమైన పర్యవసానాలు ఎదొర్కొనే అవకాశమున్నది.
మరీ తీవ్రమైన సంఘటనల్లో చెదురుమొదురు వ్యక్తిగత దాడులు కూడా వాడుకరి నిరోధానికి గురయ్యేందుకు దారితీస్తాయి. చంపుతాననే బెదిరింపులు, ఇంకా అలాంటి తీవ్రమైన బెదిరింపుల సందర్భాఅల్లో ''ఏ హెచ్చరికా లేకుండా'' నిరోధం విధించవచ్చు. తక్కువ స్థాయి వ్యక్తిగత దాడులు జరిగినపుడు హెచ్చరికతో సరిపెట్టవచ్చు. హెచ్చరికల తరువాత కూడ్ ఇవి ఆఅగకపోతే, నిరోధలు విధించవచ్చు. అయితే, నిరోధాల కంటే కూడా ఇతర పరిష్కార మార్గాలు అవలంబించడం వాంఛనీయం -ఆ ప్రవర్తన ప్రాజెక్టును అడ్డుకుంటోందని
{{Wikipedia policies and guidelines|state=uncollapsed}}
[[వర్గం:వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలు]]
[[వర్గం:వికీపీడియా వివాద పరిష్కారం]]
|