సంఘం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
* [[తిక్కవరపు వెంకట రమణారెడ్డి|రమణారెడ్డి]]
==చిత్రకథ==
వర్ణాంతర వివాహం చేసుకున్న ఒక సంఘసంస్కర్త (నాగయ్య)కు కామిని (అంజలీదేవి) అని ఒక కుమార్తె ఉంటుంది. కామిని కులం లేని పిల్ల కాబట్టి ఆమెను ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకురారు. కామినికి రాణి (వైజయంతిమాల) అని ఒక స్నేహితురాలు ఉంటుంది. రాణి మంచి ధైర్యవంతురాలు. పైగా బాగా నాట్యం కూడా చేస్తుంది. రాజా (ఎన్.టి.రామారావు) తండ్రిగారు సీతారామాంజనేయదాస్ (ఎస్.వి.రంగారావు) స్త్రీద్వేషి. కాబట్టి కొడుకుకు పెళ్లిచేయకూడదని నిర్ణయించుకుంటాడు. కానీ భార్య రత్నం (ఋష్యేంద్రమణి) పోరు భరించలేక పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడు. అయితే తనకు నచ్చిన పిల్లనే పెళ్లిచేస్తానంటాడు. ఒక రోజు రాజా అతని స్నేహితుడు చంద్రం (బాలచందర్) కారులో పోతుండగా కామిని - రాణి మరొక కారులో పోతూ తటస్థపడతారు. రాజా కామినిని ప్రేమిస్తాడు. ఆమె కులం లేని పిల్ల అని తెలిసికూడా ఆమెనే పెళ్లి చేసుకుంటానంటాడు. చంద్రం సహాయంతో రాజా కామినిల వివాహం రాజా తండ్రికి తెలియకుండా జరిగిపోతుంది. రాజా ఒక కులంలేని పిల్లను పెళ్లి చేసుకున్నట్లు తెలిసి అతని తండ్రి కోపంతో కొడుకుని వెనక్కి పిలిపిస్తాడు. కులంలేని పిల్లకు గుణం కూడా ఉండదని కొడుక్కి నూరిపోస్తాడు. ఒకరోజు రాజా భార్య కోసం వెళ్లితే అక్కడ కెప్టెన్ సుందరం (సహస్రనామం) కామినిని బలాత్కరించబోతుంటాడు. రాజా అక్కడ ఆ గదిలో వారిద్దరూ ఉండడం చూసి కామిని మంచిది కాదని అపోహపడి తండ్రివద్దకు పోయి "మీ యిష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేయ"మని అంటాడు. రాజాతో కామినికి పెళ్లి అయిన విషయం తెలియక రాణి రాజాతో పెళ్లికి అంగీకరిస్తుంది. చివరకు కామిని నిర్దోషిగ నిరూపణ అయి కులంలేని పిల్ల అయినా గుణం కలిగిన పిల్ల అయినందున ఆమెతో కాపురం చేయడానికి రాజా అంగీకరిస్తాడు. అంతా సుఖంగా ఉంటారు<ref>{{cite journal|last1=భీశెట్టి|title=అలనాట్ మేటి చిత్రాలు - సంఘం|journal=ఆంధ్ర సచిత్రవారపత్రిక|date=18 January 1991|volume=83|issue=21|page=41|url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=10243|accessdate=12 October 2016}}</ref>.
వర్ణాంతర వివాహం చేసుకున్న ఒక సంఘసంస్కర్త (నాగయ్య)కు కామిని (అంజలీదేవి) అని ఒక కుమార్తె ఉంటుంది.
 
==మూలాలు=
{{మూలాలజాబితా}}
 
 
"https://te.wikipedia.org/wiki/సంఘం_(సినిమా)" నుండి వెలికితీశారు