అమరసింహుడు: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గ్రంధము → గ్రంథము (3), బుద్దు → బుద్ధు, చినాడు → చాడు (2), క using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వికీకరణ}}
'''అమరసింహుడు''' నాల్గవ శతాబ్దమునాటి [[బౌద్ధమతస్తుడు]], పురాతనుడు. [[సంస్కృత]], భాషాభ్యాసమునకు మహోపకారియగు ఒక నిఘంటువును రచించాడు. దానిపేరు ''నామలింగాను శాసనము''. వాడుకలో దానిని [[అమరకోశం]] అని కూడా అంటారు. తెలుగు వారికోసం దాని వ్యాఖ్యానమును [[లింగాభట్టు]] రచించాడు. ఇతని కాలమునాటికి చాలా నిఘంటువులుండేవి. [[త్రికొండి]], [[ఉప్తలిని]] మొదలగు గ్రంథములూ, వాడి, వరరుచి, వాగురి, వామనుడు, మొదలగు గ్రంథకర్తలను ఇందులో పేర్కొన్నారు.
 
ఇతడు బౌద్ధుడయినను, భారతీయ సాంప్రదాయములకు, ఆచారవ్యవహారములకూ విరుద్ధుడు కాడు. భాషాసేవయే ముఖ్యమని భావించి స్వాభిప్రాయముల జొప్పించక సంస్కృతమునకు మేలు చేకూర్చాడు. నిఘంటువు శబ్దములప్రోగు. ఈ శబ్దములు మానవ మనోభావసూచితములు.దేశముయొక్క నాగరితాభివృద్ధిని గమనింపదలచువారు కీశబ్దశాస్త్ర పరిగ్ఞానము సహకారియగును. కొన్ని కొన్ని శబ్దములు మొదటి అర్ధమును విడనాడి నూత్నాశయములకొరకు సృజింపబడును. అమరకోశమును పరిశోధించిన కొన్ని సంగతులు బయల్వెడలును.
 
[[పరిష్యా]] దేశమున పూర్వకాలమున నివసించువారు మన యార్యసంతతివారై మతాభిప్రాయములచే భిన్నులయిరని మనకు చరిత్ర తెల్యిపరచుచున్నది. దాని కొంకింత బలము ఈ అమరకోశము కనబడుచున్నది. ఆహిర్, బుద్న్యుడు పారశీక దేవ బృందమునందువాడు. ఆతనినే భారతీయులు లోకాదశరుద్రులలో చేర్చిరి. సురను నిషేధించినవారు పారశీకువారసులయిరి. దానిని గ్రహించిన మన పూర్వేకులు సురలయిరి. అసురులకును, సురలకును మొదటి నివాస స్థలము ఒక్కటియే. కనుకనే వారలకు పూర్వ దేవతలని నానుది. అమరకోశములో కొన్ని పదాలకు అర్ధము ఈ వరవడిని తెలియపరచుచున్నది.దేవతలందరూ సదా 25 ఏండ్లవారు. ఈ బృందారకులయందు 49 విధములుగా గణదేవతలు ముఖ్యులు. ఇక్కాలమున గనదేవతల నామరూపములు గానరావు. రాక్షసులు గూడా దేవయోనిజ్లులలో జేరినవారే. వీరలనుండి ఆర్యులు తమ పశువులను రక్షించు కొనుచుండిరిట. వీరిలో దైత్యులు దానవులని ఇరుతెరగులు.మాంసాహారమునందసూయ భావము గనపడుచున్నది. పిశాచులు మాంసాభుక్కులు రాక్షసులు రాత్రియందు భోజనము జేయువారట.
 
అమరుడు [[బ్రహ్మ]], [[విష్ణు]], మహేశ్వరులను[[మహేశ్వరు]]లను వర్ఞించుటకు పుర్వమే బుద్ధునిదహరించెను. పరాప్తరునికి సాధ్యమగు స్థానము బుద్ధభగవానునికి అబ్బినది అని గ్రంథకర్త మతాభిమానమునచే ఈ ఆధిక్యత సమర్ధనీయమయమే. అంతియేగాక బుద్ధుడు భగవానుడు, సుగుణరాశి, ప్రేమాస్పదుడు, సర్వజ్ఞుడు, అద్వయవాది, అర్కబంధువు ఈనామములను బట్టియే ఆకాలపు సాదరాతిశయములు, భక్తివిశేషములు తెలియపడును. శ్రీరాముడిని వైష్ణవతారములలో చేర్చలేదు.ఈ అవతారములు పదీని అమరమునందు గనపడవు. అమరుడు విష్ణువునకు 39 పేర్లు సూచించియు దశావతారములలో పేరుగాంచిన వారిలో వామనుని తప్ప తక్కినవారిని పలుకరించలేదు. మత్స్య, కూర్మ, వరాహ, నారసిమ్హ, [[పరశురామ]], [[రామ]], [[బలరామ]], [[బౌద్ధ]], [[కల్కి]], ఈ తొమ్మిదిమంది ప్రమేయమేలేదు. ఈదశావతార సిద్ధాంతములు అమరుడి తరువాత ప్రచారమునకు వచ్చినట్టు మనకు దీనివలన తెలియును. ఇప్పుడు దశావతారములలో చేరిన శ్రీకృష్ణుని విష్ణవతారములలో అమరుడు చేర్చి అత్యంత ప్రాముఖ్యము ఇచ్చెను. మరల కృష్ణునాయున్నత పదవినుండి యెప్పుడూ తొలగించిరి. భాగవతములో కృష్ణుడును బలరాముడును విష్ణువుయొక్క నల్లతెల్ల వెండ్రుకులని నిరూపింపబడిరి. రామాయణములో వైదికాచార సంపత్తిని ప్రోత్సహ పరచుచు బుద్ధుని దొంగ యని వర్ణించిరి. వాల్మీకి రామాయణము బుద్ద నిర్వాణము తరువాత వ్రాయబడినా అది ప్రశ్నగా మిగిలినది. లేక బుద్ద దూషణా ప్రక్షిప్తమా? ఏది ఎటులున్ననూ అమరుని కాలము నాటికి గాని శంకరుని కాలమునాటికి గాని దశావతారగాధ వాడుకలోలేదు. బుద్ధుని విష్ణువాతారములలో స్థానము దొరకలేదు.
బ్రహ్మ పేర్లలో ద్రుహిణి శబ్దమొక్కటి అసురుల హింసుంచితయే ద్రుహుణిని ముఖ్యవిధి. భారతీయ పారశీకులమధ్య జరిగిన యుద్ధములలో ద్రుహుణి ప్రస్సిద్ధ నాయకుదు అయిఉండవచ్చును.లేక మనవారు బ్రహ్మకుగూడా దుష్ట శిక్ష్నము విధిగా నియమించిరా అని ఊహించుకోవచ్చును.
 
బలరాముని దేవవర్గములో చేర్చెను. ఆయనకు కాళేందబెఢకుడను పేరు చేర్చెను.అమరుడు శేవధి అనగా శేవింగ్సుబ్యాంకు అన్నట్లు నామారధము తెలియపరచాడు.
సూర్యునికి పరివేషము గలదని అమరుడు తెలియప్రచుచున్నడు. ఆయన కాలమున మూడు వేదములే ముఖ్యములు. సూర్యోదయమునకు పోర్వము 5 గడియలను అస్తమమునకు ముందు 3 గడియలను సంధ్యాకాలము అని నిర్వచించెను. తెల్ల వారుకుటకు పూర్వము 44 గడియల కాలము విబోధకాలమట అనేక రాత్రులు కలిసియుండు కాలము, స్థలము, నార్యులకు అనుభవైక వైద్యమని లోకమాన్యుడు తెలిపినదానికి తార్కాణముగా గణరాత్రహ అనుపదము వాడుకలోనున్నట్లు అమరునివల్ల తెలియును. మరి ఇప్పుడు కచేరీలలో గంటలుకొట్టు పద్ధతినిబోలి ప్రతిజామునకు వద్యములు వాయించుచుండిరట. అమావాస్యనాడు సూర్యచంద్రులు ఏకస్థానము చేరుదురని అమరుడు నిర్వచించెను. పూర్వకాలమందు సంవత్సర ప్రారభదినమునందు [[ఉత్తరాయణ]] పుణ్యదివసము దక్షణాయంతముతో సంవత్సరాంతము అగుచున్నది. ఈఉత్తారాయముణ ప్రారంభము ఒకప్పుడు కార్తీకంబున ఇంకొకప్పుడు మార్గశీర్షంబున మరొకప్పుడు పుష్యమందున అని పరిశోధకులు తెలియ పరిచారు అని అమరుడి విదితము.
 
[[సరస్వతీదేవి]] భరతుడును ఋషిచే లోకమునకు ఆహ్వానింపబడినట. కాన భారతి అయినది. అమరుడు ఉదహరించిన వాద్యవిశేషములు ఇప్పుడు కానరావు. నాటకశాలలు, నాట్యమాడెడి స్త్రీలు, స్త్రీ వేషమువేయు పురుషులును అమరుడు తెలుపుచున్నాడు. కావ్యరసములలో 9,10 అగు శాంతమును అతడు నుడువలేదు. ఈర్ష్యాసూయములలో కించిబ్దేధముగలదనెను. పరుల సంపదకసహ్యపడుట ఈర్ష్య. పరుని సుగుణముల సరకుసేయుట దుర్గుణరూపముసేయుట అసూయట. శీలాప్రవర్తనలు, గుణగతము (character and conduct) లకు సరిపోవును. నాలుగు పడిగెలు తోకలుగలిగిన మనుష్యులట. వీరుగూడా దేవయోనులలో చేరినవారట. సముద్రములపయినను నదులపయినను ఓడలు నడుపుచు విదేశములతో వర్తకము చేయువాడుక అమరునినాటికి ఉంది. అట్టి వర్తకులపేర్లు మాపోతవణిక్కులు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అమరసింహుడు" నుండి వెలికితీశారు