షకలక శంకర్: కూర్పుల మధ్య తేడాలు

మరి కొంచెం విస్తరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
== వ్యక్తిగత జీవితం ==
శంకర్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వాడు. ఆర్థిక స్తోమత లేక పదోతరగతి దాకా చదువుకున్నాడు. ఒకసారి చిరంజీవి శివుడిగా నటించిన మంజునాథ సినిమా చిత్రీకరణ చూసి ఎలాగైనా సినిమాల్లో చేరాలని 2002 లో హైదరాబాదుకు వచ్చాడు. అప్పటికి అతని చేతిలో ఉన్న పని పెయింటింగు మాత్రమే.<ref name=sakshi>{{cite web|last1=విలేకరి|title=‘షకలక’ శంకర్|url=http://www.sakshi.com/news/features/about-shakalaka-shankar-166825|website=sakshi.com|publisher=జగతి ప్రచురణలు|accessdate=13 October 2016}}</ref> శంకర్ ఏప్రిల్ 2016 లో తన మరదలు పార్వతిని అరసవిల్లి లో వివాహం చేసుకున్నాడు. తన వివాహాన్ని పెద్ద ఎత్తున ఖర్చు చేయకుండా ఆ డబ్బుతో అవసరమైన వారికి పుస్తకాలు, క్రికెట్ కిట్లు పంపిణీ చేశాడు. అందుచేత ఆ వివాహానికి తన సినీ మిత్రులెవరూ హాజరు కాలేదు.<ref name=timesofindia>{{cite web|title=Comedian Shakalaka Shankar gets married|url=http://timesofindia.indiatimes.com/tv/news/telugu/Comedian-Shakalaka-Shankar-gets-married/articleshow/51956391.cms|website=timesofindia.indiatimes.com|publisher=TNN|accessdate=12 October 2016}}</ref>
 
== కెరీర్ ==
హైదరాబాదుకు వచ్చిన కొత్తల్లో తన స్నేహితుల దగ్గర ఉంటూ నాలుగేళ్ల పాటు పెయింటింగ్ పనులు చేశాడు. తరువాత ప్రముఖ నటి [[నిర్మలమ్మ]] వద్ద కొద్ది రోజులు పనిచేశాడు. అప్పుడే అతనికి సినీ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. కొద్దొ రోజులు ఆఫీస్ బాయ్ గా, ప్రొడక్షన్ బాయ్ గా పనిచేశాడు. రన్ రాజా రన్ సినిమా దర్శకుడు శంకర్ ముందుగాకు తను తీసిన ఓ లఘుచిత్రంలో అవకాశం ఇచ్చాడు.<ref name=sakshi/> తరువాత ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలో చలాకీ చంటి బృందంలో సభ్యుడిగా ప్రవేశించాడు. తరువాత ''షకలక శంకర్'' పేరుతో తనే సొంతంగా ఓ బృందం కూడా నడిపాడు. ప్రముఖ రాం గోపాల్ వర్మ ను అనుకరించడం, తనదైన శ్రీకాకుళం యాసతో, పవన్ కల్యాణ్ అభిమానిగా ఓ పాటను పాడటం లాంటి విలక్షణ శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తరువాత వరుసగా సినిమా అవకాశాలు వస్తుండటంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదు.
 
== సినిమాలు ==
* [[గీతాంజలి (2014 సినిమా)|గీతాంజలి]]
* [[ఎక్స్‌ప్రెస్ రాజా]]
* [[రన్ రాజా రన్]]
* [[బంతిపూల జానకి]]
* [[కుందనపు బొమ్మ]]
"https://te.wikipedia.org/wiki/షకలక_శంకర్" నుండి వెలికితీశారు