"కందికొండ యాదగిరి" కూర్పుల మధ్య తేడాలు

(Created page with '{{సమాచారపెట్టె వ్యక్తి | name = కందికొండ యాదగిరి | residence = | other_names = | image = | ca...')
 
కందికొండ స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి గ్రామం.ప్రాథమిక విద్య సొంతూర్లోనే పూర్తిచేసాడు. డిగ్రీ వరకు మహబూబాబాద్లో చదువుకున్నాడు. యం.ఎ (తెలుగు లిటరేచర్) మరియు యం.ఎ (పొలిటికల్ సైన్స్) చేసారు. కందికొండ తాను చదువుకునే రోజుల నుంచే పాటలు రాయడం నేర్చుకున్నాడు. ఆయనకు ఇంటర్ లో చక్రితో పరిచయం ఏర్పడింది. మొదట్లో జానపద గీతాలు రాస్తున్న కందికొండ సినీ సంగీత దర్శకుడైన చక్రి సాన్నిహిత్యంతో సినిమా సాహిత్యం వైపు మొగ్గు చూపాడు. చక్రి సంగీత దర్శకత్వంలో తొలిసారిగా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంలో మళ్లి కూయవే గువ్వా పాటతో సినీ సాహిత్యంలో అడుగుపెట్టారు. ఆ పాట తరువాత కందికొండ వెనకడుగు వేసింది లేదు. పాట వెంట పాట పందిరిలా సినీ సంగీతాభిమానులను అల్లుకుపోయాయి. తన చాలా పాటలకు ప్రాణం పోసింది చక్రియేనని, తానింతటి వాడు కావడానికి తనను ప్రోత్సహించింది చక్రి అని వినమ్రంగా చెప్పుకుంటడు కందికొండ. కందికొండకు మంచి అవకాశాలు ఇచ్చిన సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్.
నవరసాలూరించే పాటలు రాయడమంటే అంత తేలిక కాదు. రాసిన ప్రతి పాటా జనం నోళ్లలో నానించడమూ అంత తేలిక కాదు. కానీ రాసిన ప్రతి పాటనూ ఒక కోటగా మార్చిన ఘనత కందికొండది. సినీరంగంలో ఎన్నో పాటలకు కృషి చేసిన కందికొండ గురించి అతని సొంత గ్రామం వారికి తప్ప చాలా మందికి తెలియదు. “మళ్ళి కూయవే గువ్వా” పాట తెలియని సంగీతాభిమాని లేడు. అంతేకాదు “గలగల పారుతున్నగోదిరిలా” పాట హమ్మింగ్ చేయని వారుండరు. ఎన్నో పాటల అక్షరాలకు ప్రాణం పోసిన రచయిత కందికొండ.
 
==గీత రచయితగా వ్యవహరించిన సినిమాలు==
ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం
*143 and I miss you
*అల్లరి పిడుగు
*ఆప్తుడు
*ఒక రాధ ఇద్దరి కృష్ణుల పెల్లి
*చక్రం
*ఎంజోయ్
*ఆడుతూ పాడుతూ
*షాక్
*రణం
*పోకిరి
*సీతారాముడు
*స్టాలిన్‌
*తొలి చూపులోనే
*పొగరు
*చిన్నోడు
*రిలాక్స్
*భాగ్యలక్ష్మి బంపర్ డ్రా
*ఆదిలక్ష్మి
*నువ్వంటే నాకిష్టం
*జూనియర్స్
*ధన 51
*దొంగ దొంగది
*అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి
*మున్నా
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1989183" నుండి వెలికితీశారు