మయూరధ్వజము: కూర్పుల మధ్య తేడాలు

8 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
దిద్దుబాటు సారాంశం లేదు
 
==ఇతివృత్తము==
ఈ కథ జైమినీ భారతం లోనిది. భారత యుద్ధానంతరము బంధువుల నాశనానికి బాధపడుతున్న ధర్మరాజుకు ఉపశమనార్థం [[వ్యాసమహర్షి]] అశ్వమేధయాగాన్ని చేయమని బోధిస్తాడు. ధర్మరాజు అందుకు సమ్మతించి యాగాన్ని చేసి అశ్వరక్షకులుగా కృష్ణార్జునులను పంపగా, వారికి కృష్ణభక్తుడైన మయూరధ్వజుని కుమారుడు తామ్రధ్వజునికి జరిగే యుద్ధం ఈ నాటకంలో ప్రధాన ఇతివృత్తం.
[[కృష్ణార్జునులు]] బ్రాహ్మణవేషధారులై మయూరధ్వజుని యాచించి పులి ఆహారానికై వాని దేహంలో కుడి సగభాగం ఇమ్మంటారు. దానికి మయూరధ్వజుడు ఒప్పుకొని తన సతీసుతులను రంపంతో తన శరీరాన్ని రెండు భాగాలుగా కోయమంటాడు. వారు కోస్తున్న సమయంలో మయూరధ్వజుడు కన్నీరు విడువగా బ్రాహ్మణ వేషధారులు మాకు అక్కరలేదని నిరాకరిస్తారు. అప్ప్డుడు సగము కోతపడిన మయూరధ్వజుడు వారితో "అయ్యా, నా ఎడమ కంటి నుండి నీరు వచ్చిందే కాని కుడికంటి నుండి రాలేదు. కారణం కుడి భాగం మాదిరిగా ఎడమ భాగం సత్పాత్రదానానికి ఉపయోగపడలేదనే చింత తప్ప వేరేకాదు" అని వివరించగా కృష్ణార్జునులు వాని సత్యదీక్షకు,త్యాగశీలతకు మెచ్చి తమ నిజరూపములతో ప్రత్యక్షమై వానిని సంతోషపెట్టడం ఈ నాటకములో చక్కగా వర్ణించబడింది.
 
==పత్రికాభిప్రాయము==
2,05,305

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1989524" నుండి వెలికితీశారు