వీర్యం: కూర్పుల మధ్య తేడాలు

మూస:18+ కి మాత్రమే
పంక్తి 23:
శుక్రం ఇన్‌ఫెక్షన్లకు గురైన వారికి, శుక్రకణాలు నిర్జీవంగా మారుతున్నవారికి, వీర్యంలో పునరుత్పత్తి తత్వం తగ్గిపోయే వారికి కూడా వాజీకరణ చికిత్సలు తప్పనిసరి అవుతాయి. వాజీకరణ చికిత్స, శుక్రకణాల సంఖ్యను వాటి నాణ్యతను, చలనశక్తిని పెంచడమే కాకుండా, నిండైన పురుషత్వాన్ని నిలబెట్టే టెస్టోస్టెరాన్ హార్మోన్ల వృద్ధికి కూడా అద్భుతంగా తోడ్పడుతుంది. ఇప్పటికే శుక్రకణాలు త గ్గపోయిన వారే కాదు, ఇప్పుడు బాగానే ఉన్నా మునుముందు తగ్గిపోయే అవకాశాల్ని అరికట్టడానికి కూడా వాజీకరణ చికిత్సలు తప్పని సరి.
==వీర్య కణం ప్రేరణగా రోబో ==
వీర్య కణం ఆధారంగా శాస్త్రవేత్తలు ఒక సూక్ష్మ రోబోను తయారుచేశారు. అది అయస్కాంత క్షేత్రం సాయంతో పనిచేస్తుంది. శరీరంలో ఔషధాల చేరవేతకు, ఐవీఎఫ్ విధానంలోను, సూక్ష్మ స్థాయిలోని ఇతర అవసరాల కోసం ఇది ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పరిశోధన బృందంలో భారత సంతతికి చెందిన సర్తాక్ మిశ్రా కూడా ఉన్నారు.<ref>http://www.lovequotesfor.com/2016/06/romantic-good-morning-quotes-for-him.html</ref>
 
నెదర్లాండ్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ట్వెంటీ, కైరోలోని జర్మన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు మ్యాగ్నెటోస్పెర్మ్ అనే ఈ రోబోను తయారుచేశారు. దీన్ని డోలనంలో ఉన్న బలహీన అయస్కాంత క్షేత్రాల ద్వారా నియంత్రిస్తారు. ఈ రోబో పొడవు 322 మైక్రాన్లు.
సాంకేతిక పరిజ్ఞానం పెరిగేకొద్దీ చాలా ఉత్పత్తుల పరిమాణం తగ్గిపోతుందని మరో శాస్త్రవేత్త ఖలీల్ చెప్పారు. శరీరంలో ఔషధాలను చేరవేయడానికి, ఐవీఎఫ్ విధానానికి, మూసుకుపోయిన రక్తనాళాలను తెరిపించడానికి ఉపయోగించవచ్చని వివరించారు.<ref>http://www.pcworld.com/article/2359000/inspired-by-sperm-tiny-robots-could-deliver-drugs.html</ref><ref>http://gadgets.ndtv.com/science/news/researchers-develop-sperm-inspired-robots-controlled-by-magnetic-fields-535540</ref>
 
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/వీర్యం" నుండి వెలికితీశారు