కమ్మనాడు: కూర్పుల మధ్య తేడాలు

Updating soon.....
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 223.182.73.85 (చర్చ) చేసిన మార్పులను 117.211.40.75 యొక్క చివరి కూర్పు వరకు తిప...
పంక్తి 1:
'''కమ్మనాడు''' '''కమ్మరాష్ట్రం''' అను ప్రాంతము భౌగోళికముగా తీరాంధ్రప్రాంతము లోనిది. కమ్మరాష్ట్రంనకు తూర్పు సముద్రము, దక్షిణము [[నెల్లూరు]], పడమర [[శ్రీశైలం]], ఉత్తరం [[ఖమ్మం]] హద్దులుగా ఉండేవి. చారిత్రకముగా కమ్మనాడు ప్రస్తావన క్రీస్తు శకము మూడవ శతాబ్ది నుండి 1428 తక్కెళ్ళపాడు శాసనములవరకు మనకు కనపడును. కమ్మనాడు అను పదము కర్మరాష్ట్రము ([[సంస్కృతము]]) లేక కమ్మరాట్టము (పాళి) నుండి పరిణామము చెందినది. ఈ ప్రాంతములో [[బౌద్ధమతము]] క్రీస్తు పూర్వము నాలుగవ శతాబ్ది నుండి పరిఢవిల్లుచున్నది. తేరవాద బౌద్ధ కర్మ (కమ్మ) సిద్ధాంతము నుండి ఈ పదము ప్రాంతమునకు అన్వయించబడినది.
 
 
కర్మరాష్ట్రములోని [[భట్టిప్రోలు]], [[ధరణికోట]], [[విజయపురి ]] [[శాతవాహనులు|శాతవాహనులకు]], [[ఇక్ష్వాకులు|ఇక్ష్వాకులకు]] పట్టుకొమ్మలు. ఇచ్చటి బౌద్ధ స్తూపములు, చిత్రకళ, శిల్పము ప్రపంచ ఖ్యాతి గాంచినవి.
 
==శాసనములు==
 
1. కర్మరాష్ట్రము అను పదము మొదట ఇక్ష్వాకు రాజు మాధారిపుత్ర పురుషదత్తుని [[బేతవోలు]] ([[జగ్గయ్యపేట]]) శానములో గలదు (3వ శతాబ్దము).
 
2. అటుపిమ్మట పల్లవ రాజు రెండవ కుమార విష్ణుని [[చెందులూరు]] గ్రామశాసనములో దొరికినది.
 
3. మూడవ ఆధారము [[తూర్పు చాళుక్యులు|తూర్పు చాళుక్య]] రాజు మంగి యువరాజ (627-696) శాసనము:
 
''శ్రీసర్వలొకాశ్రయ మహరాజః కమ్మరాష్ట్రె చెందలూరి గ్రామే''
 
4. మూడవ శతాబ్దమునుండి పదకొండవ శతాబ్దము వరకు శాసనములలో కమ్మరాష్ట్రము, కమ్మరట్టము, కమ్మకరాటము, కర్మరాష్ట్రము, కర్మకరాటము, కర్మకరాష్ట్రము మరియు కమ్మకరాష్ట్రము పర్యాయపదములుగా వాడబడినవి.
 
5. [[రాజరాజ నరేంద్రుడు|రాజరాజనరేంద్రుని]] సమకాలీకుడగు [[పావులూరి మల్లన]] (1022-1063) ఈ విధముగా వ్రాసెను:
 
''ఇల కమ్మనాటి లోపల విలసిల్లిన పావులూరి విభుడన్''
 
6. [[తెలుగు చోడులు|తెలుగు చోడుల]] మరియు [[కాకతీయులు|కాకతీయుల]] శాసనములలో కమ్మనాడు (కొణిదెన శాసనము-త్రిభువనమల్ల – 1146). కాకతీయ చక్రవర్తి [[ప్రతాపరుద్రుడు|ప్రతాపరుద్రుని]] కాలములో బొప్పన కామయ్య కమ్మనాటిని కాట్యదొన ([[కొణిదెన]]) రాజధానిగా పాలించుచుండెను.
 
 
కాకతీయుల, ముసునూరి వారి పతనముతో కమ్మనాడు అను పదము వాడుకలోనుండి మరుగు పడినది. కాని [[కమ్మ]] అను పదము మాత్రము ఒక సామాజిక వర్గము ([[కులము]])నకు పేరుగా మిగిలిపోయినది.
 
==వనరులు==
 
* Burgess, J. 1886, Buddhist Stupas of Amaravathi and Jaggayyapeta, Madras Presidency, Archaeological Survey of India, p. 110.
* K. R. Subramanian, K. R. 1932, Buddhist remains in Āndhra and the history of Āndhra between 224 & 610 A.D. Asian Educational ervices, New Delhi, ISBN 81-206-0444-X, p. 149.
* Epigraphica Indica, Vol VIII, pp. 233-236 (Chandaluru copper plate inscription of Kumara Vishnu)
* Epigraphica Indica, Vol XV, pp. 249-252 (Ongole copper plate inscription of Pallava king Vijaya Skandavarma)
* Epigraphica Indica, Vol XXIV, pp. 137-143 (Chura inscription of Vishnugopa)
* Epigraphica Indica, Vol XVIII, p. 250 (Kopparapu copper plate inscription of Pulakesi II, 7th century CE)
* Epigraphica Indica, Vol XVIII, p. 27 (Aluru inscription of Chalukya king Vikramaditya V, 1011 CE).
* South Indian Inscriptions, Volume 6, Inscriptions 124, 128, 129, 132, 139, 147, and 179(http://www.whatisindia.com/inscriptions/)
*ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి - శ్రీ ఖండవల్లి లక్ష్మీనిరంజన రావు
* కమ్మవారి చరిత్ర - శ్రీ కె. బావయ్య చౌదరి
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాలు]]
"https://te.wikipedia.org/wiki/కమ్మనాడు" నుండి వెలికితీశారు