కన్నవారిల్లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
starring = [[నారాయణరావు]],<br>[[సీమ]]|
}}
==తారాగణం==
* [[అంజలీదేవి]]
* [[కైకాల సత్యనారాయణ|సత్యనారాయణ]]
* [[జి.నారాయణరావు(నటుడు)|నారాయణరావు]]
*
==చిత్రకథ==
అయిదుగురు ఆడపిల్లల తండ్ర్రి రామారావు. అనుకూలవతి అయిన భార్య శారద. పూలబాటపి సాఫీగా సాగిపోతున్న పచ్చని సంసార నౌక వారిది. అయిదుగురు కుమార్తెలకు వారికి నచ్చిన వారితో వివాహం చేసి, తండ్రిగా తన భాద్యత తీర్చుకుంటాడు రామారావు. అయితే జీవనయాత్రలో సహజమైన ఒడుదుడుకులు రామారావు ఎదుర్కొనక తప్పలేదు. సాఫీగా సాగిపోతున్న అతని సంసారం ఇబ్బందుల పాలవుతుంది. కుమార్తెల వివాహం కోసం కొట్టు తాకట్టు పెట్టి తెచ్చిన అప్పు తీర్చలేక పోవడంతో కొట్టు వేలం వేయబడి, ఆ కుటుంబానికి జీవనాధారం పోతుంది. పైలట్‌గా పనిచేస్తున్న పెద్ద అల్లుడు విమాన ప్రమాదానికి గురికావడంతో నిరాధార అయిన పెద్ద కుమార్తె లక్ష్మి తండ్రి పంచన చేరుతుంది. మరో కుమార్తె ఉమ భర్త రాజు దొంగనోట్ల కేసులో పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉమ, కార్మికులలో అలజడిరేపిన నేరానికి భర్త శంకరం జైలు పాలుకావడంతో మరో కుమార్తె విమల, అత్తగారి చేత ఇంటి నుండి గెంటి వేయబడిన కమల, తనకు సంతానయోగం లేదని తెలిసి తన భర్తకు రెండవ వివాహం చేయడానికి మామగారు ప్రయత్నిస్తున్నారని తెలుసుకుని కుమిలిపోయిన రమ కూడా కన్నవారింటికి వస్తారు. కుమార్తెలు కళకళలాడుతూ కాపురాలు చేసుకుంటూ ఉంటే చూసి ఆనందించాలని కలలుగన్న రామారావుకు ఈ సంఘటనలతో మనస్సు వికలమౌతుంది. అయితే ఈ కష్టాలన్నీ తాత్కాలికమై మళ్లీ కుమార్తెల సంసారాలు చక్కబడతాయి<ref>{{cite news|last1=గాంధీ|title=చిత్ర సమీక్ష - కన్నవారిల్లు|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=10930|accessdate=15 October 2016|work=ఆంధ్రపత్రిక|date=26 May 1978|page=4|language=తెలుగు}}</ref>.
"https://te.wikipedia.org/wiki/కన్నవారిల్లు" నుండి వెలికితీశారు