"ఉత్తర సర్కారుల్లో ఐరోపా వారి యుద్ధాలు" కూర్పుల మధ్య తేడాలు

మూలాల సవరణ, చేర్పు
(మూలాల సవరణ)
(మూలాల సవరణ, చేర్పు)
 
=== పర్యవసానాలు ===
దాడి సమయానికి సలాబత్ జంగ్ కేవలం 24 కి.మి. దూరంలో ఉన్నాడు. దు రోచర్ ఇంకా దగ్గరిలోనే ఉన్నాడు. కానీ బ్రిటిషు వారు సాధించిన విజయం వారిని నిశ్చేష్టులను చేసింది. నిజాము బ్రిటిషు వారితో చర్చలకు సిద్ధపడి, ఒక నెల రోజుల పాటు బేరాలు చేసి, వారితో ఒడంబడిక కుదుర్చుకున్నాడు. బ్రిటిషు వారికి 128 కి.మీ. తీరప్రాంతాన్ని అప్పగించేందుకు, ఫ్రెంచి వారితో ఎప్పుడూ చేతులు కలపకుండా ఉండేందుకు, సర్కారు ప్రాంతాల నుండి వెళ్ళిపోయేందుకూ ఒప్పుకున్నాడు. దాంతో హైదరాబాదు దర్బారులో ఫ్రెంచి వారి స్థానంలో బ్రిటిషు వారి ప్రాభవం ఏర్పడింది. యుద్ధం ముగిసాక, బ్రిటిషు సైన్యంలోని బెంగాలు ఐరోపా దళం వెనక్కి వెళ్ళిపోయింది.
 
అక్టోబరు 15 ప్రాంతంలో కోట కాపలా కెప్టెన్ ఫిషరుకు, 1100 మంది సైన్యంతో సహా అప్పజెప్పి, కలనల్ ఫోర్డు ఓడపై కలకత్తా వెళ్ళిపోయాడు.
 
డిసెంబరు 5 న ఫిషరు సైన్యాన్ని తీసుకుని కాకినాడపై దాడి వెళ్ళి, అక్కడ చెవాలియర్ పేట్‌కు చెందిన సైన్యాన్ని బందీలుగా పట్టుకున్నారు. చెవాలియర్, కొంతమంది అనుచరులతో పారిపోయాడు.
 
== తదుపరి ==
మచిలీపట్నంలోని సైన్యానికి మద్దతుగా కొద్దిపాటి సైన్యంతో దక్షిణం నుండి వచ్చిన ఫ్రెంచి ఆఫీసరు ఎం.మొరాసిన్ నవంబరు 11 న మచిలీపట్నం చేరుకుని, అక్కడ తమ సైన్యం ఓడిపోయిందన్న వార్త తెలుసుకుని నేరుగా కాకినాడ వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న జగపతి రాజు, ఆనందరాజుకు బంధువు. ఆనందరాజుతో తనకున్న శతృత్వం కారణంగా ఆనందరాజు బ్రిటిషు వారి పక్షం వహించినపుడు తాను ఫ్రెంచి పక్షాన చేరాడు. చెందుర్తిలో విజయం తరువాత, కలనల్ ఫోర్డు ఈ ప్రాంతాన్ని ఆనందరాజుకు ఇచ్చాడు. కాని దాన్నతడు స్వాధీనపరచుకోలేదు. మొరాసిన్ కాకినాడలో దిగగానే, సామర్లకోటలో ఉన్న జగపతిరాజుతో చర్చలకు ప్రయత్నించాడు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఆ తరువాత మొరాసిన్ తన దళంతో తిరిగి పాండిచ్చేరి వెళ్ళిపోయాడు.
 
ఆ తరువాతి నెలలో మరో చిన్న ఫ్రెంచి దళం చెవాలియర్ పీట్ సారథ్యంలో రాజుతో చర్చలు జరిపేందుకు గంజాం నుండి కాకినాడ వచ్చింది. ఈలోగా మచిలీపట్నం నుండి కెప్టెన్ ఫిషరు నాయకత్వంలోని సైన్యం బెంగాలుకు తిరుగు ప్రయాణమైంది. రాజమండ్రి చేరుకున్నాక, ఫ్రెంచి దళం కాకినాడలో దిగిందని అతడికి తెలిసింది. వెంటనే అతడు కాకినాడకు బయల్దేరాడు. అతడు అక్కడికి చేరుకునేసరికి, ఫ్రెంచి దళం అక్కడున్న డచ్చి స్థావరంలో తలదాచుకున్నారు. వారిని తమకు అప్పగించమని బ్రిటిషు వారు వత్తిడి తేగా, డచ్చివారు అందుకు అంగీకరించి, ఫ్రెంచి వారిని ఆప్పగించారు.
 
ఫ్రెంచి దళంలో కొంతమండి సైనికులు ఓడల్లోనే ఉండిపోయారు. వారు చెవాలియర్ పీట్ నాయకత్వంలో పాండిచ్చేరి వెళ్ళిపోయారు. బ్రిటిషు సైన్యం విశాఖపట్నం చేరుకుని అక్కడినుండి ఓడలపై కలకత్తా వెళ్ళిపోయింది.
 
ఆ విధంగా కొద్ది నెలల కాలంలో ఉతర సర్కారులు మొత్తంపై ఫ్రెంచి వారి ప్రాబల్యం పూర్తిగా అంతరించిపోయింది. మచిలీపట్నం నుండి నిజాంపట్నం వరకూ ఉన్న తీర ప్రాంతం బ్రిటిషు వారి పరం కాగా మిగతా ప్రాంతం తిరిగి నిజాము ఏలుబడిలోకి వెళ్ళింది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1991471" నుండి వెలికితీశారు