నీలి చిత్రాలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కొసం → కోసం, ఖచ్చితం → కచ్చితం, మళయాళ → మలయాళ (3) using AWB
పంక్తి 2:
[[సినిమా]]లలో అశ్లీలత లేదా [[బూతు]] మోతాదును మించినట్లయితే వాటిని '''బూతు సినిమాలు''' అనవచ్చును. ఒక నిర్వచనం: [[ఆంగ్లం]]లో pornography అనే పదానికి “all explicit material intended to arouse the reader,viewer or a listener” అనే అర్థముంది. ఇందులో “explicit” యొక్క అర్థం ప్రతి దేశానికీ, [[భాష]]కూ సంస్కృతికీ మారుతూ ఉండటం. భారతదేశంలోని చట్టబద్దమైన కొన్ని మార్పులకు అనుగుణంగా ఈ నిర్వచనాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ చిత్రాలను '''నీలి చిత్రాలు''' (Blue Films) అనకుండా '''పెద్దలకు మాత్రమే చిత్రాలు''' (Adults only Films) అని పిలవాలి. ఎందుకంటే, ఇవి 1952 నాటి భారతీయ [[సినిమాటోగ్రఫీ]] చట్టానికి లోబడి తమ పరిధుల్ని నిర్వచించుకున్నాయి. వ్యవహారికంగా “బూతు చిత్రాలు” అని చెప్పినా చట్టప్రకారం ఇవి “పెద్దలకు మాత్రమే” చిత్రాలన్న మాట.
 
ఆంగ్లంలోని నీలి చిత్రాలను సాఫ్ట్ కోర్ (Softcore) మరియు హార్డ్ కోర్ (Hardcore) గా విభజిస్తారు. మన తెలుగులో వస్తున్న చిత్రాలు సాఫ్ట్ కోర్ వర్గానికి చెందినవిగా ఉంటాయి. [[ఇంటర్నెట్]], శాటిలైట్ టేలివిజన్ మరియూ CD- DVD లలో బూతు ప్రపంచాన్ని ఏలుతున్నా, ఈ చిత్రాల నిర్మాణం మరియూ ప్రదర్శనా నిరాటంకంగా జరుగుతూనే ఉంది. వీటి ప్రదర్శన కొసంకోసం కొన్ని పట్టణాలలో ప్రత్యేకమైన సినిమా హాళ్లు కూడా నడుస్తున్నాయి.
 
==తెలుగు చిత్రాలు==
తెలుగు భాషలో ఈ బూతు చిత్రాల నిర్మాణం విరివిగా జరిగిన దాఖలాలు చాలా తక్కువ. ముఖ్యంగా మళయాళమలయాళ పరిశ్రమ నిర్మించిన చిత్రాను అనువాద ([[డబ్బింగ్]]) రూపంగా తెలుగు ప్రేక్షకుల మధ్యకు తీసుకువచ్చిన సినిమాలే ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ట్రెండ్ కు రెండు ముఖ్యమైన కారణాలున్నాయి. ఒకటి మళయాలంలోమలయాళంలో ఫిలిం సెన్సారు చాలా ‘పెద్ద మనసుతో వ్యవహరించడం’. రెండవది, ఒకసారి ఈ మళయాలమలయాళ చిత్రాలను వారి సెన్సారు బోర్డు క్లియర్ చేసిన తరువాత తెలుగు సెన్సారు వారు అక్కడక్కడా ఆడియో తప్ప వీడియో కట్ చేసే అధికారం లేకపోవడం. ఈ లొసుగుల్ని కనిపెట్టి, పెద్ద స్థాయిలో బూతు సినిమాల నిర్మాణం జరిగిన 80 వ దశకంలో చాలా వరకూ చిత్రాల నిర్మాతలు తెలుగువారేనని ఒక అనుమానం. అది నిజం కాకపోయినా, మార్కెట్ మరియూ పంపిణీని దృష్టిలో ఉంచుకుంటే ఈ అనుమానం అబద్దమని మాత్రం ఖచ్చితంగాకచ్చితంగా చెప్పలేము.
 
==విభజన==
పంక్తి 22:
==ఇవి కూడా చూడండి==
[[నీలి చిత్రాల నటులు]]
 
[[వర్గం:తెలుగు సినిమా]]
[[వర్గం:సినిమా]]
"https://te.wikipedia.org/wiki/నీలి_చిత్రాలు" నుండి వెలికితీశారు