అరబిందో: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బాల్యము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విభేధా → విభేదా using AWB
పంక్తి 86:
కృష్ణధనఘోషుకు ఆంగ్లవిద్యమీద అభిమానం ఎక్కువ. అందుచేత బాగా చిన్నతనంలో అరవిందుని డార్జిలింగు పంపించి అక్కడ సయింట్ పాల్ స్కూల్ లో చదివించారు. అయినా తృప్తి చెందక [[ఇంగ్లండు]] వెళ్ళినారు. అక్కడే వీరి చిన్న కుమారుడు వారేంద్రుడు జన్మించారు. కాని అక్కడ వీరు కుమార్తె సరోజినీదేవి ఉన్మాదవ్యాధితో బాధపడుతుండడం వల్ల అక్కడనుండి భారతదేశం తిరిగి వచ్చేరు. అరవిందులు 7 ఏండ్లు ఇంగ్లాండులో తరువాత 5 ఏండ్లు మాంచెశ్తరులో చదువుకున్నారు.ఈయన తన 18వ ఏటనే ఇ.పి.యస్ పరీక్షకు హాజరై గ్రీక్, లాటిన్ భాషలలో అత్యుత్తమ తరగతిలో ఉత్తీర్ణులయినారు.
 
కళాశాలాచార్య పదవి విడిచిన తరువాత అరవిందులు [[వందేమాతరం]] పత్రికాసంపాదకత్వం స్వీకరించారు. అంతకుపూర్వం వారపత్రికగా ప్రచురింపబడుతున్న ఈ ఆంగ్లపత్రిక అరవిందుల సంపాదకత్వంలో దినపత్రిక అయింది. ఈపత్రికమూలంగా జాతీయతత్వం వంగదేశాన్ని ఉర్రూతలూగించింది. క్రమంగా వీరి జాతీయ సందేశం భారతదేశం అంతటా అల్లుకోవడం మొదలుపెట్టింది. ఈసమయంలో ఆంగ్లప్రభుత్వం వీరిని రాజద్రోహ నేరంమీద శిక్షించాలని ప్రయత్నించింది. కాని నేరం ఋజువు కాకపోవడంవల్ల ప్రభుత్వం వీరిని ఏమీచెయ్యలేకపోయింది. అరవిందులీ సమయంలోనే 1907 డిసెంబరులో జరిగిన సూరత్కాంగ్రేస్ జాతీయపక్షనేతలుగా హాజరైనారు. అక్కడ మితవాదులకు జాతీయపక్ష నాయకులైన అరవింద ప్రభృత్యులకు మధ్య తీవ్ర విభేధాలువిభేదాలు బయలుదేరాయి. జాతీయపక్షనేతలందరు అరవిందుల నాయకత్వంతో వేరుగా ఒక సమావేశం జరిపి దేశాభివృద్ధికరమైన మార్గం ఆదేశించారు. అటుతరువాత వీరిపై అల్లీపూరు బాంబుకేసు నడిచింది. అరవిందుల కనిష్ఠసోదరుడు వారీంద్రుడు విప్లవకారుడు కావడం వలన వీరిపై ప్రభుత్వం అపోహలు మోపారు. దీనిమూలంగా అరవిందులు జైలులో పలు కష్టాలు అనుభవించారు. ఈ ఆలీపూరు కేసులో [[చిత్తరంజను దాసు]] వీరికి న్యాయవాదిగా పనిచేసారు.
 
==జీవిత విషయాలు==
"https://te.wikipedia.org/wiki/అరబిందో" నుండి వెలికితీశారు