ఆల్కహాలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కంటె → కంటే (2) using AWB
పంక్తి 28:
మెతల్ ఆల్కహాలులో ఉన్న ఈ (-OH) గుంపుని ఇంగ్లీషులో “హైడ్రాక్సిల్ గ్రూప్” (hydroxyl group) అంటారు. “హైడ్రొజన్”, “ఆక్సిజన్” అన్న మాటలని సంధించగా వచ్చింది ఈ హైడ్రాక్సిల్ అన్న పదం. ఒక పదార్థపు బణువులో కర్బనంతో పాటు ఈ హైడ్రాక్సిల్ గుంపు ఎప్పుడు ఉన్నా ఆ పదార్థాన్ని “ఆల్కహాలు” అనే పిలుస్తారు. అంటే, ఈ ఆల్కహాలు అనేది ఇంటిపేరు లాంటిది. ఒకే ఇంటిపేరుతో ఎంతోమంది మనుష్యులు ఉన్నట్లు, ఆల్కహాలు పేరుతో ఎన్నో రసాయనాలు ఉన్నాయి. మెతల్ గుంపు (-CH<sub>3</sub>) తో హైడ్రాక్సిల్ గుంపు (-OH) కలిస్తే మెతల్ ఆల్కహాలు వస్తుంది. ఎతల్ గుంపు (-C<sub>2</sub>H<sub>5</sub>) తో హైడ్రాక్సిల్ గుంపు (-OH) కలిస్తే ఎతల్ ఆల్కహాలు వస్తుంది. ఇదే బాణీలో ప్రొపైల్ ఆల్కహాలు, బ్యుటైల్ ఆల్కహాలు, … అలా ఎన్నో ఉన్నాయి.
 
ఈ మెతల్ ఆల్కహాలుని శాస్త్రీయపు భాషలో కాకుండా సామాన్యులు వాడే ఇంగ్లీషులో “ఉడ్ ఆల్కహాల్” (wood alcohol) అంటారు. (అంటే కర్రసారా అన్న మాట. కర్రలని ఆవంలో పెట్టి బట్టీ పడితే కర్రసారా వస్తుంది.) నిజానికి ఈ మెతల్ ఆల్కహాలుకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? గ్రీకు భాషలో “మెథీ” అంటే సారా, “హాల్” అంటే చిట్టడవి. ఇంగ్లీషులో చిట్టడవిని “ఉడ్” (wood) అంటారు. కనుక “మెతల్ ఆల్కహాల్”కి ఇంగ్లీషులో wood alcohol అని పేరు వచ్చింది కనుక తెలుగులో “అడవి సారా” అవాలి. కాని ఇంగ్లీషు వచ్చుననుకునే తెలుగు వాళ్లు “ఉడ్” అన్న మాటని “కర్ర” అని తెలిగించి దీనిని "కర్రసారా" అన్నారు. ఒక విధంగా "అడవి సారా" కంటెకంటే "కర్ర సారా" అన్న మాటే బాగుందనిపిస్తుంది.
 
ఒకే పదార్థానికి ఇన్నేసి పేర్లు ఉండటంతో ఒకరి మాట మరొకరికి అర్థం కాకుండా పోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు శాస్త్రవేత్తలంతా జినీవాలో సమావేశమయి ఒక ఒప్పందానికి వచ్చేరు. ఈ ఒప్పందం ప్రకారం ఆల్కహాలు జాతి పదార్థాలన్నిటికి పేరులో చివర “ఓల్” (-ol) శబ్దం రావాలన్నారు. ఈ ఒప్పందం ప్రకారం మెతల్ ఆల్కహాలు పేరుని “మెతనోలు” (మెతనాలు కాదు) గా మార్చమన్నారు. ఉచ్చారణ దోషం లేకుండా పలకమన్నారు. వర్ణక్రమదోషం లేకుండా రాయమన్నారు. ఆల్కహాలుని ఆల్కహోలు అనక్కరలేదు కాని, మెతల్ ఆల్కహాలుని మెతనోల్ అనాలి. ఇదే విధంగా ప్రొపైల్ ఆల్కహాలుని ప్రొపనోల్ అనాలి. బ్యుటైల్ ఆల్కహాలు బ్యుటనోల్ అవుతుంది.
పంక్తి 81:
 
ఈ ఐసోప్రోపైల్ ఆల్కహాలుకి ప్రొపనోలు కంటెకంటే మంచి పేరు మరొకటి ఉంది; అదే 2-ప్రొపనోలు. ఇక్కడ 2 ని చూడగానే రెండవ (ఎటునుండి లెక్కించినా రెండవదే!) కర్బనపు అణువుకి ప్రత్యేకత ఉంది అని చెబుతోంది. ఏమిటా ప్రత్యేకత? అక్కడ (-OH) గుంపు ఉండడం. కనుక “2-ప్రొపనోల్” అని చెప్పగానే రెండవ (మధ్య) కర్బనపు అణువుకి హైడ్రాక్సిల్ గుంపు తగిలించి ఉంది, మిగిలినవాటికి ఉదజని అణువులే తగిలించి ఉన్నాయి అని అర్థం. ఈ “2-ప్రొపనోల్”ని తెలుగులో “2-త్రయోల్” అని పిలవచ్చు.
 
ఈ ఐసోప్రోపైల్ ఆల్కహాలు (2-త్రయోల్) లక్షణాలు కొన్ని పరిశీలిద్దాం. ఇది విష పదార్థమే కాని మెతల్ ఆల్కహాలు (మెతనోలు) అంత అన్యాయం కాదు. దీనికున్న ఘాటైన రుచి వల్ల ప్రజలు పరాగ్గా కూడా దీనిని తాగడానికి ఇష్టపడరు. తాగకుండా ఉంటే ఇది ప్రమాదకరమైనది కాదు. ఈ 2–త్రయోల్ శరీరానికి పూసుకుంటే చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకనే పైపూతలకి వాడే సెంట్లు, అత్తరులు, గీసుకునే ముందు గడ్డానికి పులుముకోడానికి, సిరాలలోను దీనిని విరివిగా వాడతారు. చిన్న పిల్లలకి జ్వరం బాగా వస్తే, ఉష్ణాన్ని త్వరగా తగ్గించడానికి వైద్యులు ఈ 2-త్రయోల్ ని శరీరానికి రాసి, మర్దనా చేస్తారు. మర్దనా చెయ్యడాన్ని ఇంగ్లీషులో “రబ్బింగ్” అంటారు కనుక దీనిని రబ్బింగ్ ఆల్కహాల్ (rubbing alcohol) అని కూడా పిలుస్తారు. ఈ రబ్బింగ్ ఆల్కహాలుకి తెలుగు పేరు మర్దనోలు. ఇది శరీరానికి రాసి మర్దనా చేసే ముందు చర్మం ఎక్కడా పగిలిపోయి కాని, చీరుకుపోయి కాని, తెగిపోయి కాని ఉండకూడదు. పైన ఉన్నంతసేపే దీని ఉపయోగం; లోపలికి వెళితే ప్రమాదం.
"https://te.wikipedia.org/wiki/ఆల్కహాలు" నుండి వెలికితీశారు