ఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: టెలివిషన్ → టెలివిజన్, కంటె → కంటే (2) using AWB
పంక్తి 2:
 
==సంగ్రహం==
వైజ్ఞానిక, సాంకేతిక రంగాలలో ఉన్న ఇంగ్లీషుని తెలుగులోకి మార్చటంలో ఉన్న సమస్యలని, వాటి పరిష్కార మార్గాలని అభివర్ణించటం జరిగింది. తెలుగులోకి అనువదించబడ్డ పాఠ్యాంశంలో తెలుగు నుడికారం ఉట్టిపడాలంటే తెలుగు వాడకంలో దొర్లే ఇంగ్లీషు తత్సమాలు 25 శాతం మించకుండా ఉంటే బాగుంటుందని ప్రతిపాదించటం జరిగింది. ఈ గమ్యాన్ని చేరుకోవటం కష్టమేమీ కాదు. మొదట, ఇంగ్లీషు మాటలని యథాతథంగా పెద్ద ఎత్తున గుచ్చెత్తి వాడెయ్యకుండా, సాధ్యమైనంత వరకు ఉన్న తెలుగు మాటలని వాడటానికి ప్రయత్నం చెయ్యటం. రెండు, సమానార్థకమైన తెలుగు మాట లేకపోయినా, వెనువెంటనే స్పురించకపోయినా ఇంగ్లీషు తత్సమాలని వాడటం కంటెకంటే తెలుగు ఉచ్చారణకి లొంగే తద్భవాలని వాడటం. మూడు, సందర్భానికి సరిపోయే భావస్పోరకమైన తెలుగు మాటలని అవసర రీత్యా సృష్టించి వాడటం. నాలుగు, ఇంగ్లీషు వాడుకలో స్థిరపడిపోయిన దుర్నామాలని యథాతథంగా తెలుగులోకి దింపేసుకోకుండా జాగ్రత పడటం. చివరగా, ఈ ప్రయత్నాలన్నీ విఫలమైన సందర్భాలలో ఇంగ్లీషు మాటలని తెలుగు లిపిలో రాయటం. (ముద్రణకి వీలయినప్పుడు, పక్కని కుండలీకరణాలలో ఇంగ్లీషు లిపిలో చూపించటం.) ఈ సూచనలన్నీ ఆచరణయోగ్యాలేనని అనుభవం చెబుతోంది.
==ప్రవేశిక==
ఆధునిక వాణిజ్య, వ్యాపార, వైజ్ఞానిక, సాంకేతిక రంగాలలో విస్తారంగా వాడుకలో ఉన్న ఇంగ్లీషుని సరళమైన, భావస్పోరకమైన, దేశీ నుడికారంతో ఉట్టిపడే తెలుగులోకి మార్చటంలో ఉన్న కష్టసుఖాలని విశ్లేషించి, ఆచరణయోగ్యమైన సలహాలు ఉత్పాదించాలనే కోరిక ఈ వ్యాసానికి ప్రేరణ కారణం. అనువాదకుడు సాంకేతిక, వైజ్ఞానిక రంగాలలో అనుభవజ్ఞుడనిన్నీ, అతని మాతృభాష తెలుగనిన్నీ అనుకుందాం. “అంతా ఇంగ్లీషు నేర్చేసుకుంటే పోలేదా? అపారమైన ఇంగ్లీషు వైజ్ఞానిక సాహిత్యాన్ని తెలుగులోకి దింపటానికి ప్రయత్నించటం అవివేకం కాదా?” వంటి ప్రశ్నల మీద తర్జనభర్జనలు జరపడానికి ఇది వేదిక కాదు..
పంక్తి 31:
 
==తెలుగుపై ఇంగ్లీషు ప్రభావం==
అనుకరణకి గమ్యం తెలుగు అనుకున్నప్పుడు ఏ తెలుగు అనే ప్రశ్న వస్తుంది? ఈ వ్యాసం నిర్మించుకున్న పరిధిలో మన గమ్యం శిష్టవ్యవహారికం – అనగా, ఈ రోజుల్లో వార్తాపత్రికలలోను, అంతర్జాల పత్రికలలోను, కథలలోను, తరచుగా కనిపించే వ్యవహార శైలి భాష. ఈ రకం భాష ముద్రణా మాధ్యమంలో కనిపిస్తోంది కాని టెలివిషన్టెలివిజన్ కార్యక్రమాల్లో లంగరమ్మలు, లంగరయ్యలు మాట్లాడే భాషలో వినిపించటం లేదు.
 
హలంతాలైన ఇంగ్లీషు శబ్దాలు కలుపు మొక్కలలా అజంతాలైన తెలుగు క్షేత్రంలో చొరబడటం తెలుగులో తెలుగుతనం లోపించడానికి ఒక కారణం. ఈ ధోరణి తెలుగు నుడికారానికే ఎసరు పెడుతున్నాది. ఉదాహరణకి, పుట్టగొడుగుల వేపుడు చెయ్యటం ఎలాగో, ఒక తెలుగు పత్రికలో, ఈ దిగువ చూపిన విధంగా అభివర్ణించేరు ఒక రచయిత్రి.
పంక్తి 93:
 
==దుర్నామాలని సరిదిద్దటం==
పరిభాషలో వాడే ఇంగ్లీషులో "అతకని" పేర్లు తరచుగా తారసపడుతూ ఉంటాయి. ఏదైనా కొత్త విషయాన్ని పరిశోధించే మొదటి రోజుల్లో అవగాహన అస్పష్టంగా ఉంటుంది. అట్టి సమయాలలో, కేవలం అజ్ఞానం కొద్దీ, మనం అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి అయినప్పుడు మనం తొందరపడి పెట్టిన పేరు అతకక పోవచ్చు. ఉదాహరణకి ఆస్ట్రేలియాలో చెట్ల మీద నివసించే ఒక జంతువు చూడడానికి బుల్లి ఎలుగుబంటిలా ఉందని దానికి “కొవాలా బేర్” అని పేరు పెట్టేరు. దరిమిలా ఆ జంతువు ఎలుగుబంటి జాతికి చెందనే చెందదని తెలిసింది; కాని పెట్టిన పేరు అతుక్కుపోయింది. ఇదే విధంగా పీనట్, కోకోనట్ అన్న మాటలు ఇంగ్లీషులో దుర్నామాలు. వృక్షశాస్త్రం దృష్టిలో “నట్” అనే మాట నిర్వచనంలో కోకోనట్ ఇమడదు. మనం తెలుగులో వాడే [[కొబ్బరికాయ]] శాస్త్రీయంగా సరి అయిన ప్రయోగం; కొబ్బరికాయ “గింజ” కాదు, అదొక పండు. అదే విధంగా “పీనట్, గ్రౌండ్‌నట్” అనే మాటలు కూడా దుర్నామాలే (misnomers). మనం తెలుగులో వాడే [[వేరుసెనగ]] అన్న పేరు నిజానికి దగ్గర. అంటే ఏమిటన్నమాట? ఈ సందర్భంలో ఇంగ్లీషు పేర్ల కంటెకంటే తెలుగు పేర్లు శాస్త్రీయంగా సరి అయినవి.
 
ఈ సందర్భంలో మరొక ఉదాహరణ. ఇంగ్లీషులో “బటర్ ఫ్లై” (butterfly) అన్న మాటకి ఆ పేరు ఎలా వచ్చిందో, దానికి తెలుగులో సీతా (శీతా?) కోక చిలక అన్న పేరు ఎలా వచ్చిందో తెలియదు కాని “బటర్ ఫ్లై”లో బటరూ లేదు, అది శాస్త్రీయంగా “ఫ్లై” కాదు. “సీతాకోక చిలక”లో సీత (శీత) లేదు, కోక లేదు, అది చిలక కాదు! అందువల్ల ఈ అనువాదంతో ఇబ్బందీ లేదు.