అభిషేక్ బచ్చన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రతిష్ట → ప్రతిష్ఠ, → (2), , → , (8), , → , using AWB
అభిషేక్ బచ్చన్ సినిమాలు పేజీకి లింకిచ్చి, దాన్ని అనాథ స్థితి నుండి తీసేసాను.
పంక్తి 1:
'''అభిషేక్ బచ్చన్''' (జననం 5 ఫిబ్రవరి 1976) ప్రముఖ [[బాలీవుడ్]] నటుడు, నిర్మాత, నేపథ్య గాయకుడు. ప్రఖ్యాత నటులు [[అమితాబ్ బచ్చన్]], [[జయ బచ్చన్]] ల కుమారుడు. రెఫ్యూజీ (2000) సినిమాతో హీరోగా తెరంగేట్రం  చేశారు అభిషేక్. ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించలేకపోయినా, తన నటనతో విమర్శకుల ప్రశంసలు మాత్రం  అందుకున్నారు. ఆ తరువాత ఆయన చేసిన సినిమాలు ఏవీ సరైన విజయాలు కాలేదు. కానీ 2004లో ఆయన ప్రధాన పాత్రలో నటించిన  ధూమ్ సినిమాతో మాత్రం హిందీ సినిమా రంగంలో తన దైన ముద్ర  వేశారు అభిషేక్.
 
ఆ తరువాత నటించిన బంటీ ఔర్ బబ్లీ (2005), ధూమ్2 (2006), గురు (2007), దోస్తానా (2008), బోల్ బచ్చన్ (2012), హౌస్ ఫుల్ (2016) వంటి సినిమాలు హిట్ అయ్యాయి. దూమ్3 (2013), హ్యాపీ న్యూ ఇయర్ (2014) వంటి భారీ వసూళ్ళు సాధించిన సినిమాల్లోనూ ఆయన నటించారు. యువ (2004), సర్కార్ (2005), కభీ అల్విదా నా కెహ్నా (2006) వంటి సినిమాల్లోని ఆయన నటనకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయనటుడు పురస్కారం అందుకున్నారు అభిషేక్. ఆయన నిర్మించిన పా (2009) సినిమాకు జాతీయ ఉత్తమ హిందీ చిత్రం పురస్కారం అందుకున్నారు ఆయన. 2007లో నటి [[ఐశ్వర్యా రాయ్]]ను  వివాహం చేసుకున్నారు అభిషేక్. 16 నవంబరు 2011న వారికి  కుమార్తె ఆరధ్య జన్మించారు.
పంక్తి 5:
== తొలినాళ్ళ జీవితం ==
[[దస్త్రం:Bachchan_Parivar.jpg|thumb|ఫిబ్రవరి 2014లో తండ్రి [[అమితాబ్ బచ్చన్]], తల్లి జయ బచ్చన్ లతో అభిషేక్]]
5 ఫిబ్రవరి 1976న ప్రముఖ బాలీవుడ్ నటులు [[అమితాబ్ బచ్చన్]], [[జయ బచ్చన్]] లకు జన్మించారు అభిషేక్. బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి [[ఐశ్వర్య రాయ్]] <nowiki/>ను వివాహం  చేసుకున్నారు ఆయన. అభిషేక్ తాత  హరివంశ్ రాయ్ బచ్చన్ ప్రముఖ హిందీ నటుడు, అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్. వీరి అసలు ఇంటిపేరు శ్రీవాస్తవ.  కానీ  హరివంశ్ కలంపేరు అయిన బచ్చన్ వారి ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. అభిషేక్ తండ్రి కయస్థాకాయస్థ వంశానికి చెందినవారు.<ref><cite class="citation news">[http://articles.timesofindia.indiatimes.com/2001-10-20/india/27258405_1_kayastha-allahabad-samajwadi-party "SP looks up to Big B with an eye on Kayastha votes"]. </cite></ref> తల్లి బెంగాలీ వనిత కాగా, <ref><cite class="citation web">[http://www.bharatwaves.com/portal/modules/piCal/index.php?action=View&event_id=0000008569 "Jaya Bhaduri Bachchan"]. </cite></ref>  ఆయన నానమ్మ పంజాబీ.<ref name="Teji"><cite class="citation web">India, Frontier (13 January 2011). </cite></ref>
 
టైం పత్రిక అమితాబ్ ను, ఐశ్వర్యను అత్యంత ప్రభావవంతులైన భారతీయుల జాబితాలో చేర్చింది.<ref><cite class="citation news">[http://economictimes.indiatimes.com/slideshows/people/take-a-peek-at-the-business-political-landscape-of-marriages/nikhil-nanda-shweta-bachchan/slideshow/19118743.cms "Nikhil Nanda & Shweta Bachchan – Take a peek at the business & political landscape of marriages"]. </cite></ref><ref><cite class="citation news">[http://www.time.com/time/specials/2007/article/0,28804,1652689_1652372_1652359,00.html "India"]. </cite></ref> తారే జమీన్ పర్ సినిమాలో చిన్నపిల్లవాడు బాధపడే [[డిస్లెక్సియా]] <nowiki/>వ్యాధితో బాధిపడేవారట అభిషేక్.<ref><cite class="citation news">[http://www.indiafm.com/news/2007/12/18/10619/index.html "Abhishek Bachchan in Taare Zameen Par"]. </cite></ref> ముంబైలోని జమ్నబాయ్ నర్సీ స్కూల్, బాంబే స్కాటిష్ స్కూల్ లోనూ, న్యూఢిల్లీలోని మోడ్రన్ స్కూల్, వసంత్ విహార్ లోనూ ప్రాథమిక మాధ్యమిక విద్యలభ్యసించారు ఆయన. స్విట్జర్ ల్యాండ్ లోని ఐగ్లోన్ కళాశాలలోనూ, బోస్టన్ విశ్వవిద్యాలయంలోనూ చదువుకున్నారు అభిషేక్.
 
== కెరీర్ ==
{{ప్రధాన వ్యాసం|అభిషేక్ బచ్చన్ సినిమాలు}}
 
=== మొదటి సినిమా, మొదటి సక్సెస్ కై పోరాటం(2000–2003) ===
2000లో జె.పి.దత్తా దర్శకత్వంలో రెఫ్యూజీ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు అభిషేక్. ఈ సినిమాతోనే [[కరీనా కపూర్]] కూడా  బాలీవుడ్ తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించలేకపొయినాసాధించలేక పోయినా అభిషేక్, కరీనాల నటనకు మాత్రం ప్రేక్షకుల నుండీ, విమర్శకుల నుండీ ప్రశంసలు లభించాయి. ఈ సినిమాలోని ఆయన నటను మెచ్చుకుంటూ చాలా మంది విమర్శకులు అభిషేక్ ఆయన వంశ ప్రతిష్ఠ నిలబెడతారని అన్నారు.<ref><cite class="citation web">Adarsh, Taran (15 December 2000). </cite></ref>
 
రెఫ్యూజీ సినిమా తరువాత కొన్ని సినిమాల్లో నటించినా అవి పెద్దగా విజయం సాధించలేదు. కానీ 2003లో సూరజ్ ఆర్. బర్జట్యా తీసిన మై ప్రేంకీ దీవానీ హూ సినిమాలోని నటనకు మాత్రం ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు నామినేషన్ అందుకున్నారు అభిషేక్. ఆ తరువాత సంవత్సరం మణిరత్నం దర్శకత్వంలో ఆయన నటించిన యువ సినిమాతో ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారాన్ని అందుకున్నారు ఆయన.
Line 21 ⟶ 22:
2005లో నటి రాణీ ముఖర్జీతో కలసి ఆయన నటించిన బంటీ ఔర్ బబ్లీ సినిమా అతి పెద్ద హిట్ గా నిలిచింది. ఆ సంవత్సరంలోనే రెండో ఎక్కువ వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతో ఫిలింఫేరు ఉత్తమ నటుడు పురస్కారం కూడా అందుకున్నారు అభిషేక్. ఈ సినిమాలో తన తండ్రి [[అమితాబ్ బచ్చన్]] తో కలసి నటించారు అభిషేక్.
 
== Referencesమూలాలు ==
<div class="reflist columns references-column-width" style="-moz-column-width: 30em; -webkit-column-width: 30em; column-width: 30em; list-style-type: decimal;">
<references /></div>
"https://te.wikipedia.org/wiki/అభిషేక్_బచ్చన్" నుండి వెలికితీశారు