పండిట్ జస్రాజ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కాళిదాస్ సమ్మాన్ గ్రహీతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ను → ను (2), → (2), , → ,, , → , using AWB
పంక్తి 20:
జస్రాజ్ [[హర్యానా]]లోని [[హిస్సార్]] ప్రాంతంలో మేవాతి ఘరానాకు చెందిన కుటుంబంలో జన్మించాడు. తండ్రి ''పండిట్ మోతీరామ్‌జీ'' శాస్త్రీయ సంగీత కళాకారుడు. జస్రాజ్ తన నాలుగేళ్ళ వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నాడు.
== సంగీత ప్రస్థానం ==
జస్రాజ్ తొలి సంగీత గురువులు తండ్రి ''పండిట్ మోతీరామ్'' మరియు అన్న ''పండిట్ మణిరామ్‌జీ'' లు. తరువాత జస్రాజ్ ''మహరాజా జయవంత్ సింగ్‌జీ వఘేలా'' వద్ద శిష్యరికం చేశాడు. జస్రాజ్ తన చిన్నప్పుడు ప్రఖ్యాత గజల్ గాయని , [[బేగం అక్తర్]] శ్రావ్యమైన గొంతు విని ఎంతో ప్రభావితుడై, బడికి ఎగనామం పెట్టి ఒక చిన్న హోటల్‌లో వినిపించే ఆమె పాటలను రోజంతా వినేవాడు.
1960 లో, జస్రాజ్ ఒకసారి హాస్పిటల్‌లో ఉన్న [[బడే గులాం అలీఖాన్]] ను కలిసినప్పుడు, ఆయన జస్రాజ్‌ను తన శిష్యుడిగా ఉండమన్నాడు. కాని తను ఇదివరకే పండిట్ మోతీరామ్ శిష్యుడినని, జస్రాజ్‌ ఆయనను తిరస్కరించాడు.
అన్న మణిరామ్‌జీ జస్రాజ్‌ను, [[తబలా]] సహకారం కోసం తన వెంట తీసికెళ్ళేవాడు. ఆ కాలంలో [[సారంగి]] వాద్యకారుల మాదిరే, తబలా వాద్యకారులను జనం చిన్నచూపు చూసేవారు. దాంతో జస్రాజ్ అసంతృప్తిపొంది, తబలాకు స్వస్తి చెప్పి, గాత్రం నేర్చుకొన్నాడు.
జస్రాజ్ ఒక ప్రత్యేక వినూత్న పద్ధతిని [[జుగల్‌బంది]] లో ప్రవేశపెట్టాడు. అందులో పురాతన [[మూర్ఛనలు|మూర్ఛనల]] పై అధారపడిన ఒక శైలిలో, గాయని, గాయకుడు తమ వేర్వేరు రాగాలను ఒకేసారి ఆలపిస్తారు.
== పేరెన్నికగన్న శిష్యులు ==
[[సంజీవ్ అభయంకర్]], [[సుమన్ ఘోష్]], [[తృప్తి ముఖర్జీ]], [[కళా రామ్‌నాథ్]] లు. బాలివుడ్ గాయని [[సాధనా సర్గమ్]] జస్రాజ్ శిష్యురాలే.
తన తండ్రి జ్ఞాపకార్థం, జస్రాజ్ ప్రతి సంవత్సరం, [[పండిట్ మోతీరామ్, పండిట్ మణిరామ్‌ సంగీత్ సమారోహ్]] ను హైదరాబాద్‌లో గత 30 ఏళ్ళుగా నిర్వహిస్తున్నాడు.
== అవార్డులు ==
* [[పద్మ విభూషణ్]] 2000 లో
పంక్తి 49:
* ఆర్నమెంటల్ వాయిస్
== బయటి లింకులు ==
* [http://video.webindia123.com/interviews/singers/jasraj/index.htm] పండిట్ జస్రాజ్ వీడియో ఇంటర్‌వ్యూ
* [http://www.pjim.org/] పండిట్ జస్రాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యూజిక్, న్యూయార్క్
* [http://www.youtube.com/watch?v=psZKJUVVSJo] పూర్వి రాగ - వీడియో
* [http://nazaronline.net/arts/2008/11/pandit-jasraj-%E2%80%93-an-interview-that-ended-too-soon/] జస్రాజ్‌తో ముఖాముఖి
* [http://nazaronline.net/arts/2008/11/mero-man-mohiyo/] మేరో మన్ మోహియా
== వనరులు ==
* 1. [http://www.expressindia.com/latest-news/pandit-jasraj-casts-magic-spell/398561/] ఎక్స్‌ప్రెస్స్ ఇండియా - వార్తలు
* 2. [http://www.kamat.com/indica/music/jasraj.htm] జస్రాజ్‌పై మోహన్ నడ్‌కర్ణి వ్యాసం
* 3.[http://www.hindu.com/mp/2004/12/01/stories/2004120100800300.htm] హిందూ దినపత్రికలో హైదరాబాద్‌లో సంగీత్ సమారోహ్ గురించి వార్త -
 
"https://te.wikipedia.org/wiki/పండిట్_జస్రాజ్" నుండి వెలికితీశారు