పదార్థము: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పదార్ధ → పదార్థ (19) using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కూడ → కూడా (4), ) → ) using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}
'''పదార్థం''' ([[:hi:पदार्थ|पदार्थ]]) అనేది వివిధ [[భౌతికరాశుల]]తొ కూడిఉంటుంది. పదార్థం సాధారణంగా [[పరమాణువు|పరమాణువులు]] ([[:hi:उप-परमाणविक कण|उपपरमाण्विक कणों]]), [[అణువు|అణువులు]] ([[:hi:परमाणु|परमाणु]]), [[బణువు|బణువుల]] ([[:hi:अणु|अणु]]) తో నిర్మించబడి ఉంటుంది. పదార్థం కొంత [[ద్రవ్యరాశి]] ([[:hi:द्रव्यमान|द्रव्यमान]]) ని కలిగి వుండడంతో పాటు కొంత [[స్థలం|స్థలాన్ని]] ([[:hi:दिक्|दिक्]]) కూడా ఆక్రమిస్తుంది. ద్రవ్యరాశి (द्रव्यमान, M), [[పొడవు]] (लंबाई, L), [[కాలము]] (समय, T) వంటి కొలతలతో పదార్థమును నిర్వచించ వచ్చు. [[ఐన్‌స్టయిన్]] [[సాపేక్ష సిద్దాంతం]] ప్రకారం పదార్థం మరియు శక్తి పరస్పరం ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారకలవు.
 
పదార్థాలు ముఖ్యంగా [[ఘనం]], [[ద్రవం]], [[వాయువు]] అనే మూడు స్థితుల్లో ఉంటాయి. వీటిలో వాయుస్థితి అతిసరళమైనది. వాయువుకు నిర్దిష్టమైన ఆకృతి ఉండవు. వాయువుకు సంకోచ, వ్యాకోచ లక్షణాలు ఉండటం వల్ల దాన్ని ఉంచిన పాత్రను పూర్తిగా ఆక్రమిస్తుంది. వాయుస్థితిలో ఉన్న పదార్థాల అణువులు అమిత వేగాలతో భూమ్యాకర్షణ శక్తికి అతీతంగా తేలికగా కలిసిపోతాయి. దీన్నే 'వాయు వ్యాపనం' అని అంటారు.
 
'''పదార్థం''' లేదా ద్రవ్యం (matter) అంటే ఏమిటి? ఆధునిక భౌతిక శాస్త్రం ప్రకారం పదార్థానికీ, [[శక్తి]]కీ మధ్య నిజంగా తేడా ఏమీ లేదనీ, పదార్థాన్ని కేవలం శక్తి యొక్క రూపాంతరంగా భావించవచ్చనిన్నీ తెలుస్తోంది. అయినప్పటికీ పదార్థం అనే దానికి ఒక స్వతంత్రమయిన అస్తిత్వం ఉంది. మన నిత్య అనుభవంలో మనకి అనేక వస్తువులు తారస పడతాయి. చెట్లు, పువ్వులు, కాయలు, నీరు, కారు, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, ఇలా ఎన్నో. కంటికి కనబడని గాలి కూడకూడా పదార్థమే, కాని అది మన స్పర్శకి 'కనబడుతుంది'. ఆమ్లజని, ఉదజని, నత్రజని కూడకూడా పదార్దాలే. సూక్ష్మ ప్రపంచంలో ఉండే [[బణువులు]] (molecules), అణువులు (atoms), పరమాణువులు (sub-atomic particles) కూడకూడా పదార్థాలే. ఇలా పదార్థం అంటే ఏమిటో సోదాహరణంగా వివరించటం ఒక ఎత్తు, పదార్థం అనే మాటకి ఒక నిర్వచనం తయారు చెయ్యటం మరొక ఎత్తు.
 
ప్రతి వస్తువు లోనూ పదార్థం ఉంటుంది కనుక ప్రతి వస్తువులోనూ ఎంత పదార్థం ఉందో తెలియజెయ్యటానికి 'పదార్థ రాశి' లేదా 'ద్రవ్యరాశి' (mass) అనే మాటని వాడుతారు. ఈ ద్రవ్యరాశిని గ్రాములు (grams), కిలోగ్రాములు (kilograms), స్లగ్గులు (slugs), వీశలు, మణుగులు, ... ఇలా రకరకాల కొలమానాలు ఉపయోగించి కొలుస్తారు. ఏ కొలమానం ఉపయోగించి కొలిచినా ద్రవ్యరాశి అనేది ఒక వస్తువులో ఎంత పదార్థం (matter) ఉందో చెబుతుంది. కాని ఈ దృక్పధం భౌతిక శాస్త్రంలో అందరికీ నచ్చదు. మనం ఇక్కడ ద్రవ్యరాశి అని దేనిని అంటున్నామో దానినే కొందరు 'జడత్వం' (inertia) అంటారు. పేరు మారింది, దృక్పధం మారింది. ఇంతకీ జడత్వం అంటే ఏమిటి? "కదలిక లేకుండా, విశ్రాంతిగా ఉన్న వస్తువు (an object at rest) ని కదలించాలంటే ఆ వస్తువు యొక్క జడత్వానికి అనులోమ సంబంధంలో (in direct proportion) [[బలం]] ఉపయోగించాలి" అన్నది జడత్వానికి డొంకతిరుగుడు నిర్వచనం. కదలిక లేకుండా ఒక చోట 'పడి ఉన్న' వస్తువులకే జడత్వం ఉంటుందనుకోవడం పొరపాటే అవుతుంది. నెమ్మదిగా పాకురుతూన్న పసి పాపని పట్టుకోవడం తేలికే కాని జోరుగా పరిగెడుతూన్న ఆంబోతుని ఆపటం కష్టం. కదలిక లేని వస్తువులకి జడత్వం ఉన్నట్లే సమ వేగం (uniform velocity) తో ప్రయాణం చేస్తూన్న వస్తువులకి కూడకూడా జడత్వం ఉంటుంది. అంటే వస్తువుకి గల 'జడత్వం' అనే లక్షణం దాని సహజమైన చలన స్థితి (natural state of motion) మార్చే ప్రయత్నంలో వ్యక్త మవుతుంది.
 
చలన స్థితి అంటే ఏమిటి? వస్తువు కదలిక లేకుండా విశ్రాంతి స్థితిలో ఉండుట, సమ వేగంతో (uniform velocity) కదలుట అనేవి ఆ వస్తువు యొక్క చలన స్థితి అంటారు. ఒక వస్తువును తన సహజమైన చలన స్థితి నుండి మార్చటానికి ప్రయత్నించే బాహ్య ప్రభావాన్ని (external influence) బలం (force) అంటారు.
"https://te.wikipedia.org/wiki/పదార్థము" నుండి వెలికితీశారు