43,014
దిద్దుబాట్లు
Infinite0694 (చర్చ | రచనలు) చి (14.99.170.129 (చర్చ) చేసిన మార్పులను వైజాసత్య యొక్క చివరి కూర్పు...) |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
{{విస్తరణ}}
[[దస్త్రం:Chakravyuha-labyrinth.svg|right|thumb|చక్రవ్యూహ వ్యూహ వలయ రచన
'''పద్మవ్యూహం''' లేదా చక్రవ్యూహం మహాభారత యుద్ధంలో ఉపయోగించిన యుద్ధ వ్యూహాలలో ఒకటి. ఈ వ్యూహ నిర్మాణం ఏడు వలయాలలో కూడి ఉండి శత్రువులు ప్రవేశించడానికి దుర్భేధ్యంగా ఉంటుంది. చక్రవ్యూహాన్ని [[మహాభారతం|మహాభారత]] కురుక్షేత్రయుద్ధంలో పాండవులను సంహరించడానికి పన్నగా అందులో [[అభిమన్యుడు]] చిక్కుకొని విరోచితంగా పోరాడి మరణిస్తాడు.
మహాభారత యుద్ధంలో [[భీష్ముడు]] ఓడిపోయిన తర్వాత కౌరవసేనకు ద్రోణాచార్యున్ని సేనాధిపతి చేశాడు దుర్యోధనుడు. యుద్ధం యొక్క పదమూడవ రోజున [[ద్రోణాచార్యుడు]] పాండవులను ఓడించేందుకు తన అనుభవజ్ఞానాన్ని అంతా రంగరించి పద్మవ్యూహం పన్నాడు. పాండవ సైనికులు ఆ వ్యూహాన్ని ఛేదించలేకపోయింది. పద్మవ్యూహాన్ని ఛేదించే పరిజ్ఞానము పాండవ పక్షములో [[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణుని]]కి, [[అర్జునుడు|అర్జునుని]]కి, [[ప్రద్యుమ్నుడు|ప్రద్యుమ్నుని]]కి (శ్రీకృష్ణుని కొడుకు), మరియు అభిమన్యునికి తప్ప మరెవరికీ లేదు. ప్రద్యుమ్నుడు మహాభారత యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించాడు. పద్మవ్యూహాన్ని గమనించిన ధర్మరాజు సమయానికి అర్జునుడు అందుబాటులో లేకపోవటం
[[Image:Halebid2.JPG|right|thumb| అభిమన్యుడు పద్మవ్యూహంలో అడుగుపెడుతున్న దృశ్యం చెక్కిన శిల్పం - హలిబేడు, కర్ణాటక]]
అభిమన్యుడు పద్మవ్యూహం గురించి తల్లి గర్భంలో ఉండగానే అవగాహన చేసుకున్నాడని భారతంలో వర్ణించారు. అర్జునుడు ఒకసారి [[సుభద్ర]]కు యుద్ధవిద్యలో పద్మవ్యూహం కష్టతరమైనది అంటూ పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో, చాకచక్యంగా ఎలా పోరాడాలో వివరించి చెప్పాడు. అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు ఆ విద్యను అర్ధం చేసుకున్నాడు. అయితే, పద్మవ్యూహం నుండి ఎలా బయటపడాలో అర్జునుడు సుభద్రకి చెప్పలేదు. అలా చెప్పబోయేంతలో సుభద్ర నిద్రలోకి జారుకోవటం చూసి అర్జునుడు చెప్పటం ఆపివేశాడు. అభిమన్యుడు యుద్ధంలో చాకచక్యంగా పద్మవ్యూహం ఛేదించుకుంటూ లోనికి వెళ్ళి వీరోచితంగా పోరాడాడు కానీ ఆ వ్యూహం నుండి బయటపడలేక ప్రాణాలు కోల్పోయాడు.
[[వర్గం:మహాభారతం]]
|
దిద్దుబాట్లు