పియూష గ్రంధి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 69 interwiki links, now provided by Wikidata on d:q156871 (translate me)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విచ్చిన్న → విచ్ఛిన్న, ) → ) (7) using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Illu endocrine system.png|right|thumb|227px|ముఖ్యమైన వినాళ గ్రంధులు. (ఎడమవైపు [[పురుషుడు]], కుడివైపు [[స్త్రీ]].) '''1.''' [[Pineal gland]] '''2.''' [[పియూష గ్రంధి]] '''3.''' [[థైరాయిడ్ గ్రంధి]] '''4.''' [[Thymus]] '''5.''' [[అధివృక్క గ్రంధి]] '''6.''' [[క్లోమము]] '''7.''' [[అండాశయము]] '''8.''' [[వృషణాలు]]]]
'''పియూష గ్రంధి''' (Pituitary gland or Hypophysis) శరీరంలోని [[వినాళ గ్రంధులు|వినాళగ్రంధు]] లన్నింటి మీద అధిపతి. ఇది [[కపాలం]]లోని సెల్లా టర్సికా అనే చిన్న గాడిలో అండాకారంలో కనిపించే చిన్న గ్రంధి. ఇది రెండు తమ్మెల ఎడినోహైపోఫైసిస్, న్యూరోహైపోఫైసిస్ ల కలయిక వల్ల ఏర్పడుతుంది.
 
పంక్తి 7:
=== అడినోహైపోఫైసిస్ ===
ఇది పూర్తిగా హైపోథలామస్ నియంత్రణలో పనిచేస్తుంది. హైపోథలామస్ నుండి విడుదలయ్యే హార్మోన్లు రెండు రకాలుగా ఉంటాయి. అవి నిరోధక మరియు విడుదల హార్మోన్లు. హైపోథలామస్ నుండి పియూష గ్రంధి వరకు విస్తరించి రెండు వైపులా రక్తకేశనాళికలున్న సిర ఒకటి ఉంటుంది. దీనినే "హైపోఫిసియల్ నిర్వాహక వ్యవస్థ"గా పిలుస్తారు. దీని ద్వారా విడుదల మరియు నిరోధక హార్మోన్లు అడినోహైపోఫఇసిస్ ను చేరతాయి.
* '''అవటు గ్రంధి ప్రేరేపక హార్మోను''' (Thyroxine Stimulating Hormone) : ఇది [[అవటు గ్రంధి]]ని ప్రేరేపించి [[థైరాక్సిన్]] విడుదల జరిగేలా చేస్తుంది.
* '''అధివృక్కవల్కల ప్రేరేపక హార్మోను''' (Adreno Cortico Trophic Hormone) : ఇది [[అధివృక్క గ్రంధి]] వల్కలాన్ని ప్రేరేపించి [[కార్టికోస్టిరాయిడ్లు]] విడుదలకు తోడ్పడుతుంది.
* '''గొనాడోట్రోపిక్ హార్మోన్లు''' (Gonadotrophic Hormones) : ఇవి రెండు రకాలు. అండపుటిక ప్రేరేపక హార్మోను (Follicular Stimulating Hormone) ఇది అండపుటికల అభివృద్ధిని ప్రారంభిస్తుంది. పురుషులలో ఇది శుక్రకణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ల్యూటినైజింగ్ హార్మోను (Leutinizing Hormone) స్త్రీ బీజకోశం నుండి అండం విడుదల అయేలా చేస్తుంది. పురుషులలో లీడిగ్ కణాలను ప్రేరేపించడం ద్వారా టెస్టోస్టిరాన్ ఉత్పత్తి జరిగేలా చేస్తుంది.
* '''ప్రొలాక్టిన్''' (Prolactin) : ఇది క్షీర గ్రంధుల నుండి [[పాలు]] ఉత్పత్తి జరిగేలా చేస్తుంది.
* '''పెరుగుదల హార్మోను''' (Growth Hormone) : దీని ప్రభావం వల్ల [[కణజాలాలు]] పెరుగుదల కారకాలను స్రవిస్తాయి. ఇవి [[పెరుగుదల]]ను కలుగజేస్తాయి. ప్రోటీన్ల తయారీని వేగవంతం చేసి, వాటి విచ్చిన్నాన్నివిచ్ఛిన్నాన్ని తగ్గిస్తాయి.
 
=== న్యూరోహైపోఫైసిస్ ===
మెదడులోని హైపోథలామస్ లోని నాడీ స్రావక కణాలు కాలాంచిక ద్వారా ప్రయాణించి న్యూరోహైపోఫైసిస్ లో అంతమౌతాయి. ఈ నాడీ స్రావక కణాలు ఉత్పత్తి చేసే యాంటీ డయూరిటిక్ హార్మోను మరియు ఆక్సిటోసిన్ వాటి యాక్సాన్ల ద్వారా ప్రయాణించి న్యూరోహైపోఫైసిస్ ను చేరతాయి.
* '''ఏంటీ డయూరిటిక్ హార్మోను''' (Anti Diarrhoetic Hormone) : ఇది ధమనికలను సంకోచింపజేస్తుంది. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. మూత్రపిండాలలో నీటి పునఃశోషణకు ఇది అవసరం. రక్తంలో చిక్కదనం ఎక్కువైనప్పుడు హైపోథలామస్ లోని జ్ఞాననాడీ కణాలు పరిస్థితిని గ్రహించి ఇది ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. ఫలితంగా మూత్రపిండాల నుండి నీటి పునఃశోషణ ఎక్కువ అవుతుంది.
* '''ఆక్సిటోసిన్''' (Oxytocin) : ఇది [[ప్రసవం]] సమయంలో గర్భాశయ గోడాల కండరాలను సంకోచింపజేస్తుంది. కాన్పు తర్వాత స్త్రీలలో క్షీర గ్రంధుల నుండి పాల విడుదలకు తోడ్పడుతుంది.
 
== పియూష గ్రంధి ధర్మాలు ==
"https://te.wikipedia.org/wiki/పియూష_గ్రంధి" నుండి వెలికితీశారు