ఏటుకూరి బలరామమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
 
[[కడలూరు]] జైలులో డిటెన్యూగా వున్న రోజులలో చరిత్ర, తత్వశాస్త్ర గ్రంథాలను నిర్విరామంగా  అధ్యయనం చేశారు. జైలులో తోటి సహచారుల కోసం చరిత్ర, తత్వశాస్త్రాలపై శిక్షణా తరగతులు నడిపారు. ఎ.ఎల్‌. మార్టిన్‌ రచించిన 'పీపుల్స్ హిస్టరీ ఆఫ్ గ్రేట్‌
బ్రిటన్‌' చదవడం తటస్థించి అటువంటి ప్రజాచరిత్రను  తెలుగుజాతి చరిత్రకు అందించాలనే సంకల్పంతో  1953 జూన్‌లో తన మొట్టమొదటి గ్రంథంగా “ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర”ను రచించారు. మార్క్సిస్టు దృక్పథంతో శాస్త్రీయ ప్రాతిపదికపై రచింపబడ్డ ఈ గ్రంథం ఇప్పటికే 11 సార్లుకు పైగా పునర్ముద్రణలతో ఆంధ్రుల చరిత్ర అంటే ఆసక్తి వున్న అందరి అభిమానాన్ని చూరగొంది. ఆంధ్రుల సంక్షిప్త చరిత్రలో బౌద్ధ స్థూపాలను హిందువులు ఎలా ఆక్రమించుకొన్నదీ క్రీ.శ. 7వ శతాబ్దంలో [[అమరావతి]]ని దర్శించిన సుప్రసిద్ద చైనా యాత్రికుడు “హుయాన్ త్సాంగ్” (యువాన్ చాంగ్- Xuanzang) మాటల్లో బలరామ మూర్తి వివరించిన అంశాలు చరిత్ర వక్రీకరణకు పాల్పడేవారికి కనువిప్పు కలిగించి చరిత్ర పట్ల సరైన వాస్తవ అవగాహన కలిగిస్తుంది. “ [[అమరావతి స్తూపం]] బౌద్ధ బిక్షువులు ఆధీనంలో వుంది. బ్రాహ్మణులు ఈ స్తూపంపై పెత్తనం కావాలని తగాదా పెట్టారు. చివరకు బౌద్ధ బిక్షువులు తలుపులు తీసి బైటకు వచ్చి రాజు గారి మధ్యవర్తిత్వం నడుపుదామని ఆయన వద్దకు వెళ్ళారు. ఈ లోగా బ్రాహ్మణులు స్తూపాన్ని ఆక్రమించుకొన్నారు. రాజు బ్రాహ్మణుల తరపున తీర్పు చెప్పాడు. బౌద్ధ బిక్షువులు స్థాన భ్రష్టులై లేచిపోయారు. కొద్ది రోజుల తరువాత [[అమరావతీ స్తూపం]] [[అమరేశ్వరాలయం]]గాఅమరేశ్వరాలయంగా మారిపోయింది.” విశేష ఖ్యాతిని పొందిన ఈ చారిత్రిక గ్రంథానికి తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం లభించింది రష్యాలో స్థిరపడిన సుప్రసిద్ధ ఇంజనీరు కొలాచల సీతారామయ్యచే 1954 లో [[రష్యన్‌ భాష]] లోకి అనువదించబడింది.
 
దీని అనంతరం 1955 లో “భారతీయ తత్వశాస్త్రం” వెలువరించారు. ప్రాచీన కాలం నుండి ఆధునిక దోరిణిల వరకు 20 అధ్యాయాలతో భారతీయ తత్వశాస్త్ర వికాసాన్ని శాస్రీయ దృష్టితో సమగ్రంగా విశ్లేషిస్తూ సులభ శైలిలో ఆసక్తికరంగా వివరించబడిన ఈ గ్రంథం వీరి పుస్తకాలలో అత్యంత పేరిన్నిక గన్నది. ఈ పుస్తకం నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు దేశంలోని అనేకమంది ఆలోచనాపరులను ప్రభావితం చేసింది. రచయితగా ఏటుకూరి బలరామమూర్తి పేరును చిరస్థాయిగా నిలబెట్టిన మేటి రచన ఇది.