ఏటుకూరి బలరామమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
1972 వ సంవత్సరంలో విహంగ దృష్టితో 'మన చరిత్ర' పేరుతొ భారత దేశ సంక్షిప్త చరిత్రను రచించారు. ఆయన చూసిన చారిత్రక ప్రదేశాలపై విశాలాంధ్రలో ధారావాహికంగా ప్రచురింపబడిన అనేకనేక వ్యాసాల కూర్పు ఇది. “విరుద్ద శక్తుల పరస్పర సమ్మేళనం అనే వాస్తవం ఒకటి మానవ చరిత్రలో అనాదిగా కనిపిస్తూంది” అని తెలియచేస్తూ చారిత్రిక సంయమన దృష్టితో ఆర్య, అనార్య దృష్టిని విడనాడి పరిశీలించి రెండు నాగరికతల (ఆర్య, [[హరప్పా]]) ఘర్షణ, ఇక్యతల ద్వారా వినూత్నమైన భారతీయ నాగరికత ఆవిర్భవించిందని ఈ గ్రంథంలో తెలియచేసారు.
 
1989 వ సంవత్సరంలో చారిత్రిక, తులనాత్మక దృష్టితో ఉపనిషత్తుల తాత్విక దృక్పధాన్ని విమర్శనాత్మకంగా పరిశీలిస్తూ “ఉపనిషత్ చింతన” రచించారు. [[శంకరాచార్యుడు]] వ్యాఖ్యానించిన దశోపనిషత్తులను ప్రమాణంగా తీసుకొని శాస్త్రీయంగా పరిశోధించి సమగ్రంగా వెలువరించిన లోతైన తాత్విక రచన ఇది. ఈ రచనకు తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం లభించింది.
 
1992 లో భారతీయ సంస్కృతీ పరిణామక్రమంలో సంభవించిన వివిధ ఘట్టాలను, సంఘర్షణలను, సమన్వయాలను, వ్యత్యాసాలను వివరిస్తూ ”భారతీయ సంస్కృతి“ పుస్తకాన్ని రచించారు. శాస్త్రీయ దృష్టితో భారతీయ సంస్కృతీ పరిణామాన్ని వేదకాలం నుండి ఆధునిక పునర్జీవనోద్యమాల వరకు పరామార్శిస్తూ వెలువడిన ఈ పుస్తకానికి కూడా 1995లో తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం లభించింది.