దాసరి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి (3), గా → గా (3), → (3), ( → ( using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
}}
 
'''డా. దాసరి నారాయణరావు''' [[ఆంధ్రప్రదేశ్]] కు చెందిన రాజకీయనాయకుడు, సినిమా దర్శకుడు,రచయిత మరియు సినీ నిర్మాత.[[1947]], [[మే 4]]న [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[పాలకొల్లు]]లో జన్మించాడు. అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్‌పుటలకెక్కాడు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశాడు. [[తెలుగు]], [[తమిళం]] మరియు [[కన్నడ]] భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు.
 
కళాశాలలో చదివేరోజులలో బీ.ఏ డిగ్రీతో పట్టబధ్రుడు అవటంతో పాటు దాసరి అనేక నాటకపోటీలలో కూడా పాల్గొనేవాడు. అనతి కాలంలోనే ప్రతిభ గల రంగ స్థల నటుడి గా, నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఈయన అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డాడు. ఒకానొక సమయంలో ఈయన పేరిట 18,000 కు పైగా అభిమానసంఘలు ఉండేవి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఈయన ప్రాచుర్యానికి అద్దం పడుతుంది.
పంక్తి 32:
[[మామగారు]], [[సూరిగాడు]] మరియు [[ఒసేయ్ రాములమ్మా]] చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు. ఈ సినిమాలలో నటనకు దాసరి అనేక విమర్శకుల ప్రశంసలు మరియు బహుమతులు అందుకున్నాడు.
==బాల్యం==
దాసరిది పాలకొల్లులో[[పాలకొల్లు]]లో అతిసామాన్యమైన కుటుంబం.ఆస్తిపాస్తులు బాగానే ఉండేవి. దాసరి నాన్నా పెదనాన్నలు కలిసి పొగాకు వ్యాపారం చేసేవారు. ఒకసారి దీపావళి సమయంలో పొగాకు గోడౌన్‌ తగలబడిపోయింది. అప్పట్లో ఇన్సూరెన్సులు ఉండేవి కాదు. దాంతో ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు. ఆ కష్టకాలంలోనే పొలాలు కూడా అమ్మేయాల్సివచ్చింది. వారు మొత్తం ఆరుగురు సంతానం.ముగ్గురు మగపిల్లలు, ఆడపిల్లలు. దాసరి మూడో వాడు.
 
వారి నాన్న తరం వరకూ మా కుటుంబంలో ఎవరూ చదువుకోలేదు. దాసరి వాళ్ళను మాత్రం చదివించారు వాళ్ళ నాన్న. దాసరి ఆరో తరగతికొచ్చేసరికి వారి ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది. స్కూలు ఫీజు మూడుంపావలా కట్టడానికి కూడా డబ్బులేక ఆయన్ను బడి మాన్పించి ఒక వడ్రంగి దుకాణంలో పనిలో పెట్టారు. అక్కడ జీతం నెలకి రూపాయి.
"https://te.wikipedia.org/wiki/దాసరి_నారాయణరావు" నుండి వెలికితీశారు