బోడేపూడి వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), గా → గా , నిషేదా → నిషేధా, పని చేశారు → పనిచేశ using AWB
పంక్తి 25:
}}
 
'''బోడేపూడి వెంకటేశ్వరరావు''' ([[1922]] - [[ఆగష్టు 5]], [[1997]]) కమ్యునిష్టు నాయకుడు, మధిర నియోజకవర్గ శాసన సభ సభ్యుడు. ప్రజా ఉద్యమాలకు అంకితమై నమ్మిన కమ్యూనిస్టు ఉద్యమంలో చివరి దాక పనిచేసిన ధన్యజీవి. <ref>[http://www.navatelangana.com/article/state/72902 ప్రజా నాయకుడు..బోడేపూడి] </ref>
 
== జననం ==
ఈయన సుబ్బమ్మ, సీతయ్య దంపతులకు [[ఖమ్మం]] జిల్లా [[మధిర]] తాలుక లోని [[తొండల గోపవరం]] లో 1922 లో జన్మించారు.
 
చిన్నతనం లోనే తండ్రి చనిపోవడంతో 1931 లో [[వైరా]] మండలం [[గండగలపాడు]] ఉన్న తన మేనమామ జంగా చిన్న నాగయ్య వద్ద పాలేరుగా చేరారు. పనిచేస్తునే పెద్దబాలశిక్ష చదివి ప్రయివేట్‌ ఉపాధ్యాయునిగా వాసిరెడ్డి వీరభద్ర రావు (సహకార సంఘంలో రాష్ట్రస్థాయి అధికారి), జంగా చంద్రశేఖర రావు (యస్‌.పి), వాసిరెడ్డి మల్లిఖార్జున రావు (ఉపాధ్యాయ రంగం), సంక్రాంతి మధుసుధన రావు ([[సి.పి.యం]]. సినియర్‌ నాయకులు), వాసిరెడ్డి విద్యాసాగర రావు, పూర్ణకంటి దేవయ్య, కిన్నెర రాఘువులు వంటి తదితరులకు చదువు చెప్పారు.
పంక్తి 36:
 
== తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ==
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొని అనేక సార్లు జైలుకు వెళ్లారు. ఆ పోరాటంలో కొరియర్‌ గాకొరియర్‌గా పనిచేసి రాత్రికి రాత్రి పార్టీ పత్రికను [[కొత్తగూడెం]] లోని సాయుధ దళ నాయకత్వనికి అందజేసే వారు. అంతేకాకుండా అనాటి వైరా ప్రాంతంలో ఉన్న ఖాజా రాధాకృష్ణమూర్తి, తన బావమరుదులైన దేవబత్తిని సీతయ్య, దేవబత్తిని సర్సయ్య, గుజ్జా బసవయ్య, పింగిళి ముత్తయ్యలను దళసభ్యులుగా, అయినాల వెంకయ్య, పి. ఏసోబు లను అనేక మంది యువకులను కొరియర్‌గా తయారుచేశారు.
 
== ప్రజాసేవ ==
పంక్తి 45:
 
== ప్రజాప్రతినిధిగా ==
[[మధిర]] నియోజకవర్గానికి మూడు సార్లు పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తరువాత వరసగా 1983-93 వరకు విజయం సాధించారు. సి.పి.యం. శాసన సభ పక్షనేతగా పని చేశారుపనిచేశారు.
 
== మరణం ==
పేద కుటుంబంలో పుట్టి పాలేరుగా జీవితం ప్రారంభించి...పెద్ద బాలశిక్ష చదివి రాత్రి పాఠశాలలు నడిపి.. నిషేదాలునిషేధాలు, నిర్బందాలు ఎదుర్కొంటున్న కమ్యూనిస్టు ఉద్యమంలో నిర్భయంగా పనిచేసి.. ప్రజా ఉద్యమాలకు అంకితమై తాను నమ్మిన కమ్యూనిస్టు ఉద్యమంలో కడదాక పనిచేసిన బోడేపూడి వెంకటేశ్వరరావు [[ఆగష్టు 5]], [[1997]] న మరణించాడు.
 
== బోడేపూడి విజ్ఞాన కేంద్రం ==
చదువులో ముందుండి చదువుకోడానికి స్తోమతలేని పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉపయోగకంరగా ప్రజా నాయకుడు బోడేపూడి పేరుమీద ఏర్పాటుచేయబడిందే ఈ బోడేపూడి విజ్ఞానకేంద్రం. బోడేపూడి దీనిని [[జూన్ 27]], [[2007]] లో 55 మంది విద్యార్థులతో ప్రారంభించారు. ఆరోజు నుండి ఎంతోమంది విద్యార్థులు ఇందులో విద్యను అభ్యసించారు. 10 మంది విశ్రాంత ఉపాధ్యాయులు ఈ కేంద్రాన్ని పర్యవేక్షిస్తున్నారు.
 
దీనిలో గ్రంథాలయం కూడా ఉంది. అందులో 25వేలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. పేద విద్యార్థులకు ఉచిత వైద్యంకోసం ప్రేమ్‌ చంద్‌ ప్రజా వైద్యశాల కూడా నడుపబడుతుంది. ప్రతి ఆదివారం మీకోసం అనే కార్యక్రమం ద్వారా అనేక విజ్ఞాన, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల అభిరుచికి తగ్గట్టుగా శాస్త్రీయ, జానపద తదితర విభాగాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ విజ్ఞాన కేంద్రం ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులు రేపటి పౌరులుగా ఎదిగి సమాజంలోని అసమానతలను తొలగించడానికి వారి వంతు కృషి చేయడమే బోడేపూడి విజ్ఞాన కేంద్రం లక్ష్యం.
పంక్తి 57:
==మూలాలు==
{{Reflist}}
 
 
[[వర్గం:1922 జననాలు]]