బ్రహ్మాండ పురాణం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధము → గ్రంథము using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కూడ → కూడా (3), అతిధి → అతిథి , గ్రంధం → గ్రంథం (2), వివిద using AWB
పంక్తి 1:
{{హిందూ మతము}}
'''బ్రహ్మాండ పురాణము''' (''Brahmanda Purana'') ఒక [[హిందూధర్మశాస్త్రాలు|హిందూ ధార్మిక గ్రంథము]]. ఇది ముఖ్యమైన [[అష్టాదశ పురాణములు|పురాణాలలో]] ఒకటి. సంఖ్యాపరంగా దీనిని 18వ పురాణంగా చెబుతారు. ఈ గ్రంధంలోగ్రంథంలో [[ఆధ్యాత్మ రామాయణము]] అంతర్గతమై ఉంది.
 
బ్రహ్మ తెలిపిన విశ్వతత్వము (బ్రహ్మాండము) గురించి ఇందులో ఉన్నందున దీనికి "బ్రహ్మాండపురాణము" అనే పేరు వచ్చింది. ఇందులో విశ్వము లేదా సకల జగత్తు ఒక హిరణ్యమయమైన అండము (బ్రహ్మాండము) నుండి ఉద్భవించినట్లుగా తెలుపబడింది. ఆధ్యాత్మ రామాయణము, రాధాకృష్ణుల విశేషములు, పరశురామావతారము వంటి కథలు ఈ పురాణంలో ఉన్నాయి. ఇందులో మొత్తం 12,000 శ్లోకాలున్నాయి. ఒక బ్రాహ్మణునికి బహుమతిగా ఇవ్వడానికి ఇది ఉచితమైన గ్రంధమనిగ్రంథమని చెబుతారు.
 
== ముఖ్యాంశాలు ==
పంక్తి 10:
=== యుగములు, వాని ప్రమాణములు ===
{{main|మన్వంతరము}}
దేవతల కాల ప్రమాణము మన (మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాల సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును.
 
* [[కృత యుగము]] = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
* [[త్రేతా యుగము]] = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు
* [[ద్వాపర యుగము]] = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు
* [[కలియుగము]] = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు
 
మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు - ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము). ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి. ఈ రాత్రిని ప్రళయము అంటారు. పగలు గడిచిన తరువాత బ్రహ్మ విశ్రమించును. అప్పుడు సృష్టి నశించి ప్రళయం సంభవిస్తుంది.
పంక్తి 26:
ద్వాపరయుగంలో జనులకు లోభగుణమతిశయించును. ధనము పట్ల కోరిక పెరుగును. ధర్మ సంఘము, వర్ణ సంకరము కూడా కలుగుతాయి. ఈ బుద్ధిమార్పులను గ్రహించి వ్యాసుడు వేదములను విభజించును. అనావృష్టి, అకాల మరణములు ప్రబలనారంభించును.
 
కలియుగంలో అసత్యము, హింస, అసహనము అతిశయించును. జనులకు రోగబాధలు, ఈతి బాధలు అధికమగును. దుర్వృత్తులు అవలింబింతురు. వ్యభిచారము పెరుగును. జనులందరు వర్తకముపైనే అత్యధికంగా ఆసక్తి చూపెదరు. పుణ్యకార్యఫలితములు అమ్ముకొనసాగెదరు. అతిధిఅతిథి అభ్యాగత ఆదరణ నశించును. జనులు అల్పాయుష్కులగుదురు. ప్రజలకు ఆయువు తక్కువ అగుట వలన కొద్దిపుణ్యకార్యములకే అధిక ఫలములు లభించునట్లు భగవంతుడు చేయును. త్రేతాయుగంలో తపమువలన జనించిన ఫలము ద్వాపరంలో ఒక్క మాసమునందు, కలియుగంలో ఒక్కరోజునందు లభించును.
 
=== రాక్షసులు సూర్యుని అడ్డగించుట ===
పంక్తి 43:
 
=== శ్రాద్ధక్రియ, విమర్శనదినము ===
చనిపోయినవాఱికి శ్రాద్ధక్రియ ఎందుకు చేయాలని మునులు అడుగగా సూతుడు ఇలా వివరించాడు - మరణించిన జీవుడు ప్రేతరూపంలో ఒక సంవత్సరకాలం ఉండును. అందులో మొదటి పదిరోజులు ఆజీవుని పంచప్రాణాలలో ఒకటి చనిపోయిన స్థలంలోను, మరొకటి స్మశానంలోనుశ్మశానంలోను, మూడవది కర్తయందును, నాలుగవది వాయసములందును, ఐదవది వాయువునందును ఉండును. ఎత్తిపోతలు (సంచయము) అయ్యేదాకా ఆ ప్రాణములు దుర్భరమైన తాపము అనుభవించుచుండును. యథోక్తముగా కర్మలు చేసిన తరువాత ఆ ప్రాణములన్నియు తాపము శమించి, ఒకచోట చేరి యాతనా శరీరము ధరించును. ఆ యాతనాశరీరము (ప్రేతాత్మ) నరకమునకు పోవుటకు ఒక సంవత్సరము కాలము పట్టును. మనకొక మాసము వారికి ఒక దినము. కనుక ప్రతినెల మాసికము పెట్టవలయును. యమలోకమునకు పోవు మార్గములో 18 తావుల ఆగుదురు కనుక 18 మాసికములను పెట్టి, సంవత్సరాంతమున సాహపిండము పెట్టవలెను. ఆ నాటితో మృతులు ప్రేతరూపమును చాలించి పితృదేవతలగుదురు. పితృదేవతలు కూడకూడా దేవతా సమానులే.
 
సంవత్సరాంతమున - సాంవత్సరికము జరిగిన మరుదినము అయిన విమోకము నాడు - యాతనా శరీరములో నున్న జీవుని యమభటులు యమధర్మరాజు వద్ద ప్రవేశపెట్టుదురు. చిత్రగుప్తుని ఖాతాను కాలము, సూర్యచంద్రుల సాక్ష్యముతో సరిచూచెదరు. జీవులు శిక్షలేమైనా ఉంటే అనుభవించి ఆపైన వారు పుణ్యలోకమునకు పోవుదురు. కర్మ జరుగని జీవులు ప్రేతరూపములోనే ఉండవలసివచ్చును. అట్టివారికి గయలో పిండప్రదానము చేసినట్లయితే వారి ప్రేతరూపము పోయి పుణ్యలోకములు ప్రాప్తించును.
పంక్తి 56:
"పరశురాముడు గొప్పతపస్వి. ఈశ్వరునినుండి కృష్ణకవచం ఉపదేశంపొంది నూరు సంవత్సరాలు జపించినా ఆ [[మంత్రము]] సిద్ధింపలేదు. దైవమునకు భక్తి ప్రదానము. [[శివుడు]], [[నారదుడు]], [[శుకుడు]], [[అంబరీషుడు]], [[బలి]], [[విభీషణుడు]], [[ప్రహ్లాదుడు]] ఉత్తమ భక్తులు. [[వశిష్ఠుడు|వశిష్ఠాది]] మహామునులు, అష్ట[[మనువు]]లు, పరశురాముడు మధ్యతరగతికి చెందినవారు. పరశురాముడు అగస్త్యాశ్రమమునకు పోయి అక్కడ శ్రీకృష్ణామృతస్తోత్రమును ఉపదేశము పొందిన యెడల అతనికి మంత్రము సిద్ధించును."
 
ఈ సంభాషణ విని పరశురాముడు అగస్త్యుని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆయనతో కూడకూడా లేళ్ళు కూడకూడా వెళ్ళాయి. అగస్త్యునికి నమస్కరించి పరశురాముడు అతనినుండి శ్రీకృష్ణస్తోత్రకదంబును విని మంత్రసిద్ధిని పొంది, తన ఆశ్రమమునకు వచ్చి తన శపథమును (కార్తవీర్యార్జునుని నిర్జించుట) నెరవేర్చుకొనెను. హరిణముల జంట కూడా ఉపదేశవాక్యములను విని, దివ్యశరీరములు పొంది, వైకుంఠమునకు వెళ్ళెను.
 
=== పరశురాముడు, గోకర్ణ క్షేత్రము ===
పంక్తి 74:
# పుష్కరద్వీపం - సేవనుడు.
 
* '''జంబూద్వీపం''' - [[నేరేడు]] పండ్లు ఎక్కువగా ఉంటాయి. జంబూద్వీపము 9 వర్షాలు లేదా భాగాలుగ విభజించబడినదివిభజించబడింది. అవి (1) ఇలావృత ([[హిమాలయాలు]] మరియు [[టిబెట్]] ప్రాంతము) - (2) భధ్రవర్ష (హిమాలయాల తూర్పు ప్రాంతము) - తూర్పు (3) హరి ([[అరేబియా]]) - దక్షిణము (4) కేతుమాలం ([[ఇరాన్]], [[టర్కీ]] ) పశ్చిమం (5) రమ్యక ([[రష్యా]], [[సైబీరియా]]) ఉత్తరము (6) హిరణ్మయ ([[మంచూరియా]]) ఉత్తరము (7) కురు ([[మంగోలియా]]) ఉత్తరము (8) కింపురుష / కిన్నర (హిమాలయాల దక్షిణ ప్రాంతాలు) దక్షిణము (9) భరత (భారత ఉపఖండము) - ఈ ద్వీపము చుట్టు లవణాంబుధి యున్నది. ఈ ద్వీపంలో 6 పర్వతాలు - హిమాలయము, మేరు పర్వతము, నీలాచలము, హిమాచలము, శ్వేతాచలము, మాల్యవంతము, గంధమాదనము, వింధ్యపర్వతము.
 
* '''ప్లక్షద్వీపం''' - ఇది జంబూద్వీపంకంటె రెండురెట్లు పెద్దది. ఇందు ప్లక్ష (జువ్వి) చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ ద్వీపానికి ఒకవైపు ఉప్పునీటి సముద్రము, మరొకవైపు రససముద్రము ఉన్నాయి; పర్వతాలు - గోమోదకము, నారదాచలము, దుందుభి పర్వతము, సోమకాచలము, సుమనోపర్వతము; నదులు - అనుతప్త, సుఖి, విపాశము త్రివిక్రము, అమృత, సుకృత
 
*''' శాల్మలీద్వీపం''' - ఇది ప్లక్ష ద్వీపంకంటె పెద్దది. ఇందులో ఒక మహోన్నతమైన శాల్మలి (బూరుగు) వృక్షం ఉంది. ద్వీపానికి ఒక ప్రక్క ఇక్షుసముద్రము, మరొక ప్రక్క సురసముద్రము ఉన్నాయి; ఇందులో పర్వతాలు - కుముద, వలాహక, ద్రోణ, మహిష; ఔషధులు - సంజీవకరణి, విశల్యకరణి, సంధానకరణి వంటి దివ్యౌషధాలున్నాయి; నదులు - జ్యోతిస్సు, శాంతి, తుష్కచంద్ర, శుక్ర, విమోచన, నివృత్తి.
 
* '''కుశద్వీపం''' - ఇది శాల్మలీ ద్వీపంకంటె రెట్టింపు పెద్దది. ద్వీపానికి ఒక ప్రక్క ఘృతసముద్రము, మరొక ప్రక్క సురసముద్రము ఉన్నాయి. పర్వతాలు - విద్రుమాద్రి, హేమాద్రి, మృతిమంతము, పుష్పకాద్రి, కులేశయము, హరిగిరి, మందరము; నదులు - ధూత, పాఫ, శివ, పవిత్ర, సంతతి, విద్యుమ్న, దంభ, మాహీ.
* '''క్రౌంచద్వీపం''' - ఈ ద్వీపానికి ఒక ప్రక్క ఘృతసముద్రము, మరొక ప్రక్క దధిసముద్రము ఉన్నాయి.; పర్వతాలు - క్రౌంచాచలము, వామనపర్వతము, అంధకాచలము, దివావృతాద్రి, ద్వివిదగిరిద్వివిధగిరి, పుండలీకాద్రి, దుందుభిస్వనగిరి.; నదులు - గౌరి, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజన, ఖ్యాతి, పుండరీక.; దేశములు - కుశల, వామన, గోష్ఠ, పవరము
 
* '''క్రౌంచద్వీపం''' - ఈ ద్వీపానికి ఒక ప్రక్క ఘృతసముద్రము, మరొక ప్రక్క దధిసముద్రము ఉన్నాయి.; పర్వతాలు - క్రౌంచాచలము, వామనపర్వతము, అంధకాచలము, దివావృతాద్రి, ద్వివిదగిరి, పుండలీకాద్రి, దుందుభిస్వనగిరి.; నదులు - గౌరి, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజన, ఖ్యాతి, పుండరీక.; దేశములు - కుశల, వామన, గోష్ఠ, పవరము
 
* '''శాకద్వీపం''' - ఇది క్రౌంచ ద్వీపంకంటె రెట్టింపు పెద్దది. వలయాకారంలో ఉంది. కేతువు అనే మహావృక్షం ఉంది. ద్వీపానికి ఒక ప్రక్క మంచినీటి సముద్రము, మరొక ప్రక్క పెరుగు సముద్రము ఉన్నాయి; పర్వతాలు - ఉదయాద్ర్రి, జలధార, రైవతకాద్రి, శ్యామలాద్రి, హస్తాద్రి, అంబికేయాద్రి, కేసరాద్రి; విషయములు -జలదము, సుకుమారము, కౌమారము, మణీవకము, మహాద్రుమము; నదులు - సుకుమారి, కుమారి, నళిని, రేణుక, ఇక్షువు, గభస్తి.
 
* '''పుష్కరద్వీపం''' - ఇది శాక ద్వీపంకంటె రెట్టింపు పెద్దది. ద్వీపానికి ఒక ప్రక్క మంచినీటి సముద్రము, మరొక ప్రక్క క్షీర సముద్రము ఉన్నాయి. పర్వతాలు - చిత్రసాను, మానసోత్తర; నదులు లేవు.
 
Line 114 ⟶ 108:
{{మూలాలజాబితా}}
 
* '''అష్టాదశ పురాణములు''' - (18 పురాణముల సారాంశము) - రచన: బ్రహ్మశ్రీ వాడ్రేవు శేషగిరిరావు - ప్రచురణ, సోమనాథ్ పబ్లిషర్స్, రాజమండ్రి (2007)
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మాండ_పురాణం" నుండి వెలికితీశారు