సీమ కథలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 53:
==ఈసీమ కథల్లో ఏముంది?==
 
తాగేటందుకు గుక్కెడునీళ్లకై నెత్తిమీద, భుజాలమీద,సంకళ్లో కుండలు, కడవలు పెట్టుకొని మైళ్ళకుమైళ్ళు ఆడ, మగ, పిల్లలు అనేతేడా లేకుండ మిట్టమధ్యహన్నం, అపరరాత్రి వేళాపాలా లేకుండ నడచివెళ్ళడం వుంది. తాగునీటికై రోజూ కొట్లాటలు, తగాదాలు, బుర్రలు బద్దలు కావటాలు , జైలుకెళ్ళడాలున్నాయి. ఇంట్లో మంచినీళ్లయిపోతే చెంబుపట్టుకెళ్ళి ఇంటీంటికి తిరిగి అడుక్కొవడంవుంది. పొలంలోనాట్లు వేసి, మబ్బులేలేని ఆకాసం వైపుఆశగా వానచినుకుకై చూసే గాజుకళ్ళబక్కరైతుల బతుకులున్నాయి. కరువొస్తే, తమకుటుంబంలో ఒకరిగాచూసుకొనే గొడ్లకు పిడెకెడు మేతలేక, కొనేసత్తువలేక, మనసు రాయి చేసు కొని కసాయివాళ్లకు అమ్మే పల్లెజీవుల బతుకులున్నాయి. బావుల్లో నీళ్ళుచాలక, కరెంటురాక పంపులు పనిచేయ్యక, లోఒల్టెజి కారణంగా మోటార్లుకాలిపోయి, పైర్లు ఎండిపోతుంటే చూడలేక ప్రాణాలు గిజగిజ లాడుతుంటే,పుట్టినప్పటినించి తామునమ్ముకున్న నేలతల్లిఒడిలోనే కనులుమూసిన ఛిద్రమైన రైతు వ్యధలున్నాయి.
 
రెక్కలుముక్కలుచేసుకొని,కుటుంబంలోని వారంత తమ స్వంతపొలాల్లోనే కూలీలుగా మారి పంటపండిస్తె,వడ్దివ్యాపారులు,ఎరువులు,నాసిరకంవిత్తనాలు,నకిలీపురుగుల మందులు అప్పుగాయిచ్చిన ఆంగడి వాళ్ళు, పంటకొనటానికి వచ్చిన దళారులు, కొనుగోలుదారులు రాబందులవలె చుట్టూచేరి,రైతు కష్టఫలాన్నిదోచుకొని రైతును నడిబజారులో బిచ్చగాడిలా నిలబెట్టిన నిజాలున్నాయి.నగరంలో విలాసవంతమైన జీవితానికై హైటెక్కు వ్యభిచారం చేస్తుంటే, ఒకపూటనైన పస్తులున్న పిల్లలకడుపునింపెటందుకు "ఆతప్పు"చేస్తె తప్పెముందనుకునే కూలిపనిచేసె చెంగమ్మ లాంటి ఆడబ్రతుకులున్నాయి.
 
అందినకాడికి అప్పుచేసి, తాళిబొట్టుతో సహ అయినకాడికి అన్నీ అమ్మి,బావి త్రవ్విస్తే,అందులో బండపడి, తమబతుకులు బండలై, ఆబావిలోనే శవాలైన చితికిన రైతుబతుకులున్నాయి. పూలమ్మినచోట కట్టెలమ్మలేక పక్కజిల్లాలకు,కూలీలగా,ప్యాక్టరిలలో కార్మికులుగా వెళ్లిన జనుల వుదాంతాలున్నాయి.
 
రైతులబ్రతులు బాగుపడితే తమ ఆధిపత్యంసాగదని వారిని అలాగేవుంచే రాజకీయవేత్తలు, కుళ్ళు రాజకీయాలు వున్నాయి. ఇవ్వని వెరశి రాయలసీమ ప్రజల బడుగు బ్రతుకులు.
 
==కడమాట==
"https://te.wikipedia.org/wiki/సీమ_కథలు" నుండి వెలికితీశారు