భోజనం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కంటె → కంటే , పని చేస్తు → పనిచేస్తు, → using AWB
పంక్తి 1:
[[Image:Albert Anker - Stillleben - Unmässigkeit.jpg|thumb|250px|పాశ్చాత్యుల భోజనము.]]
[[File:Krönungsmahl 1558.jpg|right|thumb| రాజాస్థానంలో విందు భోజనం.]]
'''భోజనం''' (Meal) ప్రతి మనిషికీ ఒక ప్రాథమిక అవసరం. ఇది మనం నిర్ధిష్టమైన సమయంలో తీసుకునే [[ఆహారం]].భోజనం సామాన్యంగా ఇంటిలో గాని, హోటల్లలో గాని తీసుకుంటారు. సాధారణంగా భోజనం మధ్యాహ్నం మరియు రాత్రి సమయాలలో తీసుకుంటారు<ref>[http://dictionary.cambridge.org/dictionary/british/meal_1?q=meal meal noun (FOOD) - definition in the British English Dictionary & Thesaurus - Cambridge Dictionaries Online<!-- Bot generated title -->]</ref><ref>[http://www.ldoceonline.com/dictionary/meal meal - Definition from Longman English Dictionary Online<!-- Bot generated title -->]</ref>. విందు భోజనాలు మాత్రం [[పుట్టినరోజు]], [[వివాహం]] మరియు శలవు దినాలలో తింటాము. ఇందుకోసం అతిథుల్ని, స్నేహితుల్ని పిలిచి [[పండుగ]] మాదిరి చేసుకుంటాము.భోజనం [[ఫలహారం]] కంటెకంటే భిన్నంగా ఉంటుంది. ఇది పరిమాణంలో ఎక్కువగాను వైవిధ్యంగా కడుపు నింపేదిగా ఉంటుంది. [[వన భోజనాలు]] అందరు కలిసి బాహ్య ప్రదేశాలలో సామూహికంగా అక్కడే తయారుచేసుకునే విందు భోజనం. దీనికోసం [[ఉద్యానవనాలు]], సముద్ర తీరప్రాంతాలు మొదలైన ప్రకృతి సిద్ధమైన ప్రదేశాలు అనుకూలమైనవి.<ref>{{Cite journal | last1 = Wansink | first1 = B. | last2 = Payne | first2 = C. R. | last3 = Shimizu | first3 = M. | doi = 10.1016/j.appet.2009.09.016 | title = "Is this a meal or snack?" Situational cues that drive perceptions | journal = Appetite | volume = 54 | issue = 1 | pages = 214–216 | year = 2010 | pmid = 19808071| pmc = }}</ref>
==ఆహారము - పోషకాలు==
మనం తినే ఆహారం ఎంత వర్ణరంజితంగా.. రంగురంగులుగా.. ఎంత వైవిధ్య భరితంగా ఉంటే అంత ప్రయోజనకరమని పోషకాహార నిపుణులంతా చెబుతున్నారు. రకరకాల రంగు రంగుల కూరగాయలు, పండ్లతో కూడిన భోజనం కంటికీ, ఒంటికీ కూడా విందు చేస్తుంది. ఈ రంగురంగుల వృక్ష సంబంధ ఆహారంలో- కీలక పోషకాలైన కెరొటినాయిడ్లు, బయోఫ్లావనాయిడ్ల వంటివి ఉంటాయి. ఇవి మన శరీరంలో విశృంఖల కణాల (ఫ్రీర్యాడికల్స్) దాడికి అడ్డుకట్ట వేస్తాయి. ముఖ్యంగా కెరొటినాయిడ్లలో భాగమైన లైకోపేన్, లూటిన్, బీటా కెరొటీన్ వంటివి- వయసుతో పాటు శరీరంలో, కణజాలంలో వచ్చేక్షీణతను నిలువరించే ప్రయత్నం చేస్తాయి. [[టమోటా]], [[పుచ్చకాయ]], [[ద్రాక్ష]], [[అంజీరా]] వంటి ఎర్రటి పండ్లలో ఉండే లైకోపేన్.. కణాల్లో ఒత్తిడిని తగ్గించే 'యాంటీ ఆక్సిడెంట్'గా పనిచేస్తుంది, రోగనిరోధక శక్తి పెరిగేందుకూ దోహదపడుతుంది. [[మామిడి]], [[బొప్పాయి]], [[క్యారెట్లు]], [[చిలగడ దుంప]] వంటి పసుపు, నారింజ రంగుల్లో ఉండే పండ్లు, కూరగాయల్లో బీటాకెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. విటమిన్-ఏ లోపం రాకుండానే కాదు, క్యాన్సర్ నివారణకు కూడా ఉపయోగపడుతుంది. ఇక మసాలా దినుసులు, పసుపు, గ్రీన్‌టీ, బత్తాయి, నారింజ వంటి పండ్లు, దుంపలు, కూరగాయల్లో అధికంగా ఉండే బయోఫ్లావనాయిడ్లు గుండె జబ్బులు, పక్షవాతం వంటివి రాకుండా, రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. ఇలా సహజంగా లభ్యమయ్యే అన్ని రంగుల పదార్ధాలకూ ఏదోఆరోగ్య ప్రయోజనం ఉంది. కాబట్టి ఎన్ని రంగుల పదార్ధాలు తింటే.. అంత మంచిది.
పంక్తి 7:
 
==మధ్యాహ్న భోజనము - ప్రాముఖ్యత==
కార్పొరేట్, సాఫ్ట్‌వేర్ రంగాలు విస్తరించటం మొదలైన తర్వాత పని ఒత్తిడిలో పడిపోయి మధ్యాహ్న భోజనం మానేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇది మంచి పద్ధతి కాదంటున్నారు పోషకాహార నిపుణులు. ఖాళీ కడుపుతో ఎక్కువసేపు పని చేస్తుంటేపనిచేస్తుంటే శరీరంలోని శక్తి క్షీణిస్తూ పని సామర్థ్యం తగ్గిపోతుంది. పైగా మధ్యాహ్న భోజనం మానేస్తే గ్యాస్, అసిడిటీ వంటి జీర్ణ సమస్యలూ పెరుగుతాయి. ఇక బరువు తగ్గటం కోసం మధ్యాహ్న భోజనం మానేసే వారూ చాలామంది ఉన్నారు. దీనితో ప్రయోజనం శూన్యం. ఎందుకంటే భోజనం తర్వాత దాదాపు 2 గంటల వరకూ కూడా మనలో జీవక్రియలు 20-30% వేగవంతమవుతాయి. భోజనం మానేస్తే ఇవి మందగిస్తాయి. పైగా మధ్యాహ్న భోజనం మానేసినవాళ్లు- సాయంత్రం అయ్యేసరికి ఉండలేక రకరకాల స్నాక్స్ తినేస్తారు, దీంతో క్యాలరీల మోతాదూ పెరిగిపోతుంది. ఆఫీసుల్లో సాయంత్రం టీ సమయంలో సమోసాలు, పకోడీల వంటి నూనెలతో నిండిన రకరకాల పదార్థాలను దండిగా తింటుంటారు. క్యాలరీల పరంగా చూస్తే కొన్నిసార్లు ఇవి భోజనం మోతాదునూ మించిపోతాయి! ఒకవేళ సాయంత్రం స్నాక్స్ తినకపోతే- మధ్యాహ్నం భోజనంలేదు కాబట్టి రాత్రి భోజనానికి కూచున్నప్పుడు వేగంగా తినేస్తుంటారు. ఇదీ మంచిది కాదు. ఇక మధ్యాహ్నం పూట ఆకలి మంటలను చల్లార్చుకునేందుకు టీ, కాఫీల వంటివాటినీ ఆశ్రయిస్తుంటారు. ఇవి ఆ సమయంలో ఆకలిని చంపి, ఉత్తేజాన్నిచ్చినట్టే ఉంటాయిగానీ జీర్ణాశయానికి హాని చేస్తాయి. వీటివల్ల శరీరం పోషకాలను సరిగా గ్రహించలేని పరిస్థితి కూడా వస్తుంది. మధ్యాహ్న భోజనం మానితే ఇన్ని అనర్ధాలు. అందుకే మితంగా చక్కటి పోషకాహారం తినటం ఉత్తమం!<ref>[http://www.livestrong.com/article/449208-why-is-lunch-so-important/ Why Is Lunch So Important?]</ref>
 
==ఆహారము - నీరు==
పంక్తి 25:
==చిత్రమాలిక==
<gallery class="center" caption="" widths="175px" heights="175px">
Image:Albert Anker - Stillleben - Unmässigkeit.jpg|Simple meals often consist of bread and/or meat [[Albert Anker]], [[Still life]] ''Excess'' (1896)
File:Peninsula Afternoon tea.jpg|Afternoon tea
File:Sveas brunch (cropped).jpg|[[Brunch]] foods
పంక్తి 40:
[[వర్గం:పదజాలం]]
[[వర్గం:ఆహార పదార్థాలు]]
 
[[nl:Eten#Maaltijden]]
"https://te.wikipedia.org/wiki/భోజనం" నుండి వెలికితీశారు