మరుగుజ్జు వృక్షాలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , శిధిలా → శిథిలా, శిథిలావస్త → శిథిలావ using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Bonsai Federahorn.jpg|thumb|upright|[[జర్మనీ]]లోని బోన్సాయి చెట్టు.]]
==పరిచయం==
[[చైనా]]లో పెన్జింగ్ (Penzing) అనబడే బోన్సాయ్ (Bonsai) కళ హన్ (Hun) సామ్రాజ్య హయంలో మొదలైందని చారిత్రకారుల నమ్మకం. [[జపాన్]] కు బోన్సాయ్ కళ మొదటి సంపన్నులకే పరిమితమైంది. 14 వ శతాబ్దంలో చైనా వారు జపాన్ ను ముట్టడించడంతో బోన్సాయ్ కళ అన్ని వర్గాలవారికి పాకింది. [[ప్యారిస్]] లో 1878 లో మొట్టమొదటిసారిగా థర్డ్ యూనివర్సల్ ఎగ్జిబిషన్ లో బోన్సాయ్ ప్రదర్శన జరిగింది. ఆ తర్వాత 1889 మరియు 1900 లో జరిగిన ప్రదర్శనల వల్ల పశ్చిమ దేశాల్లో బోన్సాయ్ కళ పట్ల ఆదరణ పెరిగింది. 1909 లో [[లండన్]] సిటీలో మొదటి మెగా బోన్సాయ్ ప్రదర్శన జరిగింది. కాలక్రమేణా బోన్సాయ్ కళ జపాన్ దేశమంతటా ప్రసిద్ధి గాంచింది. 18, 19 శతాబ్దాలలో [[భారతదేశం]]తో సహా ప్రపంచమంతటా ఈ కళ విస్తరించింది.
 
==మొక్కలు సేకరించే ప్రదేశాలు==
*శిధిలావస్తలోశిథిలావస్థలో ఉండే ఇటుక గోడలు
*పొలాల్లో, చేలల్లో, రోడ్ల వెంబడి తాడి చెట్లు
*నర్సరీలు
 
==బోన్సాయ్ సాగు పద్దతి==
ముందుగా చిన్న మొక్కగా నర్సరీ ప్యాకెట్లలో పెంచుతూ దాన్ని సుమారు 4 నుండి 10 సంవత్సరాలవరకూ కొమ్మల కత్తిరింపులద్వారా వృక్ష ఆకారం తీసుకురావాలి. ఆ తర్వాత దాన్ని లోతు తక్కువగా ఉన్న ట్రే (Tray) లలో నాటాలి. బోన్సాయ్ మొక్కలను, ఎండాకాలంలో తప్ప, ఇతర కాలాల్లో నేరుగా ఎండలో ఉంచితే మంచిది. మట్టి తడి 90% ఆరినప్పుడు మాత్రమే నీరు పోయాలి. సంవత్సరానికి ఒకసారి మట్టిని వానపాముల ఎరువు (Earthworm waste) తో సారం చేసుకోవాలి, వర్షాకాలంలో అతిగా పెరిగిన వేళ్ళను కత్తిరించుకోవాలి. మట్టిలో కొబ్బరి పొట్టు (Coconut choir) మరియు వానపాముల ఎరువు సమపాళ్ళలో ఉండేటట్టు చూసుకోవాలి. వృక్ష ఆకారం తీసుకురావడానికి అవసరమైతే కొమ్మలను రాగితీగ (Copper wire) తో కావలసిన దిశలో వంచుకోవాలి. సృష్టిలో ఏ మొక్కకైనా తల్లివేరు (Mother root), పిల్లవేర్లు (Side roots) ఉంటాయి. తల్లివేరు మొక్కను భూమ్మీద నిలబడేలా చేస్తే, దాని చుట్టూరా ఉన్న పిల్లవేర్లు మొక్కకు ఆహారాన్ని చేరవేస్తాయి. బోన్సాయ్ మొక్కల పెంపకంలో ఈ తల్లి వేరు అవసరం లేదు కనుక, పిల్లవేర్లను మాత్రమే ఉంచి దాన్ని గార్డెన్ కటర్ తో తొలగించాలి. సాధారణంగా కొమ్మలు సూర్యకాంతి వచ్చే దిశగా ఆరోగ్యంగా ఎదుగుతాయి.
 
==బోన్సాయ్ గా పెంచుకోదగ్గ జాతులు==
పంక్తి 31:
బోన్సాయ్ మొక్కల పెంపకం మహా నగరాల్లో ఎక్కువగా వుంటుంది. అందువలన మహానగరాల్లో బోన్సాయ్ మొక్కల కొనుగోలు ధర వేల రూపాయల నుండి లక్షల రూపాయల వరకూ ఉంటున్నది. బోన్సాయ్ మొక్కలను ఎక్కువగా కోటీశ్వరులు, పెద్ద పెద్ద రెస్టారెంట్ల వారు, ఐదు నక్షత్రాల హోటల్స్ వారు కొనుగోలు చేస్తారు.
 
[[వర్గం: కళలు]]
[[వర్గం:వృక్ష శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/మరుగుజ్జు_వృక్షాలు" నుండి వెలికితీశారు