మాడపాటి హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నను గురించి → న గురించి (2), → (2), , → ,, ( → ( (2) using AWB |
||
పంక్తి 35:
| weight =
}}
'''మాడపాటి హనుమంతరావు''' ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు రచయిత. హనుమంతరావు 20వ శతాబ్ది తొలిదశకంలో హైదరాబాద్ రాజ్యంలోని తెలుగు ప్రాంతాల్లో (నేటి తెలంగాణ) ఆంధ్రోద్యమం వ్యాప్తిచేసేందుకు కృషిచేశారు. ఆయన చేసిన కృషికి గాను ఆంధ్ర పితామహుడు అన్న పేరును పొందారు. న్యాయవాద వృత్తిని చేపట్టిన మాడపాటి విజయవంతమైన లాయరుగా పేరుపొందారు. తీరిక సమయాలన్నిటా ఆంధ్రోద్యమానికి, తెలంగాణాలో గ్రంథాలయాల అభివృద్ధికి కేటాయించేవారు. ఆంధ్రజనసంఘం, ఆంధ్రమహాసభ వంటి ప్రజాసంఘాల స్థాపనలోనూ, వాటి నిర్వహణలోనూ కీలకపాత్ర వహించారు.తర్వాతి తరం ప్రజానాయకులు వీరిని మితవాదిగా గుర్తించారు. అయితే నైజాం ప్రాంతంలో తర్వాతి తరం రాజకీయ నాయకత్వం ఏర్పడడానికి పునాదిగా వీరు చేసిన కృషి సార్థకమైనది. ఆయన ప్రజాహితరంగంలో, సాంస్కృతిక చైతన్యం కలిగించడంలో ఎంతో కృషిచేసినా చాలా కాలం వరకూ క్రియాశీలకమైన రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదు. 1952లో శాసనసభకు పోటీచేసి ఓడిపోయారు. హైదరాబాద్ నగరానికి తొలి మేయరు పదివిని అధిష్టించారు.
==వ్యక్తిగత జీవితం==
వీరు 1885 జనవరి 22 ([[తారణ]] సంవత్సర [[మాఖ శుద్ధ షష్ఠి]]) న కృష్ణ జిల్లా నందిగామ తాలూకా పొక్కునూరులో వెంకటప్పయ్య, వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. వీరు ఆరువేల నియోగి బ్రాహ్మణులు. ఆయన తండ్రి గ్రామాధికారిగా పనిచేసేవాడు. 1904 లో మాడపాటి వారికి తమ చిన మేన మామ గారి కుమార్తె అన్నపూర్ణమ్మతో వివాహమైంది. వీరిరువురికి లక్ష్మిబాయి అనే కుమార్తె జన్మించింది. దురదృష్ట వశాత్తూ అన్నపూర్ణమ్మ అకాలమరణం చెందారు. తదనంతరం, 1918 లో గొల్లమూడి హనుమంతరావు కుమార్తె మాణిక్యమ్మను వివాహమాడారు. మాడపాటివారికి, మాణిక్యమ్మకు సుకుమార్ జన్మించాడు. 1964 లో సుకుమార్ కు సుచేతతో వివాహమైంది. సుచేత, వరంగల్ వాస్తవ్యులు ఎర్ర జగన్మోహన్ రావు, పద్మావతిల పెద్ద కుమార్తె. దురదృష్టవశాత్తూ సుకుమార్ అకాలమరణం చెందారు. శ్రీమతి సుచేత మాత్రం మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాలకు తమ సేవలను అర్పితం చేసారు.<ref>ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు (జీవిత చరిత్ర) - డి.రామలింగం (1985) ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు శతజయంతి ఉత్సవ కమిటీ.</ref>
==రచనారంగం==
మాడపాటివారు మంచి కవి, రచయిత. మాడపాటి మొత్తం పదమూడు కథలు రాశారు. వీటిలో హృదయశల్యం, రాణీసారందా, ముసలిదాని ఉసురు, నేనే, అగ్ని గుండం, నాడు నీ పంతం, నేడు
== ప్రజాసేవ ==
=== ఆంధ్రోద్యమం ===
[[తెలంగాణా]] ప్రాంతంలో [[నిజాం]] పాలనకు వ్యతిరేకముగా ప్రజలను మేల్కొలిపి సంఘటితం చేసి [[ఆంధ్ర మహాసభ (తెలంగాణ)|ఆంధ్ర మహాసభ]]ను నెలకొల్పారు. రాజకీయ రంగంలో మాడపాటి వారిది మితవాదధోరణి. ఆయన తోటి ప్రజాసేవకులతో పాటు
ఆంధ్రోద్యమాన్ని ఆరంభ దశ నుంచి ఓ మహోద్యమంగా మలిచేవరకూ సాగిన ఆయన జీవనపథంలో పలువురు తర్వాతి తరం మహానాయకుల్లో రాజకీయ నేతృత్వాన్ని ఆయనే మొదట ప్రోత్సహించారు. ఆంధ్రోద్యమంలో పనిచేయగలిగిన వారిని స్వయంగా గుర్తించి, వారికి తగిన బాధ్యతలు అప్పగించారు. వారి చేతిలో తర్వాతి తరం తెలంగాణా పోరాట నాయకత్వం రూపుదిద్దుకున్నది అన్నా అతిశయోక్తికాదు.<ref name="ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ">{{cite book|last1=గుమ్మన్నగారి|first1=బాలశ్రీనివాసమూర్తి|title=ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ|date=జూన్ 2014|publisher=ఎమెస్కో బుక్స్|location=హైదరాబాద్|isbn=978-93-89652-05-01}}</ref>
=== గ్రంథాలయోద్యమం ===
పంక్తి 61:
== ప్రాచుర్యం ==
తెలంగాణలో చైతన్యాన్ని తెచ్చిన తొలి తెలుగు నాయకునిగా మాడపాటి హనుమంతరావు గొప్ప ప్రాచుర్యం, గౌరవం పొందారు. హైదరాబాద్ నగరంలో ఆంధ్ర కుటీరం పేరిట నిర్మించుకున్న ఆయన ఇంటికి ఆంధ్రోద్యమ కాలంలో నాయకులు, విద్యార్థులు తరచుగా వస్తూండేవారు. తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్ పనిమీద వచ్చినప్పుడల్లా విద్యార్థులు, విద్యావంతులు తప్పనిసరిగా గోల్కొండ (ప్రతాపరెడ్డి ఇల్లుకు పెట్టుకున్న పేరు)లో సురవరం ప్రతాపరెడ్డిని, ఆంధ్రకుటీరంలో మాడపాటి వారిని ఒక ఆచారంలా సందర్శించుకునేవారు.<ref name="యాత్రాస్మృతి 52పేజీ">{{cite book|last1=దాశరథి|first1=కృష్ణమాచార్య|title=యాత్రాస్మృతి|page=52}}</ref> ఆ విషయం తెలంగాణ సాయుధ పోరాటం ముందు స్థితిగతులను ప్రతిబింబించేలా వ్రాసిన చారిత్రిక నవల [[చిల్లర దేవుళ్ళు (నవల)|చిల్లర దేవుళ్ళులో]] ప్రస్తావించబడింది. ఆ నవలలో రచయిత దాశరథి రంగాచార్యులు ఆంధ్రపితామహ మాడపాటి హనుమంతరావును ఓ పాత్రగా మలిచి వారితో కథానాయకునికి నైజాంలోని తెలుగు దుస్థితి వివరింపజేస్తారు.<ref name="చిల్లర దేవుళ్ళు">{{cite book|last1=దాశరథి|first1=రంగాచార్యులు|title=చిల్లరదేవుళ్ళు|publisher=విశాలాంధ్ర ప్రచురణాలయం|location=హైదరాబాద్}}</ref>
== పురస్కారాలు-గౌరవాలు ==
ఆయన తెలంగాణా రాజకీయరంగంలో వహించిన బాధ్యతలను పురస్కరించుకుని ఆంధ్రపితామహుడన్న బిరుదుతో వ్యవహిరిస్తూంటారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్‌తో, భారత ప్రభుత్వం ‘పద్మ భూషణ్’ బిరుదుతో గౌరవించాయి.
|