"మానస సరోవరం" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కాశి → కాశీ , లో → లో (3), కు → కు , గా → గా (2), ఖచ్చితమై → క using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కాశి → కాశీ , లో → లో (3), కు → కు , గా → గా (2), ఖచ్చితమై → క using AWB)
[[దస్త్రం:Mansarovar.jpg|thumb|right|250px|సరస్సు మరియు టిబెటన్ హిమాలయాలు.]]
 
మానసరోవరం (లేక మానస సరోవరము, లేక మానస్) అనేది [[చైనా]] (China) కు చెందిన [[టిబెట్]] (Tibet) ప్రాంతంలో గల మంచినీటి సరస్సు (Fresh water lake). ఇది లాసా (Lhasa) నగరానికి 940 కిలోమీటర్ల దూరంలో భారత దేశానికి, [[నేపాల్]] కు చేరువలో ఉన్నదిఉంది. చైనా లోచైనాలో ఈ సరస్సును మపం యుం (Mapam Yum), మపం యు ట్సొ (Mapam Yu Tso) అనే పేర్లతో పిలుస్తారు.
 
== భౌగోళిక స్వరూపం ==
మానసరోవరానికి పశ్చిమాన [[రాక్షస్తల్]] అనే ఉప్పు నీటి సరస్సు, ఉత్తరాన హిందువులు శివుని నివాస స్థలంగా భావించే [[కైలాస పర్వతం]] ఉన్నవిఉన్నాయి. ఈ మంచినీటి సరస్సు సముద్రమట్టానికి 4,590 మీటర్ల ఎత్తులో ఉన్నదిఉంది. 88 మీటర్ల చుట్టుకొలత, 300 అడుగులు లోతు, 320 చరదరపు కిలోమీటర్ల ఉపరితలము కలిగియున్న [[మానస సరోవరం]] గంగా చు (Ganga Chu) చానల్ ద్వారా రాక్షస్తల్ సరస్సుకి అనుసంధానమైయున్నది. ఈ ప్రాంతంలో ఎండాకాలం మే నెల నుండి ఆగష్టు నెల వరకూ ఉంటుంది. ఎండాకాలం (Summer) లో గరిష్టగరిష్ఠ ఉష్ణోగ్రత 15 డిగ్రీలు ఉంటుంది. [[ఋతుపవనాలు]] (Monsoons) సెప్టెంబరు నెల నుండి నవంబరు నెల వరకూ ఉంటాయి. చలికాలం (Winter) లో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల నుండి -15 డిగ్రీల మధ్య ఉంటుంది. అతి శీతలమైన ఈ సరస్సు ప్రాంతంలో ఎక్కడ చూచినా [[కొండలు]], బండ రాళ్ళు, అక్కడక్కడా చిన్నపాటి గడ్డి జాతి మొక్కలు మాత్రమే కనిపిస్తాయి.
 
== సాంస్కృతిక ప్రాధాన్యం ==
సంస్కృతములో మానస అనగా మనసు, సరోవరము అనగా సరస్సు. పూర్వ కాలములో [[భారత దేశం]], టిబెట్, [[నేపాల్]] సరిహద్దులతో నిమిత్తం లేకుండా కలిసియుండేవి. అందువలన మానసరోవరము భారతీయులకు, నేపాలీలులకు, టిబిటియన్లకు పవిత్ర స్థలమైయున్నది., అనగా హిందువులకు, బౌద్ధులకు, జైనులకు మనసరోవరం పవిత్రమైన సరస్సు. హిందూ పురాణాల ప్రకారం [[బ్రహ్మ]] దేవుడి ఆలోచననుండి మానసరోవరం ఆవిర్భవించి భూమ్మీద పడినది. మానసరోవరంలోని నీరు త్రాగితే మరణించిన తర్వాత నరకానికి వెళ్ళకుండా నేరుగా కైలాసానికి చేరవచ్చని, సరస్సులో స్నానమాడితే నూరు జన్మల వరకూ పాపాలు పరిహారమైపోతాయని , జ్ఞానానికి మరియు అందానికి ప్రతిరూపాలైన [[హంస]]లు (Swans) మనసరోవరములో విహరించేవని హిందువులు నమ్ముతారు.బ్రహ్మ దేవుడు మానసాన ఊహించి భూమిపై ఆవిష్కరించినది కనుక ఇది మానస సరోవరం గాసరోవరంగా చెపుతారు.
 
==తెలుసుకున్న విశేషాలు==
ప్రపంచంలో కెల్లా ఈ సరోవర జలం స్వచ్చమైనదిస్వచ్ఛమైనది, అత్యుత్తమమైనదిగా ప్రతీక.
స్వచ్చమైనస్వచ్ఛమైన ఈ సరోవరంలో తెల్లని హంసలు అదనపు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
మానస సరోవర పరిధి దాదాపు 90కి, మీ. ఆసియా ఖండంలోని నాలుగు గొప్పనదులు - బ్రహ్మపుత్ర, కర్నలి, ఇండస్, సట్లెజ్ లకి అధారంఆధారం మానససరోవర జలం.
ఇక అన్నిటికంటే ప్రత్యేకత వేదమాత విహరించే స్థలం మానససరోవర తీరం.
వేదాలు అభ్యసించి, శాస్త్రాలు ఆచరించలేక పోయినా ఈ సరోవర జలం తీర్థంలా సేవించి, సరోవరంలో స్నానం చేస్తే జన్మధన్యం అనేది నమ్మకం.
 
==యాత్రలు==
చలికాలము లోచలికాలములో సరస్సు ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఫలితంగా అక్కడి వాతావరణం యాత్రీకులకు ప్రతికూలంగా ఉంటుంది కనుక యాత్రీకులు (Tourists) సాధారణంగా ఎండాకాలంలోను, ఋతుపవనాల కాలంలోను మనసరోవరాన్ని దర్శిస్తారు. భారత దేశంలో ఉత్తర కాశికాశీ నుండి మరియు నేపాల్ లో [[కాఠ్మండు]]నగరం నుండి ప్రతి సంవత్సరము కైలాస మానసరోవర యాత్రలు జరుగుచున్నవి.వేద, పురాణ ఇతిహాసాల ప్రమాణికంగా కైలాసగిరి-హిమాలయాలు భరత ఖండానికి చెందినవి, 7వ శతాబ్దం టిబెట్ స్వతంత్ర దేశంగా పాలన మొదలు పెట్టినప్పడి నుండీ ఈ కైలాసగిరి టిబెట్ దేశానికి చెందినది. అందువల్ల హిందువులకే కాక బౌద్ధ, జైనులకి కూడా ఇది ఎంతో పవిత్రమైన పుణ్యస్థలము.
1950 చైనా టిబెట్ ని ఆక్రమించుకున్నాక, భారతీయులకి కైలాస సందర్శనం కష్ట సాధ్యమయ్యింది. 1959 నుండీ 1978 వరకు దాపు 20 సంవత్సరాలు అసలు ఎవరికీ ఈ గిరిని దర్శించడానికి అనుమతి ఇవ్వలేదు.ఆతరువాత 1980 నుండీ కొద్దికొద్దిగా యాత్రికులని భారత ప్రభుత్వం ద్వారా వెళితే అనుమతించేవారట. ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా పలు ట్రావెల్ ఏజెంట్స్ ఈ యాత్రని కొంత సుగమం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
 
==యాత్ర జాగ్రత్తలు==
 
మానసిక సంకల్పంతో పాటు శారీరకం గాశారీరకంగా కూడా అక్కడి వాతావరణం తట్టుకునే శక్తి కావాలి. ఈ యాత్రకి సిద్దం కావడానికి ముందు నుండీ ఉదయం సాయంత్రం నడక, శ్వాసకి సంబంధించిన వ్యాయామం, యోగా చేయడం ఎంతైనా తోడ్పడతాయి. మధుమేహం, స్పాండిలైటీస్, బాక్పేఇన్ ఆస్తమ, సైనస్ వంటివి ఉంటే, ఈ యాత్ర చేయలేరు. అయినాసరే ఈ యాత్ర చేయాలనుకుంటే డాక్టర్ని సంప్రదించి సరైన పర్యవేక్షణలో చేయాలి.
సముద్ర మట్టం నుండీ 4000 మీటర్ల ఎత్తు వెళ్లిన తరువాత, శరీరానికి తగినంత ప్రాణవాయువు అందడం కష్టం అవుతుంది. అందుకు డైమాక్స్ అనె టాబ్లెట్ రోజు రాత్రి తప్పనిసరి వేసుకోవాలి. ఇది ఏ ఆల్టిట్యుడ్ లో మొదలుపెడితే, తిరుగు ప్రయాణంలో అక్కడకి వచ్చేదాకా వేసుకోవాలి. ఇక జలుబు దగ్గు, గొంతునొప్పి, నడచి అలసిపోతె వేసుకోడానికి పారాసిటిమాల్, వికారం, వాంతులు, విరోచనాలకి సంబందిచిన ఇంకా ఏ ఇతర వాటికోసమైనా మందులు మన దగ్గర ఉంచుకోడం ఎంతైనా అవసరం. అలాగే చలికి తట్టుకునే విధమైన వస్త్రాలను ధరించాలి. అంతేకాదు ఈ ప్రయాణం లోప్రయాణంలో స్నానం, టాయిలెట్ సౌకర్యం అన్నిచోట్లా సరిగ్గా ఉండదు.అక్కడి పరిస్తితులనిపరిస్థితులని బట్టి సర్దుకుని పోడానికి సంసిద్దం కావాలి.
 
 
 
*భారతీయ అద్భుతాలు -మానస సరోవరం🌼
తీరని కోరిక. కాని ఇప్పుడు చైనా ప్రభుత్వం అక్కడికి సులభంగా చేరుకోవడానికి ఏర్పాట్లు చేస్తోంది. భారీ వాహనాలు సైతం సునాయాసంగా ప్రయాణించటానికి వీలుగా రోడ్లు.. కొండ చరియలు విరిగి పడకుండా ఇనుప కంచెలు.. హఠాత్తుగా వరదలు వచ్చి రోడ్డు కొట్టుకుపోకుండా పక్కనే కాలువలు వంటి అనేక సదుపాయాలను కల్పిస్తోంది. వచ్చే ఒకటి రెండేళ్లలో ఈ యాత్రను సులభంగా పూర్తి చేసుకొని తిరిగి వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ప్రపంచంలో అత్యంత కఠినమైన యాత్రలలో కైలాస యాత్ర ఒకటి. వేల అడుగుల నుంచి జారిపడే జలపాతాలు, పెట్టని కోటల్లా ఎటువైపు చూసినా కనిపించే పర్వతాలు, అడుగు జారితే ఎముకలు కూడా దొరకవనే భయం కలిగించే లోయలు- ఇవన్నీ కైలాస యాత్రలో భాగాలు. ఒక విధంగా మానస సరోవరానికి, కైలాస పర్వతానికి ఆకర్షణను కలిగించేవి కూడా ఇవే. హిందూ పురాణాలలోను, కావ్యాలలోను ఈ ప్రదేశాల గురించి సవివరమైన వర్ణనలు ఉన్నా, అనుభవైక్యం అయితే తప్ప వాటి గొప్పతనం అర్థం కాదు. చైనా అధీనంలో ఉన్న టిబెట్ ప్రాంతంలో మానస సరోవరం, కైలాస పర్వతం రెండూ ఉన్నాయి. ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంలో ఉన్న మంచి నీటి తటాకం మానస సరోవరం.
దీనికి పశ్చిమంగా రాక్షసతాల్ అనే సరోవరం, ఉత్తర భాగంలో కైలాస పర్వతం ఉంటాయి. సముద్ర మట్టానికి పదిహేను వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ సరోవర చుట్టుకొలత దాదాపు 88 కిలోమీటర్లు ఉంటుంది. లోతు దాదాపు మూడు వందల అడుగుల దాకా ఉంటుంది. బ్రహ్మ మదిలో ఈ సరోవరం పుట్టిందని.. బ్రహ్మే దీనిని భూమిపైకి తీసుకువచ్చాడని హిందూపురాణాలు చెబుతాయి. బ్రహ్మ మానసంలో (మనసు) పుట్టింది కాబట్టి దీనికి మానససరోవరం అనే పేరు వచ్చిందని కూడా చెబుతారు. ఈ సరోవరంలో స్నానం చేస్తే వంద జన్మల్లో చేసిన పాపాలన్నీ పోతాయనేది హిందువుల నమ్మకం.
బౌద్ధ జాతక కథలలోను, ఇతర గ్రం«థాలలోను కూడా ఈ సరోవరం ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది. ‘అనవతప్త’ అని బౌద్ధులు పిలుచుకొనే ఈ సరోవరం ఒడ్డున ‘చూ గంప బౌద ్ధఆరామం’ ఉంది. బుద్ధుడు భూమిపై ఉద్భవించటానికి బీజం ఈ సరోవరం ఒడ్డునే పడిందనేది బౌద్ధుల నమ్మ కం. నిజానికి ఎన్ని వేల ఏళ్ల నుంచి ఇక్కడ జనసంచారం ఉందనే విషయాన్ని చెప్పటానికి కచ్చితమైన ఆధారాలేమీ లేవు. కొన్ని వేల ఏళ్ల నుంచి భారత ఉపఖండంలో నుంచి ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చి వెళ్తున్నారనే విషయంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు.
రెండు మార్గాలు..
మానస సరోవరానికి, కైలాస పర్వతానికి చేరుకోవటానికి రోడ్డు ద్వారానే రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది- నేపాల్ నుంచి టిబెట్‌లోకి ప్రవేశించి జాంగ్ము, సాగాల మీదుగా మానససరోవరం చేరుకోవటం. ఖాట్మండు నుంచి టిబెట్ సరిహద్దుల్లో ఉండే ఫ్రెండ్‌షిప్ బ్రిడ్జ్‌కు చేరుకోవటానికి కనీసం ఆరు గంటలు పడుతుంది. వేల అడుగుల లోతైన లోయల పక్క నుంచి.. హఠాత్తుగా విరిగి పడే కొండచరియలతో ఈ ప్రయాణం అత్యంత కఠినంగా ఉండేది. ఇప్పుడు కూడా ఈ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు లేదు. ఫ్రెండ్‌షిప్ బ్రిడ్జి దాటిన తర్వాత జాంగ్మూకు చేరుకోవటానికి ఒకప్పుడు 12-14 గంటలు పట్టేది. ఒకప్పుడు మట్టి రోడ్లు మాత్రమే ఉండే ఈ ప్రాంతంలో ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయికి ఏ మాత్రం తగ్గని తారురోడ్లు వచ్చేసాయి.
అందువల్ల ఇప్పుడు ఏడెనిమిది గంటల్లో వెళ్లిపోగలుగుతున్నారు. అయితే వీటితో పాటు ప్రతి ఇరవై కిలోమీటర్లకు ఒక సైనిక శిబిరం కూడా వచ్చింది. జాంగ్మూ నుంచి సాగాకు, సాగా నుంచి మానస సరోవరానికి వెళ్లే రోడ్లు, ఆ దారిలోని మౌలిక సదుపాయాలు కూడా గణనీయంగా అభివృద్ధి చెందాయి. సాగా నుంచి మానస సరోవరానికి గత ఏడాది 30 శాతం మాత్రమే తారు రోడ్డు ఉంటే.. ఈ సారి అది 70 శాతానికి పెరిగింది. దీని వల్ల పన్నెండు నుంచి పదహారు గంటలు పట్టే ప్రయాణ సమయం ఎనిమిది గంటలకు తగ్గిపోయింది. ఈ ప్రాంతంలో మిగిలిన చోట్ల కూడా యుద్ధ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణం ప్రారంభమయింది.
వచ్చే ఏడాది మానస సరోవర యాత్ర ప్రారంభమయ్యే నాటికి సాగా నుంచి మానస సరోవరానికి ఆరు గంటల్లో వెళ్లిపోవచ్చంటే అతిశయోక్తి కాదు. మానస సరోవరం నుంచి కైలాస పర్వతం బేస్‌క్యాంపు దాకా కూడా చైనా ప్రభుత్వం రోడ్ల నిర్మాణం ప్రారంభించింది. ఈ ఏడాది బేస్‌క్యాంపు నుంచి కైలాస పర్వతం కింది దాకా జీపులపై వెళ్లటానికి కూడా కొందరికి అనుమతులు ఇచ్చింది. ఇదే ఒరవడి ఇంతే జోరుగా కొనసాగితే- కైలాస పర్వతానికి నేరుగా జీపుల్లో వెళ్లే అవకాశం ఏర్పడవచ్చు. అంటే వచ్చే రెండు, మూడేళ్లలో- మానస సరోవర యాత్ర- చాలా మందికి ఒక పిక్నిక్‌గా మారిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే అదనంగా ఐదు వేల యువాన్‌లు- అంటే 40 వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఉక్కు కవచం..
ఒక పక్క వేల మంది యాత్రికులు సునాయాసంగా కైలాస్ మానససరోవర యాత్రకు రావటానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న చైనా ప్రభుత్వం.. మరోవైపు వారిపై అంతే కఠినమైన ఆంక్షలు కూడా విధిస్తోంది. ఉదాహరణకు ఫ్రెండ్‌షిప్ బ్రిడ్జి దాటడానికి (అంటే టిబెట్‌లో ప్రవేశించటానికి) ఎంత సమయం పడుతుందో ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. కొందరు యాత్రికులకు రెండు రోజులు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే విధంగా దలైలామా గురించి కాని.. టిబెట్ స్వాతంత్య్ర పోరాటం గురించిగాని పుస్తకాలు పట్టుకెళితే – వారికి టిబెట్‌లో ప్రవేశం ఉండదు.
అయితే చివరి నిమిషంలో అతను ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. 1950 నుంచి 80 దాకా చైనా ప్రభుత్వం ఈ పర్వతాన్ని ఎక్కడానికి ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. 1980లో రిన్‌హోల్డ్ మెస్‌నర్ అనే వ్యక్తికి ఈ అవకాశాన్ని కల్పించింది. అయితే మెస్‌నర్ ఈ అవకాశాన్ని ఎందుచేతో ఉపయోగించుకోలేదు. ఆ తర్వాత 2001 దాకా కైలాస పర్వతాన్ని అధిరోహించటానికి పెద్దగా ప్రయత్నాలు జరగలేదు. 2001లో స్పెయిన్‌కు చెందిన జీసస్ మార్టినిజ్ నోవాస్ నేతృత్వంలోని ఒక బృందానికి చైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే కైలాస పర్వతం హిందూ మత విశ్వాసాలతో ముడిపడి ఉందని.. అందువల్ల దానిని అధిరోహించటానికి అనుమతి ఇవ్వకూడదంటూ అంతర్జాతీయంగా ఒత్తిడి వచ్చింది. దీనితో చైనా ప్రభుత్వం అనుమతిని ఉపసంహరించుకుంది. ఈ పర్వతాన్ని అధిరోహించటానికి ఎవరికీ అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది.
అతి పవిత్రం మానస సరోవరం..
* బ్రహ్మపుత్ర, కర్ణాలి (గంగ), సింధు, సట్లజ్ నదులు మానస సరోవరం నుంచి పుట్టాయని భక్తుల భావన. అయితే దీనికి ఖచ్చితమైనకచ్చితమైన ఆధారాలేమీ లేవు.
* సాధారణంగా ఈ ప్రాంతంలోకి యాత్రికులను బౌద్ధ పూర్ణమి నుంచి దీపావళి వరకు అనుమతిస్తారు. కొన్నిసార్లు వాతావరణాన్ని బట్టి ఇది మారుతుంది కూడా. ఆ కాలంలో కూడా ఉష్ణోగ్రత కొన్నిసార్లు మైనస్‌కి వెళ్లిపోతుంది.
* భారత ప్రభుత్వం ఏడాదికి 750 మందిని మాత్రమే ఈ యాత్రకు పంపిస్తుంది. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఈ యాత్రను నిర్వహిస్తున్నాయి. వారు నేరుగా చైనా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటారు.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2001237" నుండి వెలికితీశారు