ఆపరేషన్ పోలో: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కు → కు , గా → గా , ఉద్దేశ్యం → ఉద్దేశం, → , ) → ) using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 17:
1948 [[ఆగష్టు 9]] న ''టైంస్‌ ఆఫ్‌ లండన్‌''లో వచ్చిన వార్త ప్రకారం హైదరాబాదు 40,000 సైన్యాన్ని, ఆయుధాలను సమకూర్చుకుంది. హైదరాబాదు ప్రధాన మంత్రి లాయిక్‌ ఆలీ ఇలా అన్నాడు '''భారత ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి లక్ష మందితో సైన్యం సిద్ధంగా ఉంది, బొంబాయిపై బాంబులు వెయ్యడానికి సౌదీ అరేబియా కూడా సిద్ధంగా ఉంది '''
 
నిజాము చేపట్టిన ఈ చర్యలకు తోడు రజాకార్ల హింస, [[హైదరాబాదుపై పోలీసు చర్య]]కు కేంద్ర ప్రభుత్వం నడుం కట్టింది. [[1948]] [[సెప్టెంబర్ 13]]న హైదరాబాదుపై పోలీసు చర్య మొదలైంది. దీనికి '''ఆపరేషన్ పోలో''' అని పేరు పెట్టారు. '''గోడ్డాన్ ప్లాన్''' అని కూడ అంటారు మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌. చౌదరి నాయకత్వంలో భారత సైన్యం మూడు వైపుల నుండి హైదరాబాదును ముట్టడించింది. [[1948]] [[సెప్టెంబర్ 18]]న నిజాము లొంగిపోయాడు. పోలీసు చర్య ఐదు రోజుల్లో ముగిసింది. 1373 మంది రజాకార్లు హతమయ్యారు. మరో 1911 మంది బందీలుగా పట్టుబడ్డారు. హైదరాబాదు సైన్యంలో 807 మంది చనిపోగా, 1647 మంది పట్టుబడ్డారు. భారత సైన్యం 10 మంది సైనికులను కోల్పోయింది. ఆతని ప్రధానమంత్రి మీర్‌ లాయిక్‌ ఆలీ, రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ అరెస్టయ్యారు. తరువాత ఖాసిం రిజ్వీ కొన్నాళ్ళు భారత దేశంలో జైలు జీవితం గడిపి, విడుదలయ్యాక, పాకిస్తాను వెళ్ళి స్థిరపడ్డాడు. కొన్నాళ్ళకు అక్కడే అనామకుడిలా మరణించాడు.
 
[[సెప్టెంబర్ 23]]న భద్రతా సమితిలో తన ఫిర్యాదును నిజాము ఉపసంహరించుకున్నాడు. [[హైదరాబాదు]] భారతదేశంలో విలీనం అయినట్లుగా ప్రకటించాడు. [[మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌. చౌదరి]] హైదరాబాదు సైనిక గవర్నరుగా బాధ్యతలు స్వీకరించి, 1949 చివరి వరకు ఆ పదవిలో ఉన్నాడు.
"https://te.wikipedia.org/wiki/ఆపరేషన్_పోలో" నుండి వెలికితీశారు