టీ.జి. కమలాదేవి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (2), లో → లో , కి → కి , పని చేస్తూ → పనిచేస్తూ, నేప using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
}}
 
'''టి.జి.కమలాదేవి''' ([[డిసెంబర్‌ 29]], [[1930]] - [[ఆగస్టు 16]], [[2012]]) (TG Kamala Devi) (ఏ.కమలా చంద్రబాబు)<ref>http://www.oldtelugusongs.com/cgi-bin/search/search.pl?scode=p85</ref> అసలు పేరు '''తోట గోవిందమ్మ'''. వివాహం అయ్యాక భర్త పేరు చేరి ఈమె పేరు ఏ.కమలా చంద్రబాబుగా మారింది. ఈమె [[తెలుగు సినిమా]] నటి మరియు [[స్నూకర్]] క్రీడాకారిణి. ప్రసిద్ధ నటుడు [[చిత్తూరు నాగయ్య]] భార్య జయమ్మకు చెల్లెలు. ఈవిడ స్వస్థలం [[కార్వేటినగరం]]. చిత్తూరు నాగయ్య ప్రోత్సాహంతో సినిమా రంగ ప్రవేశం చేసింది. ఈమె నటించిన మొట్ట మొదటి సినిమా [[చూడామణి]]. [[మాయలోకం]] అనే సినిమా ఈమెకు మంచిపేరు తెచ్చింది. [[అక్కినేని నాగేశ్వరరావు]]తో జోడీగా [[ముగ్గురు మరాఠీలు]] సినిమాలో నటించింది. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఆలపించిన తొలి యుగళ గీతానికి ఈమె హీరోయిన్‌గా నటించింది. [[పాతాళభైరవి]], [[మల్లీశ్వరి]] (హీరోయిన్ ఇష్టసఖి జలజ) లాంటి హిట్‌ సినిమాల్లో నటించింది. ఈమె మల్లీశ్వరిలో కొన్ని పాటలు పాడడంతో పాటు, తరువాతి కాలంలో అనేక మంది నటీమణులకు డబ్బింగ్‌ చెప్పింది. తెలుగుతో[[తెలుగు]]తో పాటు అనేక [[తమిళం|తమిళ]] సినిమాల్లో కూడా ఈమె నటించింది.
 
కమలాదేవి ఆగస్టు 16, 2012 న చెన్నైలో మరణించింది.
 
==వ్యక్తిగతం==
టి.జి.కమలాదేవి [[1930]], [[డిసెంబర్‌ 29]]వ తేదీన [[చిత్తూరు జిల్లా]] [[కార్వేటినగరం]]లో జన్మించింది. ఈమె తల్లి లక్ష్మమ్మ, తండ్రి కృష్ణస్వామి నాయుడు. కమలాదేవికి ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు. తండ్రి వ్యాపారపరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవడంతో కుటుంబ సమేతంగా నివాసాన్ని [[కార్వేటినగరం]] నుండి [[పుత్తూరు]]కు మార్చాడు. తండ్రికి పుత్తూరులో[[పుత్తూరు]]లో అటవీ శాఖలో పని దొరికింది. కమలాదేవి పుత్తూరు ప్రభుత్వ పాఠశాలలో థర్డ్‌ఫారం వరకు చదివింది. క్రిస్టియన్‌ మిషనరీ తిరిగి ఐదవక్లాస్‌ స్కూల్లో చదివింది. ఏడో ఏట నుండి తల్లి లక్ష్మమ్మ ప్రోత్సాహంతో శాస్త్రీయ సంగీతం నేర్చుకుంది. ప్రముఖ గాత్ర విద్వాంసుడు '''చెంచురామయ్య''' ఈమెకు గురువు. సుమారు మూడేళ్ళ పాటు చెంచుామయ్య వద్ద కమాలాదేవి సంగీతాన్ని అభ్యసించింది. ఈవిడ దాదాపు వంద కీర్తనలు, శృతులు పాడింది.
 
పాఠశాల, [[సంగీతం|సంగీతానికి]] తోడుగా బాల్యం నుండి నాటకాల్లో కూడా నటించింది. ఓసారి కమలాదేవి ''జ్ఞాన సుందరి'' నాటకంలో నటిస్తుండగా నాగయ్యతో పాటు పలువురు ప్రముఖులు ఆ నాటకం చూసారు. మరో సంఘటనలో ''సక్కుబాయి'' నాటకంలో ఈమె నటనకు ముగ్ధుడైన [[పిఠాపురం]] రాజా బంగారపు గొలుసు బహూకరిస్తానని చెప్పినా, సమయానికి ఆయన మెడలో గొలుసు లేకపోవడంతో, మరో కార్యక్రమంలో గొలుసును బహూకరించాడు. [[ఆంధ్ర]] సెక్రటరియేట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో [[గుజరాత్]], [[రాజస్థాన్]] రాష్టాల్లో రుక్సానా పాత్రను కమలాదేవి 25 సార్లు ధరించింది.
 
==బాల్యం==
ఎనిమిదేళ్ళ వయసులో ఎవిఎం వారి ''నాటి సరస్వతి స్టార్స్‌'' తరపున ఓపెన్‌ రికార్డింగ్‌లో ఓ పాట పాడేందుకు తొలిసారిగా [[చెన్నై]] వెళ్ళింది. [[టి.చలపతిరావు]] ఈమెకు ''నేను కనలేని జీవితము...'' అనే పాటను సుమారు 20 రోజుల పాటు నేర్పించి ఓపెన్‌ రికార్డింగ్‌లో పాడించాడు. చిన్న వయస్సులోనే ''కనకతార'', ''భూపుత్రి'', ''ఐదు పువ్వుల రాణి'' వంటి పలు నాటకాల్లో ఈవిడ నటించింది. ఈమెకు చిన్నతనం నుండి సినిమాలంటే ఆసక్తి, ఇష్టం ఉండేది. అక్క జయమ్మ వివాహం [[చిత్తూరు నాగయ్యతోనాగయ్య]]తో జరగడంతో ఈవిడ మిగతా బాల్యం [[చెన్నై]] లోని [[మైలాపూర్]], మాంబళంలలో[[మాంబళం]]లలో వారింట్లో కొనసాగింది. అప్పట్లోనే [[చెన్నై]] [[ఆకాశవాణి]] కేంద్రంలో సంగీత, పౌరాణిక నాటకాలలో, లైట్ మ్యూజిక్ కచేరిలలోను తన ప్రతిభ కనబరిచింది.
 
==బహుముఖ ప్రఙ్ఞాశాలి==
"https://te.wikipedia.org/wiki/టీ.జి._కమలాదేవి" నుండి వెలికితీశారు