హుజూర్‌నగర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal|latd=16.895558|longd=79.872623|native_name=హుజూర్‌నగర్||district=నల్గొండ|mandal_map=Nalgonda mandals outline47.png|state_name=తెలంగాణ|mandal_hq=హుజూర్‌నగర్|villages=7|area_total=|population_total=60426|population_male=30177|population_female=30249|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=61.90|literacy_male=72.91|literacy_female=50.50|pincode = 508204}}
'''హుజూర్‌నగర్''', [[తెలంగాణ]] రాష్ట్రంలోని [[నల్గొండసూర్యాపేట జిల్లా]]కు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 508204. హుజూర్ నగర్‌కు పూర్వము పోచంచర్ల అనే పేరు ఉండేది. హుజూర్ అనే నవాబు దీన్ని పాలించడంవల్ల హూజూర్ నగర్ అని పేరు వచ్చింది. 1977 వరకు హుజూర్ నగర్ శాసనసభా నియోజకవర్గముగా ఉండేది. అయితే 1977 నియోజకవర్గాల పునర్వ్యస్థీకరణలో ఈ నియోజకవర్గాన్ని రద్దుచేశారు. కానీ తిరిగి 2007లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఈ నియోజకవర్గాన్ని 2009లో శాసనసభా ఎన్నికలకు పునరుద్ధరించారు.
 
హుజూర్ నగర్లో రామాలయము, ముత్యాలమ్మ గుడి, దుర్గ గుడి, షిర్డీ సాయిబాబా గుడి ఉన్నవి. పట్టణములో ప్రతి సంవత్సరమూ నిర్వహించే ముత్యాలమ్మ జాతర ప్రసిద్ధి చెందినది. హుజూర్ నగర్ సీతారామచంద్రస్వామి ఆలయము 900 సంవత్సరాల పురాతనమైనది. జీర్ణావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని ఇటీవలే కొందరు స్థానిక దాతల సహాయముతో పునరుద్ధరించారు.
"https://te.wikipedia.org/wiki/హుజూర్‌నగర్" నుండి వెలికితీశారు