పసివాడి ప్రాణం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా (2) using AWB
సుజిత లింకు మార్పు
పంక్తి 28:
==కథ==
 
మాట్లాడలేని, వినపడని ఒక పిల్లాడి ([[సుజిత|బేబి సుజిత]]) తల్లిదండ్రులను వేణు ([[రఘువరన్]]) అతని స్నేహితుడు కలసి హత్య చేస్తారు. మూగసాక్షి అయిన ఆ పిల్లాడిని కూడా అంతం చేయాలనుకొన్న వారి నుండి ఆ బాలుడు తప్పించుకు పారిపోతాడు. పెళ్ళి జరిగిన రోజునే ప్రేయసి ([[సుమలత]])ని కోల్పోయిన పెయింటర్ మధు ([[చిరంజీవి]]) తాగుబోతుగా మారతాడు. రోడ్డుపై నిద్రపోతున్న ఆ బాలుడిని చేరదీసి రాజాగా పిలుచుకొంటుంటాడు. ఆ బాలుడి ద్వారా మధుకి గీత ([[విజయశాంతి]]) అనే యువతి పరిచయం అవుతుంది. మధుని ప్రేమిస్తూ ఉంటుంది.
 
రాజాని వెదుకుతూ మధు ఇంటికి వచ్చి బాబుని చంపాలని చుస్తాడు వేణు స్నేహితుడు. తప్పతాగి మైకంలో పడి ఉన్న మధు చివరి నిముషంలో బాబుని రక్షించుకొంటాడు. బాబుని చంపటానికి వచ్చినతని చిత్రం గీసి బాబు నుండి నిజాలను రాబట్టే ప్రయత్నం చేస్తూంటాడు మధు. జంట హత్యల, బాలుడి అపహరణ కేసుని మధు పై మోపుతాడు ఆ కేసుల్ని విచారిస్తున్న పోలీసు ఇన్స్ పెక్టర్ ([[కన్నడ ప్రభాకర్]]). రాజా తన అక్క కొడుకే అని తెలుసుకొంటుంది గీత. ద్రోహులని మధు ఎలా కనిపెట్టాడన్నదే చిత్రం లోని తరువాయి కథ.
"https://te.wikipedia.org/wiki/పసివాడి_ప్రాణం" నుండి వెలికితీశారు