"కైకాల సత్యనారాయణ" కూర్పుల మధ్య తేడాలు

(భాషా సవరణలు, +లింకులు)
తన గంభీరమైన కాయంతో, కంచు కంఠంతో, సినిమాల్లో వేషాల కోసం సత్యనారాయణ [[మద్రాసు]] వెళ్ళాడు. ఆయన్ని మొదట గుర్తించింది [[డి.యల్.నారాయణ]]. [[1959]] లో నారాయణ [[సిపాయి కూతురు]] అనే సినిమాలో సత్యనారాయణకు ఒక పాత్ర ఇచ్చాడు. దానికి దర్శకుడు చంగయ్య. ఆ సినిమా బాక్సు ఆఫీసు దగ్గర బోల్తాపడినా సత్యనారాయణ ప్రతిభను గుర్తించారు. అలా గురించటానికి ఆసక్తి గల కారణం, ఆయన రూపు రేఖలు [[యన్.టి.ఆర్]] ను పోలి ఉండటమే. యన్.టి.ఆర్ కు ఒక మంచి నకలు దొరికినట్లు అయింది. అప్పుడే యన్.టి.ఆర్ కూడ ఈయన్ని గమనించారు. [[1960]] లో యన్.టి.ఆర్ తన [[సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి]] లో ఈయనకి ఒక పాత్రనిచ్చారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించినవారు [[యస్.డి.లాల్]]. ఈ సినిమాలో సత్యనారాయణ యువరాజు పాత్ర వేసాడు.
 
సత్యనారాయణను ఒక ప్రతినాయకుడుగా చిత్రించవచ్చు అని కనిపెట్టినది [[విఠాలాచార్యవిఠలాచార్య]]. ఇది సత్యనారాయణ సినిమా జీవితాన్నే మార్చేసింది. విఠలాచార్య సత్యనారాయణ చేత ప్రతినాయకుడుగా [[కనక దుర్గ పూజా మహిమ]] లో వేయించాడు. ఆ పాత్రలో సత్యనారాయణ సరిగ్గా ఇమడటంతో, తర్వాతి సినిమాల్లో ఆయన ప్ర్రతినాయకుడుగా స్థిరపడి పోయాడు.
 
ప్రతినాయకుడిగా తన యాత్ర కొనసాగిస్తూనే, సత్యనారాయణ కారెక్టర్ పాత్రలు కూడా వేసారు. ఇది ఆయన్ని సంపూర్ణ నటుడిని చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు సత్యనారాయణ లాంటి ఒక విలక్షణ నటుడు దొరకటం ఒక వరం. ఈయన వెయ్యని పాత్ర అంటూ లేదు. ఆయన ఏపాత్ర వేసినా ఆ పాత్రలో జీవించాడు. ఆయన [[యమగోల]] మరియు [[యమలీల]] చిత్రాల్లో యముడిగా వేసి అలరించాడు. [[కృష్ణుడు|కృష్ణుడి]]గా, [[రాముడు|రాముడి]]గా యన్.టి.ఆర్ ఎలానో, [[యముడు|యముడిగా]] సత్యనారాయణ అలా!
1,366

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/200352" నుండి వెలికితీశారు