"ముదిగొండ లింగమూర్తి" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వళ్ల → వల్ల using AWB
చి (Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q6931806 (translate me))
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వళ్ల → వల్ల using AWB)
 
==సినిమా రంగం==
నాటకరంగం మీద అన్ని రకాల పాత్రలూ ధరించి, పేరుతెచ్చుకుని, సినిమా రంగంలో ప్రవేశించారు లింగమూర్తి. [[తుకారామ్‌]] (1937) లో నటించినా [[వందేమాతరం]] (1939) తో అందరికీ తెలిసారాయన. రంగస్థలం మీద పౌరాణిక, చారిత్రాక, సాంఘిక నాటకాల్లో నటించినట్టుగానే, తెరమీద కూడా నటించారు. [[బి.ఎన్‌.రెడ్డి]] దర్శకత్వంలో వాహిని సంస్థ నిర్మించిన తొలి చిత్రం [[వందేమాతరం]] - వాహిని బృందంతో లింగమూర్తినీ కలిపింది. ఆయనా, ఆ యూనిట్‌లో ఒకరైనారు. వేషం వున్నా లేకపోయినా, నిర్మాణవ్యవహారాల్లో పాలుపంచుకునేవారు. కొంతకాలం అధికారికంగా ప్రొడక్షన్‌ మేనేజరుగా వ్యవహరించారు.
 
క్రూరపాత్ర ధరించినా, అక్రూరపాత్ర ధరించినా, హాస్యపాత్ర ధరించినా నటనలో దేనికదే భిన్నంగా వుండేది. వివిధ భూమికానిర్వహణ సమర్థుడు అనిపించుకున్నాడు లింగమూర్తి. తమిళ చిత్రం ఆధారంగా నిర్మించిన [[ఆడజన్మ]]లో అతిగా నటించారన్న పేరు తెచ్చుకున్నారు. తరువాత అది పాత్ర మరియు పరిస్థితి కారణంగా అలా చేశానని చెప్పుకొన్నారు
 
==ఇతర విశేషాలు==
నిజానికి దర్శకుడు చెప్పింది వేదం. అతను చెప్పింది చెయ్యాలి. కాని మనం కూడా ‘కన్విన్స్‌’ కావాలిగదా! గుడ్డిగా వెళ్లడం నాకు చేతకాదు. అది డిసిప్లిన్‌కి విరుద్ధయమైతే నేనేం చెయ్యలేను. ఒకసారి బి.ఎన్‌.రెడ్డితోనే వచ్చింది. ‘స్వర్గసీమ’లో నేను భానుమతి తండ్రిని. పల్లెటూరివాడిని. హాస్యంపాలు కూడా వున్న పాత్ర అది. హీరోని వల్లో వేసుకోవాలని కూతురితో చెప్పే సన్నివేశం వుంది. ‘ఎన్నాళ్లని ఈ బిగువు? వాడేం దయ్యమా, రాక్షసుడా? దగ్గరకెళ్లి అంతా సరిచేసుకో’ అని డైలాగు. అందులో నాకు చమత్కారం కనిపించలేదు. ఆ మాటే బి.ఎన్‌.తో అంటే కస్సుమని లేచాడాయన. ‘చమత్కారం ఏం చేస్తావో చేసి చూపించు!’ అని కోపంగా అన్నాడు. ‘నేను చెప్తాను బాగుంటే వుంచండి - లేకపోతే ఉన్నదే చెప్తాను’ అన్నాను. ‘చెప్పు’ అన్నట్టు మొహం పెట్టారు డైరెక్టరు ధుమధుమలాడుతూనే. ‘వాడేం పులా, సింగమా?’ అని ‘వూ’ అని చమత్కారంగా అన్నాను. ‘వూ’ అనడంలో ఒక చమత్కారం వచ్చింది. డైరెక్టరూ, రైటరూ సరే అన్నారు. సినిమాలో ఆ మార్పు బాగానే పట్టుకుంది జన్నాని‘ అని ఒక సందర్భంలో చెప్పారు లింగమూర్తి. ’అందుకే కొందరు దర్శకులూ, నిర్మాతలూ నా జోలికిరారు. పోనీ! అనేవారాయన.
 
[[నర్తనశాల]] (1963) లో శకుని వేషానికి లింగమూర్తిని అడిగారు. ‘అప్పుడు నాకు వేషాలులేవు. ఖాళీగానే వున్నాను. అంచేత డబ్బు తగ్గించమన్నారు. నేను తగ్గించనన్నాను. ’నాకు సినిమాలు తగ్గవచ్చు కాని, నా టాలెంట్‌ తగ్గలేదు. మీరిచ్చే డబ్బు నా టాలెంట్‌కి!‘ అని చెప్పేశాను’ అని చెప్పారొకసారి.
‘యాక్షన్‌ కంటె రియాక్షన్‌ కష్టం. మన రియాక్షన్‌ బాగుంటే, అవతలి నటుడి యాక్షనూ మెరుగుపడుతుంది’ అని చెప్పేవారా మహానటుడు. ఆయన రేడియో నాటకాల్లో కూడా తరుచూ పాల్గొనేవారు. ‘అక్కడ వాచకమే ప్రధానం. కళ్లతోనూ, చేతులతోనూ చేసే నటనంతా ఒక్క కంఠంతో చెయ్యాలి. దాని కష్టం దానికుంది’ అని చెప్పేవారు. పానగల్‌ పార్కుకి సాయంకాలం పూట కాలక్షేపం కోసం వెళ్లినా, మిత్రులతో సంభాషించినా ‘ప్రయోజనం’ కనిపించకపోతే నిష్క్రమించేవారాయన.
==అవసాన దశ==
1960లలో షష్టిపూర్తి తర్వాత లింగమూరి వయోభారం వళ్లవల్ల సినీరంగం నుండి విరమించాడు. 1974లో భార్య చనిపోయిన తర్వాత పూర్తిగా సన్యాసాశ్రమం పుచ్చుకొని వారణాసిలో జీవించసాగాడు.. ఈయన 1980 జనవరి 24న వారణాసిలో మరణించాడు<ref>[http://www.cinegoer.com/sskarticles/lingamurthy2.htm A Compelling Character Actor - Lingamurthy (Part II)] - Satyasai Karavadi</ref>
 
==వనరులు==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2003567" నుండి వెలికితీశారు