సామినేని ముద్దుకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

Muddu_Krishna.JPGను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Jcb. కారణం: (Missing source as of 1 April 2016 - Using VisualFileChange.).
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి , → (2), ( → ( using AWB
పంక్తి 1:
{{మొలక}}
 
 
[[File:Vaitalikulu.jpg|thumb|right|వైతాళికులు పుస్తక ముఖచిత్రం.]]
'''ముద్దుకృష్ణ''' పేరు చెప్పగానే మొదట మనకు స్ఫురించేది ఆయన సమకూర్చిన కవితాసంకలనం, [[వైతాళికులు]]. ముద్దుకృష్ణ [[స్వామినేని ముద్దునరసింహంనాయుడు]] కి [[ముని మనుమడు]] మరియు [[హేతువాది]]. [[అశోకం]] నాటకం వ్రాశాడు. రావణ వధ తరువాత అగ్ని ప్రవేశం చేయమన్న రాముడికి సీత ఎదురు తిరిగి "నీవు పురుష రూపంలో ఉన్న స్త్రీవి. నన్ను కాపాడుకోలేక పోయావు...."అని నిలదీసినట్లు రాస్తాడు. చిన్నతనంలోనే తెలుగు సాహిత్యంలో ముద్దుకృష్ణకున్న అభిరుచిని పసికట్టిన తండ్రిగారు మనుచరిత్ర, వసుచరిత్ర బోధించాడు. స్కూల్ ఫైనల్ చదివే నాటికి ఆంగ్ల సాహిత్యంలో కూడ ఆసక్తి పెరిగి, "మర్చంట్ ఆఫ్ వెనిస్" నాటకంలో అభినయించే స్థితికి వచ్చాడు. కాలేజి చదువు కాకినాడలో [[రఘుపతి వెంకటరత్నం నాయుడు]] వద్ద కొంతకాలం జరిగింది. భావకవితా యుగానికి చెందిన [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]], [[చింతా దీక్షితులు]], తల్లావజ్ఝల శివశంకర శాస్త్రి మొదలగు వారితో సాన్నిహిత్యం; కళాశాలల్లోని ఇంగ్లీషు నాటక ప్రదర్శనలూ, స్థానిక నాటక సమాజాల తెలుగు నాటక ప్రదర్శనలూ, సుప్రసిద్ధ కవీ, నటుడూ, హరీన్ చటోపాధ్యాయతో కలిసి 1927 ప్రాంతాలలో కళాప్రదర్శనలూ ముద్దుకృష్ణలో నాటక రచనకు ప్రేరేపించాయి. "అశోకం" నాటకం ద్వారా ముద్దుకృష్ణ అపూర్వసంచలనం కలిగించాడు. ముద్దుకృష్ణ బ్రహ్మచారి; ఈ బ్రహ్మచారి వ్రాసిన "దాంపత్య దీపిక" ఎందరి ప్రశంసనలనో పొందింది. ఈయన వ్రాసిన అనార్కలి నాటిక ఆకాశవాణిలో ప్రసారమైన తొలి తెలుగు శ్రవ్యనాటికగా (1934) ప్రసిద్ధి చెందింది. 1934 లో ప్రారంభించిన "జ్వాల" పత్రిక యువకులలో కొత్త ఆలోచనలను రేపింది. ఈయన అపవాదు, టీకప్పులో తుఫాను, ఢాకినీ, ఎత్తుకు పై ఎత్తు, ఆడవాళ్ల తెలివి, అడయిక్కప్ప పిళ్ళై (1941 తొలి ముద్రణ) వంటి నాటకాలు రచించారు.<ref>{{cite book|last1=ముద్దుకృష్ణ|title=అడయిక్కప్పపిళ్ళై|date=1941|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Adaikkappapille&author1=muddhu%20krishna&subject1=literature&year=1941%20&language1=TELUGU&pages=120&barcode=2020010002602&author2=&identifier1=&publisher1=uma%20publishers&contributor1=CCL&vendor1=NONE&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=NONE&sourcelib1=Sri%20Potti%20Sriramulu%20Telugu%20University&scannerno1=&digitalrepublisher1=PAR%20Informatics,%20Hyderabad&digitalpublicationdate1=&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data7/upload/0189/423|accessdate=2 January 2015}}</ref>
 
;ఈయన ప్రచురించిన "వైతాళికులు"లో చోటు చేసుకొన్న కవులు :
Line 9 ⟶ 8:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:తెలుగు వ్యక్తులు]]
[[వర్గం:1889 జననాలు]]