మురళీధర్ దేవదాస్ ఆమ్టే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , చినాడు → చాడు, చినది. → చింది., → , ) → ) using AWB
పంక్తి 17:
}}
 
'''బాబా ఆమ్టే''' (Baba Amte) (Marathi: बाबा आमटे) ([[డిసెంబర్ 26]], [[1914]] - [[ఫిబ్రవరి 9]], [[2008]]) సంఘసేవకుడు. అతని అసలు పేరు మురళీధర్ దేవదాస్ ఆమ్టే. ప్రముఖ సంఘసేవకుడిగా ప్రసిద్ధిగాంచిన బాబా ఆమ్టే ముఖ్యంగా [[కుష్టు]] రోగుల పాలిట దేవుడిగా మారినాడు. కుష్టురోగుల సేవలకై [[చంద్రాపూర్]] జిల్లాలో [[ఆనంద్‌వన్]] ఆశ్రమాన్ని స్థాపించి అతను కూడా వారితోపాటే అక్కడే జీవితాన్ని గడిపి [[2008]], [[ఫిబ్రవరి 9]]న తన ఆశ్రమంలోనే మృతి చెందిన మహనీయుడు. ఉన్నత కుటుంబంలో జన్మించి భోగభాగ్యాలను వదిలి అణగారిన వర్గాల మేలు కొరకై జీవితాంతం కృషిసల్పిన అతని కృషి మరవలేనిది. అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అతడు చేసిన సేవలకు గుర్తింపుగా లభించాయి.
 
==తొలి జీవితం==
[[డిసెంబర్ 26]], [[1914]] లో [[మహారాష్ట్ర]]లోని [[వార్థా]] జిల్లా [[హింగన్‌ఘాట్‌]]లో ఒక ఉన్నత బ్రాహ్మణ జాగిర్దార్ కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలోనే బాబాగా పిల్వబడ్డాడు. బాబా అనేది ఎవరో ప్రధానం చేసిన బిరుదు కాదు అది తల్లిదండ్రులు పెట్టిన ముద్దుపేరు.<ref name="rediff.com">http://www.rediff.com/freedom/amte3.htm</ref> అతని అసలు పేరు మురళీధర్ దేవదాస్ అమ్టే కాగా అందరిచే బాబా ఆమ్టే గానే పిల్వబడ్డాడు. న్యాయశాస్త్రంలో శిక్షణ పొందిన తరువాత వార్థాలో న్యాయ అభ్యాసం ప్రారంభించాడు. అదే సమయంలో భారత జాతీయోద్యమ పోరాటం జరుగుతుండేది. [[క్విట్ ఇండియా]] ఉద్యమ సమయంలో అరెస్ట్ కాబడిన జాతీయ నేతల తరఫున కోర్టులలో వాదించేవాడు. క్రమక్రమంగా [[మహాత్మా గాంధీ]] వైపు ఆకర్షితుడైనాడు. గాంధీజీతో పాటు కొంత కాలం [[సేవాగ్రం ఆశ్రమం]]లో గడిపినాడు. ఆ తరువాత జీవితాంతం వరకు గాంధీజీ సిద్ధాంతాలకే కట్టుబడినాడు. వేషధారణలో కూడా గాంధీజీ వలె ఖద్దరు దుస్తులనే వాడేవాడు. గాంధీజీ వలె జీవితాంతం అణగారిన వర్గాల కృషికై పాటుపడ్డాడు.
==వివాహం==
[[1946]]లో బాబాఆమ్టే సాధన గులేశాస్త్రిని వివాహం చేసుకున్నాడు. తరువాత కాలంలో ఆమె సమాజ సభ్యులచే సాధనతాయ్ (మరాఠీలో తాయ్ అనగా పెద్దక్క) గా పిలువబడింది. వారికి వికాస్ మరియు ప్రకాష్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఆ ఇద్దరు కూడా తండ్రి వలె సమాజసేవకై పాటుపడుతున్నారు.<ref>http://mss.niya.org/people/amte.php</ref>
 
==ఆనంద్‌వన్==
బాబా ఆమ్టే స్థాపించిన మూడు ఆశ్రమాల్లో ఆనంద్‌వన్ మొదటిది. కుష్టురోగుల సంక్షేమానికి [[మహారాష్ట్ర]]లోని [[చంద్రాపుర్]] జిల్లాలో ఈ ఆశ్రమాన్ని [[1951]]లో స్థాపించాడు. ఆనంద్‌వన్ అనగా అర్థం ఆనందపు అడవి (Forest of Joy). వరోరాకు దగ్గరలోని అటవీ ప్రాంతంలో 50 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ప్రారంభించాడు. అది క్రమక్రమంగా పెద్దదై నేడు 500 ఎకరాలకు విస్తరించినదివిస్తరించింది. ఆ రోజులలో కుష్టురోగులకు సమాజం నుంచి వెలివేసేవారు. అలాంటి వారి కొరకు ఆశ్రమాన్ని స్థాపించి కుష్టురోగులను చేరదీసి వారితో పాటు అతడు కూడా అక్కడే వారి సంక్షేమం చూస్తూ గడపటం గొప్పవిషయం. కుష్టువ్యాధి ఒక అంటురోగమని, కుష్టురోగులను తాకినా ఆ వ్యాధి వస్తుందనే ప్రచారంలో ఉన్న సమయంలో బాబాఆమ్టే ఆ వదంతులను త్రిప్పికొట్టడానికి స్వయంగా ఒక కుష్టురోగి నుంచి బాసిల్లి క్రిములను తన శరీరంలో ఇంజెక్షన్ ద్వారా ఎక్కించుకున్నాడు.<ref>http://www.rediff.com/news/2008/feb/09amte2.htm?zcc=rl</ref>
కుష్టురోగులకై బాబాఆమ్టే తదనంతరం సోమనాథ్ మరియు అశోకవన్ ఆశ్రమాలను కూడా స్థాపించినాడుస్థాపించాడు. సమాజసేవ విషయంలో ఆనంద్‌వన్ ఆశ్రమం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. ఆనంద్‌వన్ కై బాబాఆమ్తేకు [[1983]]లో డేమియన్ డట్టన్ లెప్రసీ సంస్థనుంచి డేమియన్ డట్టన్ అవార్డు కూడా లభించింది. ప్రస్తుతం ఆనంద్‌వన్ రెండు ఆసుపత్రులను, ఒక విశ్వవిద్యాలయాన్ని, ఒక అంధుల కొరకు పాఠశాలను, ఒక అనాథశరణాలయాన్ని కలిగిఉంది. ఈ ఆశ్రమంలో ప్రస్తుతం 5000కు పైగా నివసిస్తున్నారు.<ref name="rediff.com"/>
 
==బాబా ఆమ్టే మరియు గాంధీజీ సిద్ధాంతాలు==
పంక్తి 51:
* [[1989]] : అంతర్జాతీయ జిరాఫీ అవార్డు.
* [[1990]] ; టెంపుల్టన్ అవార్డు.
* [[1991]] : రైట్ లివ్లీహుడ్ అవార్డ్ (ఈ అవార్డు ప్రత్యమ్నాయ నోబెల్ బహుమతిగా పేరుపొందింది) <ref>"Alternative Nobel Prize" awarded in Sweden. 8 December 2006. [http://www.newsahead.com/PREVIEW/alternative_Nobel_award_Dec_06.htm ''NewsAhead World News Forecast'' story]</ref><ref>[http://in.news.yahoo.com/ani/20080209/r_t_ani_nl_general/tnl-president-pratibha-patil-manmohan-si-99cbaa1.html President Pratibha Patil, Manmohan Singh condole Baba Amte's death] - Yahoo! India News</ref>
* 1991 : ఆదివాసీ సేవక్ అవార్డు.
* [[1992]] : మహారాష్ట్ర ప్రభుతపు అంబేద్కర్ దళిత్ మిత్ర అవార్డు