మొదలి నాగభూషణశర్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, లో → లో (2), స్వేచ్చ → స్వేచ్ఛ, → (2), ) → ) using AWB
పంక్తి 1:
[[File:Modhali Nagabhushana Sharma.jpg|thumb|మొదలి నాగభూషణశర్మ (ముఖచిత్రం) ]]
'''మొదలి నాగభూషణ శర్మ''' నటుడు, దర్శకుడు, నాటకకర్త, అధ్యాపకుడు, విమర్శకుడు మరియు పరిశోధకుడు. నాగభూషణ శర్మ 1936 జులైజూలై 24 తేదీన [[గుంటూరు జిల్లా]] [[ధూళిపూడి]] గ్రామంలో జన్మించాడు. ఇతని తల్లి కామేశ్వరమ్మ. తండ్రి సుబ్రహ్మణ్యశర్మ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. ఈయన తండ్రి కూడా స్వయంగా నాటక రచయిత, ప్రయోక్త మరియు కథా రచయిత. ఈయన స్ఫూర్తి వల్లనే నాగభూషణ శర్మ నాటకరంగంలోకి వచ్చాడు. తండ్రి నేతృత్వంలో ఎనిమిదవ ఏటనే రంగస్థలంపై తొలిపాఠాలు నేర్చిన శర్మ కాలేజీ రోజుల్లో బందరులో [[కన్యాశుల్కం]] నాటకంలో మధురవాణి పాత్రను ధరించి ప్రసిద్ధుడయ్యాడు. కళాశాలలో చదువుతుండగానే ఆయన తొలి రచన అన్వేషణ 1954లో [[భారతి]]లో ప్రచురితమైంది.
 
[[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] లో ఎం.ఏ ఆంగ్ల సాహిత్య పట్టభద్రుడై నాగభూషణ శర్మ, అమెరికాలోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో నాటకదర్శకత్వంలో ఎం.ఎఫ్.ఏ పట్టా పొందాడు. నాటకమే ప్రధానాశంగా పరిశోధన చేసి డాక్టరేటు అందుకున్నాడు. ఆ తరువాత [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] లో ఇంగ్లీషు శాఖ లోను, నాటక శాఖ లోను ఆచార్యుడిగా పనిచేశాడు.
 
విదేశాలలో పర్యటించి, వివిధ నాటక ప్రయోగ రీతుల్ని అధ్యయనం చేసి శిక్షణ పొందాడు. నవల, నాటక సాహిత్యానికి చెందిన అనేక పరిశోధనాత్మక వ్యాసాలు పత్రికల్లో ప్రకటించాడు.
 
ది విజిట్, కింగ్ ఈడిపస్, హయవదన, తుగ్లక్, మృచ్ఛకటిక, వెయిటింగ్ ఫర్ గోడో వంటి గ్రీకు, సంస్కృత, ఆంగ్ల నాటకాలకు దర్శకత్వం వహించి హైదరాబాదు డ్రమటిక్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రదర్శించారు. అడ్డదారి, పెళ్ళికి పది నిమిషాల ముందు, మదనకామరాజు కథ, ప్రజానాయకుడు ప్రకాశం వంటి స్వతంత్ర నాటకాలను, యాంటిగని, మాక్‌బెత్, డాల్స్‌హౌస్, ఎనిమీ ఆఫ్‌ది పీపుల్, ఎంపరర్‌జోన్స్, వెయిటింగ్ ఫర్ గోడో, కాయితం పులి, హయవదన, సాంబశివ ప్రహసనం వంటి గొప్ప పాశ్చాత్య, భారతీయ ప్రముఖ నాటకాలను స్వేచ్చానువాదంస్వేచ్ఛానువాదం చేశారు. ప్రజా నాయకుడు ప్రకాశం నాటకాన్ని దేశవ్యాప్తంగా ప్రదర్శించారు.
 
విషాదాంతం, జంట పక్షులు, సంభవామి, నరజాతి చరిత్ర, మన్మధుడు మళ్లీ పుట్టాడు, రాజా ఈడిపస్ (అనువాదం), [[ప్రజానాయకుడు ప్రకాశం]] మొదలైన నాటకాలను, అన్వేషణ, అడ్డదారి, ఆగస్టు 15, జననీ జన్మభూమి, రాజదండం మొదలైన నాటికలను రచించాడు. ఈయన దాదాపు 70 నాటకాలు, నాటికలు మరియు రేడియో నాటికలు వ్రాశారు. స్వతంత్ర నాటకాలే కాక అనేక అనువాద నాటకాలు కూడా వ్రాశాడు. ఈయన దర్శకత్వంలో ఇరవైకి పైగా ఆంగ్ల నాటకాలు, అరవైకి పైగా తెలుగు నాటకాలు ఈయన దర్శకత్వంలో ప్రదర్శించబడ్డాయి.
"https://te.wikipedia.org/wiki/మొదలి_నాగభూషణశర్మ" నుండి వెలికితీశారు