యాగా వేణుగోపాలరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవిస్తున్న ప్రజలు తొలగించబడింది; వర్గం:ఆర్థిక వేత్తలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయో...
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్థంభ → స్తంభ, ) → ) using AWB
పంక్తి 36:
}}
 
భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్థంభమైనమూలస్తంభమైన [[రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా]] గవర్నరుగా ఐదేళ్ళు పనిచేసి [[2008]] [[ఆగస్టు]]లో పదవీవిరమణ చేసిన''' డా. వై.వి.రెడ్డి''' పూర్తి పేరు '''యాగా వేణుగోపాల్ రెడ్డి'''. రిజర్వ్ బ్యాంకు ఇరవై ఒకటవ గవర్నరైన వై.వి.రెడ్డి [[1964]] బ్యాచ్ కు చెందిన IAS ([[ఐ.ఏ.ఎస్]]) అధికారి. ఆయన ఉద్యోగ జీవితం దాదాపు పూర్తిగా ఆర్థిక, ప్రణాళికా రంగాల్లోనే సాగింది.
==వ్యక్తిగత వివరాలు==
[[1941]] [[ఆగస్టు 17]]న [[వైఎస్ఆర్ జిల్లా]] [[పుల్లంపేట]] మండలం [[కొమ్మనవారిపల్లె]] గ్రామంలో జన్మించాడు. ఈయన తండ్రి యాగా పిచ్చిరెడ్డి ఆ రోజుల్లోనే అప్పటి ఉమ్మడి [[మద్రాసు రాష్ట్రం]]లో ఎన్నో ఉన్నత పదవుల్లో బాధ్యతలు నిర్వహించాడు. [[నంద్యాల]] [[కలెక్టర్‌]]గా కూడా ఆయన పనిచేశాడు. ఆయన వృత్తిరీత్యా [[మద్రాసు]]లో స్థిరపడడం వల్ల వేణుగోపాల్‌రెడ్డి చదువంతా [[తమిళనాడు]]లోనే సాగింది.
==వృత్తి జీవితం==
వేణుగోపాల్‌రెడ్డి IAS అధికారి కాకముందు [[1961]] నుంచి లెక్చరర్ గా పనిచేశాడు. [[మద్రాసు విశ్వవిద్యాలయం]]లో [[ఆర్థిక శాస్త్రం]]లో M.A., [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో Ph.D., [[నెదర్లాండ్స్]] లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషియల్ స్టడీస్ లో ఆర్థిక ప్రణాళిక (Economic Planning) లో డిప్లొమా చేశాడు. అవే కాకుండా [[శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం]] (Doctor of Letters), [[మారిషస్ విశ్వవిద్యాలయం]] (Doctor of Civil Law) ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం (Department of Business Management) లోను, [[లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్]] (London School of Economics and Political Science - International Relations Department) లోనూ, Administrative Staff College of India లోనూ విజిటింగ్ ఫాకల్టీగా పనిచేసిన వై.వి.రెడ్డి [[హైదరాబాదు]]లోని CESS (Center for Economic and Social Studies) లో Honorary Senior Fellow గా కొనసాగుతున్నాడు.
 
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో (బ్యాంకింగ్) కార్యదర్శిగా, సంయుక్త కార్యదర్శి గా, వాణిజ్య మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శిగా, ఆపైన [[1996]] నుంచి ఏడేళ్ళు రిజర్వ్ బ్యాంకు డిప్యూటీ గవర్నరుగా సేవలందించాడు. రిజర్వ్ బ్యాంకు గవర్నరు కాకముందు [[ప్రపంచ బ్యాంకు]] సలహాదారుగా, [[అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ]] (IMF) బోర్డులో భారతదేశం తరపున ద్రవ్య వ్యవహారాల సలహాదారుగా పనిచేసిన రెడ్డి 2002లో IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా నియమితుడయ్యాడు. ఆర్థికాభివృద్ధి పథంలో ఈయన సలహాలను వినియోగించుకున్న దేశాల్లో [[చైనా]], [[బహ్రెయిన్]], [[ఇథియోపియా]], [[టాంజానియా]], తదితర దేశాలున్నాయి.