రఘునాథ నాయకుడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ను → ను , చినాడు → చాడు, → using AWB
పంక్తి 1:
'''రఘునాథ నాయకుడు''' [[తంజావూరు]] ను ఏలిన [[తంజావూరు నాయక వంశపు]] మూడవ రాజు. తంజావూరు నాయక వంశపు రాజుల్లో అత్యంత ప్రసిద్ధుడు రఘునాథ నాయకుడు. ఇతడు 1600 నుండి 1634 వరకు పాలించాడు. [[కృష్ణదేవరాయలు| కృష్ణదేవరాయల]] అనంతరం అంతటివాడేకాక, అంతకుమించినవాడని ఎన్నదగిన [[ఆంధ్రభోజుడు]]. ఈయన రాజేకాకుండా [[సంస్కృతం]], [[తెలుగు]] ఉభయభాషలలోనూ కవిత్వం చెప్పగలవాడు. అంతేకాకుండా నూతన రాగాలను, తాళాలను కనిపెట్టి వీణల మేళవింపును సంస్కరించిన సంగీతశాస్త్ర నిపుణుడు. [[పారిజాతా హరణం]] అను గ్రంథమును చిరుత ప్రాయంలోనే [[సంస్కృతం]] లో రచించినాడురచించాడు. ఇప్పుడు లభిస్తున్న వీరి గ్రంథములు [[వాల్మీకి చరిత్ర]], [[రామాయణము]] అను పద్య కావ్యములు, [[నల చరిత్ర]] అను [[ద్విపద]] కావ్యము, [[జానకీ కల్యాణం]] అను చాటు కావ్యం, రుక్మిణీ కల్యాణం అను [[యక్ష గానం]] లు. ఈయన పాలనలో తంజావూరు సాహిత్యానికి, కళలకు మరియు [[కర్ణాటక సంగీతము]] నకు ప్రధాన కేంద్రమైనది.{{sfn|Vriddhagirisan|1942|pp=62–65}}
 
==ప్రారంభ జీవితం==
రఘునాథ నాయకుడు, అచ్యుతప్ప నాయకుని పెద్ద కుమారుడు. తండ్రి ఘోర తపస్సు చేసిన తర్వాత కలిగిన సంతానము. The ''రఘునాథాభ్యుదయము'' మరియు ''సాహిత్యనాట్యకార''లో ఈయన బాల్య వివరాలు వివరంగా ఇవ్వబడినవి. బాలునిగా ఉన్నప్పుడే రఘునాథునికి శాస్త్రాలు, యుద్ధవిద్యలు మరియు పాలనవ్యవహారాలలో మంచి శిక్షణ పొందాడు. రఘునాథ నాయకునికి అనేకమంది భార్యలు ఉండేవారు. ఈయన భార్యలలో ప్రముఖురాలైన కళావతి, "రఘునాథాభ్యుదయం"లో పట్టపురాణిగా వర్ణించబడింది. తంజావూరు నాయక వంశ చరిత్ర వ్రాసిన రామభద్రమ్మ రఘునాథుని భోగపత్ని{{sfn|Vriddhagirisan|1942|pp=62–65}}
 
తొలిరోజుల్లో రఘునాథ నాయకుడు గోల్కొండ రాజ్యంతో పోరాడి అందరి ప్రశంసలు అందుకొన్నాడు.{{sfn|Vriddhagirisan|1942|pp=62–65}} రఘునాథుడు1600లో రాజ్యపాలన బాధ్యతలను చేపట్టాడు. 1600 నుండి 1614 వరకు తండ్రితో సహపాలకునిగా పాలించాడు. 1614లో తండ్రి మరణం తర్వాత పట్టాభిషిక్తుడై, 1634లో మరణించేవరకు రాజ్యాన్ని పాలించాడు.
 
==కళా పోషణ==
పంక్తి 26:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:సంస్కృత రచయితలు]]
[[వర్గం:తెలుగు రచయితలు]]
"https://te.wikipedia.org/wiki/రఘునాథ_నాయకుడు" నుండి వెలికితీశారు