ఉప్పలపాటి వెంకటేశ్వర్లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఉప్పలపాటి వెంకటేశ్వర్లు''' సాంకేతిక శాస్త్ర పరిశోధకుడిగా ప్రవేశించి, అనతికాలంలోనే అపూర్వ విజయాలను సాధించి, గమ్య సాధనలో కార్యదీక్షతో అలుపెరుగని కృషి సల్పిన శాస్త్రవేత్త. ఆయన సాంకేతిక విద్యా జ్ఞానాన్ని జనసామాన్యంలోకి తెచ్చిన వ్యక్తి.
==జీవిత విశేషాలు==
ఆయన [[కృష్ణా జిల్లా]] లోని [[ఘంటసాల (కృష్ణా జిల్లా)]] గ్రామంలో [[డిసెంబరు 16]], 1927 లో జన్మించారు. ఆయన "యు.వి.వర్లు" గా సుపరిచితులు. ఆయన [[హిందూ కాలేజి]] (బందరు) లో డిగ్రీ పూర్తి చేసి, మద్రసు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి డి.ఎం.ఐ.టి ఆనర్స్ (బి.టెక్ తో సమానం) డిగ్రీని డిస్టింక్షన్ లో, ద్వితీయ ర్యాంకుతో అందుకున్నారు.<ref>[http://www.choudarymail.com/history/Notable%20Kammas/Engineering.html కమ్మ ప్రముఖులు]</ref>
 
సాధారణ రైతు కుటుంబంలో జన్మించి పేదరికాన్ని చవిచూసిన ఈయన ప్రముఖ శాస్త్రవేత్తగా రూపొందడానికి ప్రాథమిక విద్యాభ్యాసం నుండే అనేక కష్టాలు భరించాడు. డిగ్రీ అందుకున్న తర్వాత, 1954 లో ట్రాంబే (ముంబై) లోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చి సంస్థలో అసిస్టెంట్ సైంటిస్ట్ గా చేరారు. ఈ సంస్థలోనే తమ పరిశోధనా కృషికి శ్రీకారం చుట్టారు. నూక్లియర్ సాథన సంపత్తి మీద అధ్యయనం చేసారు. మరుసటి సంవత్సరం 1955 లో కేంద్రప్రభుత్వంనిర్వహనలోని అటమిక్ ఎనర్జీ శాఖలో ప్రవేశించారు.