ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), గా → గా , విద్యార్ధు → విద్యార్థు, విచ్చిన్న using AWB
పంక్తి 2:
'''ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు''' (Arcot Lakshmanaswami Mudaliar) ([[1887]] - [[1974]]) ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసూతి వైద్య నిపుణులు మరియు విద్యావేత్త. ఆయన కవల సోదరుడు [[ఆర్కాటు రామస్వామి మొదలియారు]] కూడా విద్యారంగంలో, న్యాయరంగంలో తమ ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించడంతో వీరిద్దరూ [[ఆర్కాటు సోదరులు]] పేరిట ప్రఖ్యాతులయ్యారు. లక్ష్మణ స్వామి మొదలియారు [[మద్రాసు విశ్వవిద్యాలయం]]లో అవిచ్ఛిన్నంగా 27 సంవత్సరాలు ఉప కులపతిగా పనిచేశారు.
== జీవిత విశేషాలు ==
వీరు ఆంధ్రప్రదేశ్ లోని [[కర్నూలు]]లో ఒక తమిళ [[మొదలియార్]] కుటుంబంలో జన్మించారు. అక్కడి మునిసిపల్ ఉన్నత పాఠశాల చదివేకాలంలో ప్రధానోపాధ్యాయుడైన [[కె.ఆర్. రఘునాథాచారి]] వీరి ఉన్నత భవిష్యత్తును ఊహించారు. వీరు మద్రాసు క్రైస్తవ కళాశాలలో బి.ఎ. (తెలుగు) పూర్తిచేసి, తర్వాత [[మద్రాసు వైద్య కళాశాల]] నుండి 1922 లో వైద్యవిద్య నభ్యసించారు.
 
== ఉద్యోగజీవితం ==
లక్ష్మణస్వామి మొదలియారు వైద్యవృత్తినీ, వైద్యవిద్యనీ చేపట్టి రెండింటిలోనూ ప్రతిభ చూపారు. అనంతర కాలంలో అనేకమైన పదవుల్లో ప్రపంచవైద్యసంస్థకు, దేశంలోని వైద్యసంస్థలకు సేవలు చేసినా ప్రధానంగా ఆయన చికిత్సలోనూ, బోధనలోనూ ఉద్యోగ జీవితాన్ని గడిపారు.