రోజారమణి: కూర్పుల మధ్య తేడాలు

+సమాచార పెట్టె
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , గా → గా using AWB
పంక్తి 10:
}}
 
'''రోజారమణి''' [[తెలుగు సినిమా]] నటి. [[భక్త ప్రహ్లాద]] లో [[బేబి రోజారమణి]]గా చాలా మంచి పేరు సంపాదించింది. ఆ సినిమాలో నటనకుగాను జాతీయ ఉత్తమ బాలనటిగా పురస్కారం పొందింది. 1970 మరియు 1980 వ దశకాల్లో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ సినిమాలలో కథానాయికగా నటించింది. సుమారు 400 సినిమాలకు డబ్బింగ్ కళాకారిణిగా పనిచేసింది. ఆమె బ్లూ క్రాస్ లో సభ్యురాలిగా చేరి సమాజ సేవ చేస్తోంది. [[మాస్టర్ తరుణ్]] అనే పేరుతో బాలనటుడిగా చక్కగా నటించి తరువాత యువ కథానాయకుడిగా స్థిరపడిన [[తరుణ్]] రోజారమణి కొడుకు.
 
==జీవిత విశేషాలు==
పంక్తి 17:
 
==కెరీర్==
ఆమె 5 సంవత్సరాల వయసులో [[భక్త ప్రహ్లాద]] సినిమాలో ప్రహ్లాదుడిగా నటించింది. ఏవీయం నిర్మించిన ఈ సినిమా మొట్టమొదటి పూర్తి నిడివి ఈస్ట్ మన్ కలర్ సినిమా. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నది. బాలనటిగా సుమారు 70 సినిమాల్లో నటించిన తర్వాత 13 ఏళ్ళ వయసులోనే ''చంబరతి'' అనే మలయాళ సినిమాలో కథానాయికగా నటించింది. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇదే సినిమా తెలుగులో కూడా రోజా రమణి కథానాయికగా [[కన్నె వయసు]] అనే సినిమా గా, తమిళంలో ''పరువ కాలం'' గా పునర్నిర్మించారు.
 
తరువాత అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీ, ఒడియా భాషల్లో దాదాపు 300 సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళ భాషల్లో సుమారు 400 సినిమాల్లో [[సుహాసిని]], [[మీనా]], [[రాధిక శరత్‌కుమార్|రాధిక]], [[రమ్యకృష్ణ]], [[రోజా సెల్వమణి|రోజా]], [[విజయశాంతి]], [[శిల్పా శెట్టి|శిల్పాశెట్టి]], [[దివ్యభారతి]], [[నగ్మా]], [[కుష్బూ]] లాంటి నటీమణులకు గాత్రదానం చేసింది.
పంక్తి 32:
*[[జరిగిన కథ]] (1969)
*[[సతీ అరుంధతి]] (1968)
*[[భక్త ప్రహ్లాద]] (1967)
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రోజారమణి" నుండి వెలికితీశారు