వాసిరెడ్డి నవీన్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
| weight =
}}
'''వాసిరెడ్డి నవీన్''' ప్రఖ్యాత సాహితీకారుడు. ఈయన [[1954]] [[మే 23]] న కృష్ణా జిల్లా వీరులపాడులో[[వీరులపాడు]] లో జన్మించారు. ఎం.యస్సీ వరలువరకు చదివి, రష్యన్ భాషలో డిప్లొమాను సాధించారు.1977 లో కెనరా భ్యాంకులో ఉద్యోగంలో చేరి 2001 మార్చిలో ఐచ్ఛిక పదవీ విరమణ చేశారు. హేతువాద ఉద్యమ కార్యకర్తగా అబ్రహం టి.కోవూర్ తో కలసి రాష్ట్రమంతటా తిరిగిన నవీన్ గుడివాడ, విజయనగరం లలో ఫిలిం సొసైటీలను యేర్పాటు చేశాడు. 1979 నుండి జనసాహితీ సాంస్కృతిక సమాఖ్యలో కార్యకర్తగా, కార్యవర్గ సభ్యునిగా, కార్యదర్శిగా, ప్రజాసాహితీ సంపాదకునిగా, వివిధ హోదాలలో పనిచేసి 1991 లో సంస్థ నుండి వైదొలగారు. ప్రధానంగా కథా సాహిత్యం పై ఎంతో మక్కువ కలిగిన నవీన్ 1990 లో కథా సాహితి ని యేర్పాటు చేసి [[పాపినేని శివశంకర్]] తో కలసి క్రమం తప్పకుండా ఉత్తమోత్తమమైన కథలతో "కథ" సంకలనాలను వెలువరిస్తున్నారు. [[అమెరికా]] నుండి వెలువడుతున్న "తెలుగునాడి" సంపాదకులుగా విదేశాంధ్రుల అభిమానాన్ని చూరగొన్న నవీన్ "తెలుగు వెలుగు" మాసపత్రిక సలహాదారుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. తానా ఆహ్వానంపై అమెరికాలోనూ , తెలుగు కళా సమితి ఆహ్వానంపై కువైట్ లోనూ నవీన్ పర్యటించి సాహిత్యోపన్యాసాలు చేశారు. తెలంగాణా పోరాటకథలు, తెలుగుకథ 60-85 సంకలనాలకు సంపాదకునిగా వ్యవహరించిన నవీన్ ప్రముఖ పత్రికలలో పలు విమర్శనా వ్యాసాలు , సమీక్షలు, కథలు, కవితలూ కూడా రాసారు. సికింద్రాబాద్ స్థిర నివాసంగా యేర్పరచుకొని సాహిత్యమే జీవితంగా గడుపుతున్న సహృదయుడు ఆయన.
 
 
"https://te.wikipedia.org/wiki/వాసిరెడ్డి_నవీన్" నుండి వెలికితీశారు