వీరులపాడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 126:
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
#మాభూమి రచయితలలో ఒకరైన [[వాసిరెడ్డి భాస్కరరావు]] గారు ఈ వూరికి చెందినవారే. '''వీరులపాడు చరిత్ర''' పేరుతో ఈ వూరి కథ పై ప్రామాణిక గ్రంథం కలదు.
#[[పాటిబండ్ల వెంకటపతిరాయలు]] లక్ష్మీదేవమ్మ, కోటయ్య దంపతుల కుమారుడు.హిందీ భాషాప్రవీణ , హిందీ ఉపాధ్యాయుడు. 28-డిసెంబరు,1914లో జన్మించిన ఈయన, తన 100వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈయన చిన్నప్పటి నుండి శాఖాహారి, ఉప్పు కారంలేని ఆహారం మాత్రమే తీసుకుంటారు. వందేళ్ళుగా ఇప్పటివరకూ, జలుబుగానీ జ్వరంగానీ లేవు. మహాత్మా గాంధీ గారి సహాయ నిరాకరణ, స్వదేశీ పిలుపుతో వీరుగూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఖాదీ వస్త్రాలతోనే పాఠశాలకు వెళ్ళేవారు. దేశవ్యాప్త పర్యటన సందర్భంగా అందరూ ఈయనను "ఆంధ్రా గాంధీ" అని పిలిచేవారు. గ్రామంలో ప్రాథమిక ఆసుపత్రి ఏర్పాటు, రహదారుల బాగుజేత, పాఠశాల అభివృద్ధి మొదలగు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పేదలకు పెళ్ళిఖర్చులు తగ్గించేటందుకు, ఆర్యసమాజంవారి సౌజన్యంతో, 150 వరకూ ఆదర్శవివాహాలు జరిపించారు. 1969లో ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసిన తరువాత, దక్షిణ, ఉత్తర భారతదేశంలో అన్ని రాష్ట్రాలనూ, ఆలయాలనూ, చారిత్రిక స్థలాలతోపాటు, మన రాష్ట్రంలోని అన్ని జిల్లాలూ, తాలూకా కేంద్రాలనూ సందర్శించారు. తన పర్యటన వివరాలతో ఒక పుస్తకం వ్రాశారు. తన గ్రామ చరిత్ర గురించి "చారిత్రిక గతిలో చైతన్య వాహిని - వీరులపాడు" అను పుస్తకం వ్రాశారు. [3]
#అంతర్జాతీయ సముద్రజలాల ప్రధాన న్యాయమూర్తి శ్రీ [[పాటిబండ్ల చంద్రశేఖరరావు]] [4]
"https://te.wikipedia.org/wiki/వీరులపాడు" నుండి వెలికితీశారు