"వరాహమిహిరుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (5), ను → ను , గా → గా , అధారము → ఆధారము, ప్రాధమిక → using AWB
చి (→‎"దకార్గాళాధ్యాయం": clean up, replaced: విధ్వాంసులు → విద్వాంసులు using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (5), ను → ను , గా → గా , అధారము → ఆధారము, ప్రాధమిక → using AWB)
}}
 
'''దైవజ్ఞ వరాహమిహిర''' '''Daivajna Varāhamihira''' ([[సంస్కృత భాష|సంస్కృతం]] : वराहमिहिर; [[505]] – [[587]]), లేదా వరాహమిహిరుడు, లేదా వరాహ, లేదా మిహిర. భారత [[ఖగోళ శాస్త్రజ్ఞుడు]], [[గణిత శాస్త్రజ్ఞుడు]], మరియు [[జ్యోతిష్య శాస్త్రవేత్త]]. [[ఉజ్జయిని]] లో ఒక విశ్వకర్మ బ్రాహ్మణ వంశం లోవంశంలో జన్మించాడు. [[చంద్రగుప్త విక్రమాదిత్యుడు II|చంద్రగుప్త విక్రమాదిత్య]] ఆస్థానములోని 'నవరత్నాల'లో ఒకడు.
==బాల్యం==
ఉజ్జయిని నగరానికి సమీపంలో క్రీ.శ 4 వ శతాబ్దంలో ఆదిత్యదాసుడనే జ్యోతిశ్శాస్త్ర పండితునకు జన్మించాడు మిహిరుడు. తండ్రి వద్ద గణిత జ్యోతిశ్శాస్త్రములు నేర్చుకున్న మిహిరుడు [[పాట్నా]] లో నాటి సుప్రసిద్ధ గణీత శాస్త్రవేత్త [[ఆర్యభట్టు]] ను కలుసుకొని ఆయనతో శాస్త్ర చర్చ జేశాడు. అనంతరము ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాలను అధ్యయనం జేయాలని నిర్ణయించుకొని అసాధారణ కృషి సలిపారు. ఆయన నిరంతర అధ్యయన ఫలితాలు అతని గ్రంథాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
 
శాస్త్రాలే గాక, పత్యేకించి గ్రీకు శాస్త్రాలు అధ్యయనం జేసినట్లు అక్కడకు వెళ్ళీ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రారంభంలో గణిత శాస్త్రజ్ఞుడైనా అనేక శాస్త్ర విషయాలను వివరించారు.
బృహత్సంహితలో గ్రహాల సంచారము, వాటి వలన భూమి మీద ప్రాణులకు కలుగు ఫలాలు, నక్షత్ర మండల ఉదయాదుల వల్ల ఫలితాలు, మేఘాలు, గర్భధారణ, భూకంప ఉల్క పాతములు, ఇంద్ర ధనుస్సు, ప్రతి సూర్యుడు, పిడుగు పడటం వంటి అనేక సృష్టి వైచిత్రాలు, శకున ఫలములు, వాస్తు ప్రకరణము, భూమిలో రకాన్ని బట్టి ఎంత లోతున నీళ్ళు దొరుకుతుందనే విషయం, వృక్షాయర్వేదము, వజ్ర లెపనము, జంతువులు, మణుల పరీక్ష తిథి, గోచార ఫలితాలు వంటి అనేక విషయాలు విస్తారంగా తెలియ జేశాడు.
==ఖగోళం==
చంద్ర, సూర్య గ్రహణాలు రాహు, కేతువుల వల్ల కాదని భూమి మీద నీడ పడటం చేత చంద్ర గ్రహణం, చంద్రుని నీడ పడటం చేత సూర్య గ్రహణము కలుగుతున్నాయని పూర్వ ఋషులు చెప్పిన సత్యాన్ని వివరించాడు. తోకచుక్కలు వాని రకాలు గురించి తెలిపాడు.
 
అనేక సందర్భాలలో వరాహమిహిరుడు గర్గ, పరాశర, అసిత దేవతల, కశ్యప, బృగు, వసిష్ట, మను, మయ వంటి ప్రాచీన ఋషుల మతము ప్రకారము అని విడి విడిగా ప్రస్తావించటం, అంతే కాక ఇంకా ఎంతో మందిని అనుసరించి (అన్యాన్ బహున్) అని చెప్పడం వలన ఆయన పరిశీలనాత్మక దృష్టి, వినయ సంపత్తి ద్యోతకమవుటయే కాక ఆ కాలములో అవన్నియు లభించి ఉండేవని తెలుస్తుంది.
=="దకార్గాళాధ్యాయం"==
"దకార్గాళాధ్యాయం" లో ఎలాంటి స్థలాలలో నీరు ఎంతెంత లోతుల్లో దొరుకుతుందో వివరించాడు. మనుష్యుని శరీరంలోని రక్త నాడులలో రక్యము ప్రవహించునటుల భూమిలో గల జల నాడులలో జల ప్రవాహములు గలవని వాటిని గుర్తించటానికి భూమిపై నున్న చెట్లు పుట్టలు ఉపయోగ పడతాయని నిరూపించాడు. అనంతర కాలంలో భారతీయ శాస్త్రవేత్తలు ఎవరు వీటి మీద పరిశోధన చేసి ప్రాచుర్యములోనికి తీసుకు రాలేదు. ఈ అధ్యాయములోని విషయాలు అధారముగాఆధారముగా ప్రస్తుతం వేగంగా పరిశోధనలు చేయుట జరుగుతుంది. భూగర్భ లోహం కనుక్కునేందుకు వరాహమిహిరుని సిద్ధాంతాలు ఉపయోగిస్తున్నారు. చెట్లు, ఆకులు పరిశీలించి వీటి అంచనాయే గాక, ఖనిజ సంపత్తిని అంచనా వేసే క్రొత్త శాస్త్రము ఈ అధ్యాయం ఆధారంగా ఉధ్బవించింది.
 
ప్రాధమికంగాప్రాథమికంగా గణిత శాస్త్రవేత్త అయిన వరాహమిహిరుడు ఖగోళ, జ్యోతిష, ద్రవస్థితి, భూగర్బ, ఆయుర్వేద వంటి అనేక శాస్త్రాలలో తన ప్రతిభ కనబరిచాడు. జ్యోతిష శాస్త్ర చంద్రుణ్ణీ పైకి తీస్తానంటూనే తన గ్రంథము స్థానాంతరం చెందటం వలనగాని, అనేకుల నోళ్ళలో సంచరించటం వలన గానీ, వ్రాయటంలో గాని లేక తానే గాని తప్పులు చేసి ఉండవచ్చునని విద్వాంసులు దోషాన్ని పరిహరించి పరిగ్రహించమని కోరటంలో ఎంతో గౌరవం పొందాడు.
==జ్యోతిష శాస్త్రంలో==
ఆయన ఒక జ్యోతిష శాస్త్రవేత్త. ఆయన జ్యోతిష శాస్త్రంలో మూడు ముఖ్యమైన విభాగాలను వ్రాసారు.
 
* బృహత్ జాతక - హిందూ ఖగోళ శాస్త్రం మరియు జాతక గ్రంథం లోగ్రంథంలో గల ఐదు ముఖ్య గ్రంథములలో ఒకటి.
* లఘు జాతక - దీనిని స్వల్ప జాతక అనికూడా పిలుస్తారు.
* సమస సంహిత - దీనిని "లఘు సంహిత" లేదా "స్వల్ప సంహిత" అని కూడా పిలుస్తారు.
* బృహత్ యోగ యాత్ర - ఇది "మహా యాత్ర" లేదా " యక్షస్వమెధియ యాత్ర" అని పిలువబడుతుంది.
* యోగ యాత్ర - ఇది "స్వల్ప యాత్ర" గా పిలువబడుతుంది.
* టిక్కని యాత్ర
* బృహత్ వివాహ పటాల్
 
అదేకాక ఆయన ఆర్యభట్టు కనిపెట్టిన సైన్ టేబుల్ యొక్క విలువలని మరింత నిరుష్టంగా చేసారు.
అంక గణితం (Arithmetic) లో సున్నా మరియు అభావిక సంఖ్యల (Negative Numbers) గుణాలని వివరించాడు.
 
==భౌతిక శాస్త్రంలో==
కాంతి కిరణాలు ప్రతిఫలనం చెందటం (Reflection) మరియు వక్రీకరణం (Refraction) చెందటం గురించి ఆయన రాసారు.
 
== బయటి లింకులు ==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2006135" నుండి వెలికితీశారు