విక్రమ్: కూర్పుల మధ్య తేడాలు

vinod
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , తో → తో using AWB
పంక్తి 33:
| weight =
}}
[['''విక్రమ్]]''' ([[ఆంగ్లం]]: Vikram) దక్షిణ భారతదేశానికి చెందిన ప్రముఖ నటుడు. పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించాడు. తెలుగు సినిమా [[శివపుత్రుడు]] తమిళ మూలమైన ''పితామగన్'' చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు.
 
[[తమిళనాడు]] లోని [[రామనాథపురం జిల్లా]] [[పరమకుడి]] ఆయన స్వస్థలం. <ref>జూన్ 7, 2009 [[ఈనాడు]] ఆదివారం అనుబంధం సంచిక ఆధారంగా</ref> ఇదే ఊరు నుంచి ముగ్గురు జాతీయ ఉత్తమ నటులుండటం విశేషం. వారు [[చారుహాసన్]], [[కమల్‌హాసన్]], [[సుహాసిని]]. అయితే విక్రమ్ కు ఆ అవార్డు రావడం వెనుక ఇరవయ్యేళ్ళ నిర్విరామమైన కృషి ఉంది. ఆయన చదువుకున్నది యార్కాడ్ లో. [[చెన్నై]] లోని లయోలా డిగ్రీ కళాశాల నుంచి బీఏ ఆంగ్ల సాహిత్యంలో పట్టా పుచ్చుకున్నాడు. ఎంబీఏ కూడా అక్కడే చదివాడు. అలా చదువుకోసం చెన్నై లోచెన్నైలో ఉన్నప్పుడు [[హాలీవుడ్]] సినిమాలు పిచ్చిగా చూసేవాడు. చిన్నప్పటి నుంచి చదువు మీద కన్నా ఇతర వ్యాపకాల మీద ఎక్కువగా సమయం గడిపేవాడు. [[కరాటే]], [[ఈత]] పోటీల్లో ప్రథముడిగా నిలిచేవాడు. [[గిటార్]], [[పియానో]] వాయించడం నేర్చుకున్నాడు. తరచూ నాటకాల్లో నటించేవాడు. వాటిలో చాలా భాగం ఆంగ్ల నాటకాలే. విక్రమ్ తండ్రి వినోద్ నటుడు కావాలనుకున్నారు కానీ చివరకు ఇంజనీరుగా స్థిరపడ్డారు.
== ఇష్టాలు ==
విక్రమ్ కు [[బైక్]] మీద స్వారీ అంటే చాలా ఇష్టం. ఆయనకు బాగా ఇష్టమైన బైక్ రాజ్‌దూత్.
 
== సినిమాలు ==
తెలుగులో ఆయన మొదటి సినిమా ''చిరునవ్వుల వరమిస్తావా''. అయితే ఆ సినిమా కొన్ని కారణాల వలన ఇప్పటికీ విడుదల కాలేదు. [[దాసరి నారాయణరావు]] దర్శకత్వం వహించిన [[బంగారు కుటుంబం]] సినిమాలో [[అక్కినేని నాగేశ్వరరావు]] తో కలిసి నటించడం ఒక గొప్ప అనుభూతి నిచ్చిందని చెబుతారాయన.
# [[చిరునవ్వుల వరమిస్తావా]] (1993)
# [[బంగారు కుటుంబం (1994 సినిమా)|బంగారు కుటుంబం]] (1994)
"https://te.wikipedia.org/wiki/విక్రమ్" నుండి వెలికితీశారు